S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

08/28/2018 - 18:32

ఇస్లామాబాద్, ఆగస్టు 27: భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ వచ్చేనెలలో పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి షాహ్ మెహమూద్ ఖురేషీతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ వార్షిక సమావేశం సందర్భంగా సెప్టెంబర్‌లో నిర్వహించే ఒక కార్యక్రమంలో ఉభయ దేశాల విదేశీ మంత్రులు ఈమేరకు సమావేశం కానున్నట్టు మీడియా వర్గాలు తెలిపాయి.

08/27/2018 - 02:02

టోక్యో: జపాన్ ప్రధాని రేసులో తాను ఉన్నట్లు, ఈ పదవిని మళ్లీ చేపట్టాలని భావిస్తున్నట్లు షింజో అబే ప్రకటించారు. జపాన్‌కు దీర్ఘకాలం ప్రధానిగా సేవలు అందించిన పేరు తెచ్చుకోవాలని ఉన్నట్లు చెప్పారు. రాజ్యాంగ, ఆర్థిక సంస్కరణలు తేవాలని భావిస్తున్నట్లు చెప్పారు. కంజర్వేటివ్ లిబరల్ డెమాక్రటిక్ పార్టీ అధ్యక్షుడిగా షింజో అబే మళ్లీ ఎన్నిక కావడం లాంఛన ప్రాయమే.

08/27/2018 - 02:00

ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీకి ఫెడరల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్‌ఐఏ) సమన్లు జారీ చేసింది. సుమారు 35 మిలియన్ రూపాయల మనీల్యాండరింగ్ వ్యవహారంతోబాటు నకిలీ బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన కేసులో ఆయనతోబాటు ఆయన సోదరి ఫర్యాల్ తల్పూర్ సైతం ఎప్‌ఐఎ విచారణను ఎదుర్కోనున్నారు.

08/27/2018 - 01:37

లండన్, ఆగస్టు 26: దేశ సార్వభౌమాధికారానికి, సమగ్రత, ఆర్థిక సుస్థిరతకు చిహ్నంగా భావించే న్యాయ వ్యవస్థ, కేంద్ర ఎన్నికల సంఘం, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాలను ఛిన్నాభిన్నం చేసే విధంగా బీజేపీ నడుచుకుంటోందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఈ మూడు వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ దేశ సమగ్రతను దెబ్బతీస్తోందని ఆయన విమర్శించారు.

08/27/2018 - 01:39

లండన్: ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సభలో గలాభా సృష్టించేందుకు ముగ్గురు ఖలిస్తానీ మద్దతుదారులు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. స్కాట్‌లాండ్ పోలీసులు రంగ ప్రవేశం చేసి నినాదాలు చేస్తూ సభలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన లండన్‌లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సదస్సులో జరిగింది.

08/27/2018 - 01:42

న్యూయార్క్: ప్రఖ్యాత సెనేటర్, వియత్నాం యుద్ధ హీరో, అమెరికా రాజకీయ చరిత్రలో ఉద్ధండునిగా ఎదిగిన జాన్ మైకెన్ మరణించారు. 81 ఏళ్ల వయసున్న ఆయన గత కొంతకాలంగా బ్రెయిన్ క్యాన్సర్‌తో సతమతమవుతున్నారు. అరిజొనా ప్రాంతానికి ఆరుసార్లు సెనేటర్‌గా వ్యవహరించిన ఆయన భారత్‌తో స్నేహ సంబంధాలను కొనసాగించేవారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించేవారు.

08/26/2018 - 04:27

లండన్, ఆగస్టు 25: వచ్చే ఎన్నికల్లో బీజేపీకి, ప్రతిపక్ష పార్టీల కూటమికి మధ్య హోరాహోరీ పోటీ జరుగుతుందని, దేశంలో వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు మతతత్వ శక్తులు చేస్తున్న ప్రయత్నాలను తిప్పిగొడతామని ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. 1984లో సిక్కుల ఊచకోత బాధాకరమైన విషాదఘట్టమని ఆయన పేర్కొన్నారు. ఈ దురాగతాలకు బాధ్యులైన వారిని వంద శాతం కఠినంగా శిక్షించాల్సిందేనని ఆయన చెప్పారు.

08/26/2018 - 02:22

ఇస్లామాబాద్, ఆగస్టు 25: భారత్‌తో కాశ్మీర్ సహా అన్నిసమస్యలను పరిష్కరించుకోవాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ఉందని కొత్త విదేశాంగ శాఖ మంత్రి షా మెహమూద్ ఖురేషీ అన్నారు. ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలను చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందన్నారు. కొత్త ఢిల్లీతో సుహ్రృద్భావ వాతావరణంలో చర్చలు జరిపేందుకు తమప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. చర్చలు జరిపేందుకు భేషిజాలు తమకు లేవని ఆయన స్పష్టం చేశారు.

08/26/2018 - 02:16

న్యూయార్క్, ఆగస్టు 25: పెప్సికో కంపెనీ సీఈవోగా పనిచేస్తున్న భారత సంతతికి చెందిన మహిళ ఇంద్రానూరుూని గేమ్‌చేంజర్ ఆఫ్ ది ఇయర్-2018 అవార్డు వరించింది. వ్యాపార రంగంలో ఆమె సాధించిన లక్ష్యాలు, మానవతా విలువలు, ప్రపంచ వ్యాప్తంగా మహిళలు, చిన్నారుల ప్రగతికి చేయూత వంటి అంశాల ఆధారంగా ఓ అంతర్జాతీయ స్థాయి సాంస్కృతిక సంస్థ ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేసింది.

08/26/2018 - 01:51

ఇస్లామాబాద్, ఆగస్టు 25: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుచేసే దిశగా పాకిస్తాన్ ప్రభుత్వం ముందుకెళ్తోంది. నీతివంతమైన పాలన, ప్రభుత్వం నిధుల దుబారాను తగ్గించడం వంటి హామీలు ఎన్నిక సమయంలో ఇమ్రాన్‌ఖాన్ పార్టీ హామీ ఇచ్చింది. హామీలు అమలుచేసి ప్రజలను ఆకట్టుకునే దిశగా అడుగులు వేస్తోంది. దీన్లో భాగంగా ఉన్నతాధికారుల విమాన ప్రయాణాలపై కొత్త కేబినెట్ కఠినమైన నిర్ణయాలు తీసుకుంది.

Pages