S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

05/01/2017 - 03:18

సియోల్, ఏప్రిల్ 30: అమెరికాతోపాటు దాని మిత్ర దేశమైన కొరియా భారీస్థాయిలో నిర్వహించిన వార్షిక సైనిక విన్యాసాలను ఆదివారం ముగించాయి. అయితే ఈ ఇరు దేశాలు ప్రత్యేకంగా సంయుక్త నావికాదళ విన్యాసాలను కొనసాగిస్తుండటంతో ఉత్తర కొరియా తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

04/30/2017 - 09:09

మనీలా, ఏప్రిల్ 29: ఫిలిప్పీన్స్‌లో తీవ్రమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.8గా నమోదైంది. భూకంప తీవ్రతకు అనేక భవనాలు బీటలు తీశాయ. భయాందోళనకు గురైన జనం ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ఇద్దరు పౌరులు గాయపడ్డారు. మిండానవో, ఇండోనేషియాల్లో సముద్ర కెరటాలు పెద్దఎత్తున ఎగిసిపడడంతో హెచ్చరికలు జారీ చేశారు.

04/29/2017 - 02:47

లండన్, ఏప్రిల్ 28: వాయు కాలుష్యం మనుషుల్లో గుండెపోటుకు దారితీస్తుందని నూతన అధ్యయనం హెచ్చరించింది. కలుషితమైన గాలిలోని సూక్ష్మ రేణువులు ఊపిరితిత్తుల గుండా రక్తప్రవాహంలో చేరి మనం గుండెపోటుకు గురయ్యే అవకాశాలను పెంచుతాయని ఈ అధ్యయనం వెల్లడించింది.

04/28/2017 - 02:43

లాహోర్, ఏప్రిల్ 27: ముంబయిపై ఉగ్రవాద దాడి కేసును తిరిగి దర్యాప్తు చేయడం సాధ్యం కాదని పాకిస్తాన్ స్పష్టం చేసింది. ఈ కేసు దర్యాప్తు చాలావరకు పూర్తయిందని, ఈ దశలో మళ్లీ దర్యాప్తు ప్రారంభించడం సాధ్యం కాదని పేర్కొంది. 26/11 దాడి కుట్రదారు, జమాత్ ఉద్ దావా (జెయుడి) చీఫ్ హఫీజ్ సరుూద్‌కు వ్యతిరేకంగా నిర్దిష్టమైన ఆధారాలను తమకు సమర్పించాలని డిమాండ్ చేసింది.

04/25/2017 - 07:58

పారిస్, ఏప్రిల్ 24:ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల తొలి దఫా ఓటింగ్‌లో ప్రజలు సంప్రదాయ పార్టీలను ఘోరంగా దెబ్బతీశారు. కొన్ని దశాబ్దాలుగా అధికారాన్ని పంచుకుంటూ వచ్చిన లెఫ్ట్, రైట్ పార్టీలను పక్కన పెట్టి ఐరోపా అనుకూల ఇమాన్యుయెల్ మాక్రన్‌కు మొదటి స్థానాన్ని, ఇమిగ్రేషన్ వ్యతిరేక నేషనల్ ఫ్రంట్ నాయకురాలు లీపెన్‌కు రెండోస్థానాన్ని కట్టబెట్టారు.

04/23/2017 - 03:22

వాషింగ్టన్, ఏప్రిల్ 22: అమెరికాలో అత్యున్నత వైద్య పదవి అయిన సర్జన్ జనరల్ పదవినుంచి భారత సంతతి వైద్యుడు వివేక్ మూర్తిని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తొలగించింది. తన వాళ్లను ఆ పదవిలో నియమించుకోవడానికి ట్రంప్ వివేక్ మూర్తిని ఆ పదవినుంచి తప్పించారు. 39 ఏళ్ల వివేక్ మూర్తిని నాలుగేళ్ల కాలానికి ఒబామా ప్రభుత్వం సర్జన్ జనరల్‌గా నియమించింది.

04/23/2017 - 03:18

వాషింగ్టన్, ఏప్రిల్ 22: అమెరికాలో అత్యున్నత వైద్య పదవి అయిన సర్జన్ జనరల్ పదవినుంచి భారత సంతతి వైద్యుడు వివేక్ మూర్తిని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తొలగించింది. తన వాళ్లను ఆ పదవిలో నియమించుకోవడానికి ట్రంప్ వివేక్ మూర్తిని ఆ పదవినుంచి తప్పించారు. 39 ఏళ్ల వివేక్ మూర్తిని నాలుగేళ్ల కాలానికి ఒబామా ప్రభుత్వం సర్జన్ జనరల్‌గా నియమించింది.

04/23/2017 - 03:24

వాషింగ్టన్, ఏప్రిల్ 22: పదవి చేపట్టిన వంద రోజులకు ముందే తన ఎన్నికల హామీలన్నిటినీ అమలు చేయాలనే అత్రుతతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేయడానికి, పన్నుల విధానాన్ని సరళీకృతం చేయడానికి, అలాగే విదేశాలకు తరలిపోతున్న ఉద్యోగాలను తిరిగి అమెరికాకు తీసుకురావడానికి ఉద్దేశించిన మూడు కార్యనిర్వాహక ఉత్తర్వులపై శుక్రవారం సంతకం చేశారు.

04/23/2017 - 02:27

వాషింగ్టన్, ఏప్రిల్ 22: భారత్, అమెరికా సంబంధాలు ఎంతో పరిపక్వమైనవని, ఇరు దేశాల్లో ప్రభుత్వాలు మారినా ఎన్నో దశాబ్దాల నుంచి అవి బలపడుతూనే ఉన్నాయని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు.

04/23/2017 - 02:01

కాబూల్, ఏప్రిల్ 22: ఆఫ్గనిస్తాన్‌లోని ఓ సైనిక స్థావరంపై తాలిబన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 140 మంది సైనికులు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. ఉత్తర ఆఫ్గనిస్తాన్‌లోని మఝర్ ఇ షరీఫ్ నగర శివార్లలోని సైనిక స్థావరంపై శుక్రవారం దాడి జరిగినట్టు రక్షణశాఖ ధృవీకరించింది. సైనిక దుస్తులు ధరించిన తాలిబన్లు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారని, కనీసం 140 మంది సైనికులు మరణించినట్టు వెల్లడించింది.

Pages