S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

09/10/2018 - 01:43

చికాగో, సెప్టెంబర్ 9: అమెరికాలోని చికాగోలో జరుగుతున్న ప్రపంచ హిందూ కాంగ్రెస్ (డబ్ల్యుహెచ్‌సి) సమావేశానికి హాజరైన హిందూ ప్రతినిధులకు వింత అనుభవం ఎదురైంది. లడ్డూలు కావాలా? అయితే మేమిచ్చే ‘ఐకమత్యం’ సందేశాన్ని వినండి అంటూ సమావేశ నిర్వాహకులు వారికి ఘన స్వాగతం పలుకుతూ ఒక స్వీట్ బాక్స్‌ను అందజేశారు. వాటిలో రెండు లడ్డూలు ఉండగా, అందులో ఒకటి మెత్తగా, రెండోది గట్టిగా ఉంది.

09/10/2018 - 01:42

చికాగో, సెప్టెంబర్ 9: భారత్ నవ నిర్మాణంలో ప్రవాస భారతీయులు కీలకపాత్ర వహించేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటుందని బీజేపీ నేత అమన్ సిన్హా చెప్పారు. గత ప్రభుత్వాలతో పోల్చితే, బీజేపీ ప్రభుత్వం ఎన్‌ఆర్‌ఏల సేవలను విస్తృత స్ధాయిలో వినియోగించుకోవాలన్న నిర్ణయంతో ఉందన్నారు. దీని నిమిత్తం ప్రణాళికను కూడా రూపొందించిందన్నారు. భారత్ అభివృద్ధికి ప్రవాస భారతీయులు ముందుకు రావాలన్నారు.

09/10/2018 - 01:05

వాషింగ్టన్, సెప్టెంబర్ 9: అమెరికా చరిత్రలో అప్రతిష్టపాలైన అధ్యక్షుడు నిక్సన్ కాలం నాటి చీకటి రోజులు మళ్లీ వస్తున్నాయా ? నిక్సన్‌ను వాటర్ గేట్ కుంభకోణం మింగేసింది. ఈ స్కాం వల్ల నిక్సన్ అమెరికా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీంతో నిక్సన్ అప్రతిష్టపాలయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్‌కు నిక్సన్ పట్టిన గతే పడుతుందా ? అమెరికాలో ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది.

09/09/2018 - 02:39

హౌస్టన్, సెప్టెంబర్ 8: మూడేళ్ల పెంపుడు కుమార్తె షేరీన్ మ్యాథ్సూ మృతి కేసులో ఇండో అమెరికన్ దంపతుల తీరుపై కఠినంగా వ్యవహరించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. వెస్లీ మ్యాథ్స్యూ, అతని భార్య సినీకి సంబంధించి ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా కార్డులను రద్దు చేయాలని నిర్ణయించినట్లు హౌస్టన్ కౌనె్సల్ జనరల్ ఆఫ్ ఇండియా అనుపమ్ రే చెప్పారు. ఈ పాప డల్లాస్‌లో ఇంటి నుంచి తప్పిపోయింది.

09/11/2018 - 03:54

ఐక్యరాజ్య సమితి (యుఎన్‌ఓ): హిందువులకు అతి పవిత్రమైన, వెలుగులకు చిహ్నమైన దీపావళి పండుగను పురస్కరించుకుని వచ్చే నెల ఐక్యరాజ్య సమితి పోస్టల్ ఏజెన్సీ ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేయనుంది.

09/09/2018 - 02:33

బాండంగ్, సెప్టెంబర్ 8: ఇండోనేసియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జావా ద్వీపంలో ఓ టూరిస్టు బస్సు లోయలోపడి 21 మంది దుర్మరణం చెందారు. పశ్చిమ జావాలోని బోగోర్ నుంచి ఓ కంపెనీ ఉద్యోగులను తీసుకెళ్తున్న బస్సు లోయలో బోల్తాపడింది. బస్సు సుకాబుని జిల్లాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ప్రమాదంలో 21 మంది చనిపోగా, తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించారు.

09/09/2018 - 01:45

చిత్రం..పారిస్‌లో శనివారం ఈఫిల్ టవర్ వద్ద ఓ క్రీడా కార్యక్రమంలో భాగంగా యోగా చేస్తున్న దృశ్యం

09/09/2018 - 02:48

ఖాట్మండు, సెప్టెంబర్ 8: ఏడుగురు ప్రయాణిస్తున్న ఓ హెలికాప్టర్ శనివారం నేపాల్‌లో కుప్పకూలింది. ఈ సంఘటనలో ఒక విదేశీయుడుసహా ఆరుగురు మృతి చెందారు. అత్యంత ఆశ్చర్యకరంగా ఓ మహిళ ప్రాణాలతో బయటపడింది. ఆల్టిట్యూట్ ఎయిర్ సంస్థకు చెందిన ఈ హెలికాప్టర్ శనివారం ఉదయం గోర్ఖాలోని సమాగున్ నుంచి బయలుదేరింది. అయితే, 32 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఖాట్మండు టవర్‌తో సిగ్నల్స్ కోల్పోయింది.

09/09/2018 - 07:16

చికాగో: సబ్సిడీలపై వస్తువులను ఇతర దేశాలకు పంపే విధానాన్ని నిలిపివేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ తెలిపారు. ఈ సబ్సిడీలపై వస్తువులను భారత్, చైనా లాంటి దేశాలకు పంపుతున్నామన్నారు. ఈ దేశాలేమో అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని, అమెరికా మాత్రం ఆర్థికంగా నష్టపోతోందన్నారు. అమెరికా కూడా ఒక అభివృద్ధి చెందుతున్న దేశమన్నారు.

09/09/2018 - 02:45

చికాగో, సెప్టెంబర్ 8: ఆధిపత్యం చెలాయించడం, పెత్తనం చేయడం హిందూ తత్వం కాదని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ఇక్కడ జరిగిన రెండవ ప్రపంచ హిందూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. 1893లో స్వామి వివేకానంద చికాగోలో జరిగిన ప్రపంచ మతాల సమ్మేళనంలో పాల్గొని, చారిత్రక ఉపన్యాసం చేశారు.

Pages