S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

09/13/2018 - 05:25

కాబల్, సెప్టెంబర్ 12: అమెరికాతో చర్చలకు తాలిబన్లు సిద్ధంగా ఉన్నారు. ఇది వరకే లాంఛన ప్రాయంగా జరిగిన చర్చల్లో వ్యక్తమైన అభిప్రాయాలు, తీసుకున్న నిర్ణయాలను మరింత బలపరిచే విధంగా రెండో దఫా చర్చల కోసం తాము వేచి చూస్తున్నామని పేరు చెప్పడానికి ఇష్టపడని తాలిబన్ ప్రతినిధి వెల్లడించాడు.

09/13/2018 - 02:15

వాషింగ్టన్, సెప్టెంబర్ 12: భూమండలంలో మంచు పొరలు, సముద్రంలోని మంచు పర్వతాల్లో మార్పులపై పరిశోధనలు చేసేందుకు అమెరికా నాసా అంతరిక్ష సంస్థ కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. అత్యంత ఆధునిక లేజర్ పరికరాలతో కూడిన రోదసీ నౌకనును అంతరిక్షంలోకి ప్రవేశపెట్టేందుకు నాసా సన్నాహాలు చేస్తోంది. ఈ శాటిలైట్‌ను ఈ నెల 15వ తేదీన ప్రయోగిస్తారు. ప్రతి సెకనుకు 60వేల వరకు మార్పులను ఈ శాటిలైట్ నమోదు చేస్తుంది.

09/13/2018 - 02:08

టొరంటో, సెప్టెంబర్ 12: వ్యాయామానికి మన గుండె ఎలా స్పందిస్తుంది, రక్త ప్రసరణ ఎలా జరుగుతుందో మన జన్యుకణం ఆధారంగా నిర్ధారించవచ్చునని, అంతేకాకుండా దీని ద్వారా హృద్రోగ సంబంధ సమస్యలపై ముందుగానే హెచ్చరించవచ్చునని ఒక పరిశోధన వెల్లడించింది. వ్యాయామం చేసినా దాని ఫలితం ఒక్కొక్కరికీ ఒక్కోలా ఎందుకు ఉంటున్నదో ఇంతవరకు ఎవరూ పరిశోధనలు చేయలేదు.

09/13/2018 - 02:07

బీజింగ్, సెప్టెంబర్ 12: చైనాలో యుగర్ తెగకుచెందిన ముస్లింల విషయంలో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నామన్న నిరాధారమైన అభియోగాలతో ఆంక్షలు విధించేందుకు అమెరికా ప్రయత్నిస్తే, తీవ్రంగా వ్యతిరేకిస్తామని చైనా స్పష్టం చేసింది. చైనా అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే ఊరుకునే ప్రసక్తిలేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ వివరాలను ప్రతినిధి జెంగ్ షూంగ్ వెల్లడించారు.

09/12/2018 - 02:25

వాషింగ్టన్, సెప్టెంబర్ 11: బలోపేతమైన సరికొత్త వాణిజ్య బంధాల కోసం భారత్-అమెరికా మధ్య ఉన్నత స్థాయి చర్చలు మొదలయ్యాయి. ఈ రెండు దేశాల మధ్య సరికొత్త వ్యాపార సంబంధాలు ప్రస్తుతం ప్రారంభదశలో ఉన్నాయని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన సీనియర్ అధికారులు తెలిపారు. రక్షణ శాఖలకు సంబంధించిన సుదీర వ్యాపార సంబంధాల కోసం గతవారం భారత రాజధాని న్యూఢిల్లీలో చర్చలు జరిగాయి.

09/12/2018 - 06:18

ఇస్లామాబాద్: సరిహద్దుల్లో భారత్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ పాక్‌లోని భారత డిప్యూటీ హైకమిషనర్‌కు అక్కడి అధికారులు మంగళవారం సమన్లు జారీచేసి నిరసన తెలిపారు. భారత సైన్యం జరిపిన కాల్పుల కారణంగా పాకిస్తాన్‌లోని ఓ గ్రామస్థుడు మృత్యువాత పడ్డారని తాఖీదుల్లో పాక్ పేర్కొంది.

09/12/2018 - 02:47

ఐక్యరాజ్యసమితి: పర్యావరణ మార్పుల ప్రతికూల పరిణామాలపై ఐక్యరాజ్య సమితి మరోసారి తీవ్రస్వరంతో హెచ్చరించింది. ఇదేతరహాలో వాతావరణ మార్పులు కొనసాగితే విపత్తుల కూపంలో జారుకున్నట్టే అవుతుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల కేరళలో సంభవించిన ప్రకృతి బీభత్సాన్ని, దానివల్ల సంభవించిన అపార ఆస్తి, ప్రాణనష్టాలను కూడా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా ఉటంకించారు.

09/11/2018 - 01:02

చికాగో, సెప్టెంబర్ 10: హిందూ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాలని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాడు పిలుపునిచ్చారు. వరల్డ్ హిందూ కాంగ్రెస్(డబ్ల్యూహెచ్‌సీ) ముగింపుసమావేశంలో ఉప రాష్ట్రపతి కీలక ఉపన్యాసం చేశారు. ‘హిందూ అన్న పదమే అంటరానిదిగా ఉచ్ఛరించడమే తప్పు అన్నట్టుగా కొందరు ప్రవర్తిస్తున్నారు’అని ఆయన విమర్శించారు.

09/10/2018 - 01:55

చికాగో, సెప్టెంబర్ 9: ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందని ఉపరాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. గొప్ప సంస్కృతికి, సంప్రదాయాలకు నిలయం భారత్ అన్నారు. అమెరికాలో స్థిరపడిన తెలుగు ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ప్రపంచమంతా ఆర్థిక రంగంలో నిస్తేజం చోటు చేసుకుంటే, భారత్‌లో మాత్రం అభివృద్ధి వెలిగిపోతోందన్నారు.

09/10/2018 - 01:55

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 9: పాకిస్తాన్ నూతన అధ్యక్షుడుగా ఆరిఫ్ అల్వీ ఆదివారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు అత్యంత సన్నిహితుడు, అధికార తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన అరవై తొమ్మిదేళ్ల దంద వైద్యుడు ఆరిఫ్ అల్వీ పాకిస్తాన్‌కు 13వ అధ్యక్షుడు.

Pages