S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

04/17/2017 - 04:39

వాషింగ్టన్, ఏప్రిల్ 16: అమెరికాలో ఒక వివాహిత జంటకు పిడుగు లాంటి వార్త ఎదురైంది. సహజ సిద్ధంగా గర్భాన్ని ధరించడంలో వీరికి ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు సాధారణ డిఎన్‌ఎ పరీక్షలు నిర్వహించగా ఆ దంపతులిద్దరూ ఒకే తల్లితండ్రులకు పుట్టిన కవల పిల్లలని తేలింది. దీంతో వారు నిర్ఘాంతపోయారు.

04/17/2017 - 04:37

ఇస్తాంబుల్ ఏప్రిల్ 16: అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్ నేతృత్వంలో ప్రభుత్వాధినేతకు విశేషాధికారాలు కల్పించే అంశంపై టర్కీలో ఆదివారం ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) జరిగింది. రాత్రి చివరి వార్తలందే సమయానికి 25 శాతం బ్యాలెట్ పెట్టెలను లెక్కించే సరికి అనుకూలంగా 63.2 శాతం ఓటర్లు మొగ్గు చూపగా, వ్యతిరేకంగా 36.8 శాతమే మద్దతులభించినట్లు ఎన్‌టీవీ చానల్ తెలిపింది.

04/17/2017 - 04:37

వాషింగ్టన్, ఏప్రిల్ 16: ఉత్తర కొరియా ఆదివారం ఒక బాలిస్టిక్ క్షిపణి పరీక్ష నిర్వహించేందుకు ప్రయత్నించి విఫలమైందని, ప్రయోగించిన కొద్దిసేపటికే ఆ క్షిపణి పేలిపోయిందని అమెరికా సైనిక దళం వెల్లడించింది.

04/17/2017 - 02:51

సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో తలపడిన తెలుగు రత్నాలు కిడాంబి శ్రీకాంత్, సాయ ప్రణీత్. తుది పోరులో శ్రీకాంత్‌ను ఓడించిన ప్రణీత్ కెరీర్‌లో మొదటిసారి సూపర్ సిరీస్ టైటిల్ సాధించాడు

04/17/2017 - 02:16

ఇస్లామాబాద్, ఏప్రిల్ 16: భారత్‌లో నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నప్పటికీ, మోదీ ప్రభుత్వం తీవ్రంగా హెచ్చరించినప్పటికీ గూఢచర్యం ఆరోపణలపై మరణ శిక్షను ఎదుర్కొంటున్న భారతీయ ఖైదీ కులభూషణ్ జాదవ్‌ను ఉగ్రవాదిగా చిత్రీకరించే ప్రయత్నాలను పాక్ మానుకోవడం లేదు.

04/16/2017 - 06:27

అమెరికాకు దీటుగా జవాబిస్తాం
ఇరాక్, లిబియా మాదిరిగా చూడొద్దు
మా ప్రభుత్వాన్ని కూల్చడం తేలికకాదు
తీవ్రస్థాయిలో హెచ్చరించిన ఉత్తర కొరియా
ప్యాంగ్యాంగ్‌లో భారీ సైనిక ప్రదర్శన
ప్రధాన ఆకర్షణగా ఖండాంతర క్షిపణులు

04/15/2017 - 02:37

ఐక్యరాజ్య సమితి, ఏప్రిల్ 14: సామాజిక న్యాయం, సమానత్వం కోసం జరిపే పోరాటంలో సంఘ సంస్కర్త, దళిత నాయకుడు బాబా సాహెబ్ అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని ఐక్యరాజ్య సమితి డిప్యూటీ సెక్రటరీ జనరల్ అమీనా అహ్మద్ సభ్య ఐరాస సభ్య దేశాలకు పిలుపునిచ్చారు. అంతేకాకుండా అన్ని వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా ఎదిగేలా చేయడం కోసం డిజిటల్ టెక్నాలజీ శక్తిని ఉపయోగించుకోవాలని కూడా ఆమె కోరారు.

04/15/2017 - 02:35

వాషింగ్టన్, ఏప్రిల్ 14: అక్రమంగా సరిహద్దులు దాటి దేశంలోకి ప్రవేశించేవారి సంఖ్య గణనీయంగా తగ్గడంతో ఉత్సాహంతో ఉన్న అమెరికా పాలనా యంత్రాంగం ఇప్పుడు సరయిన పత్రాలు లేకుండా వలస వచ్చిన వారిపై చర్యలు తీసుకునే పనిలో పడింది.

04/15/2017 - 01:30

కాబూల్, ఏప్రిల్ 14: ఇటీవలి కాలంలో వరసగా ఎదురుదెబ్బలు తింటున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు మరో చావుదెబ్బ తగిలింది. అఫ్గానిస్థాన్‌లోని ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) మిలిటెంట్ల స్థావరాలపై అమెరికా జరిపిన అతి పెద్ద బాంబు దాడిలో 36 మంది మిలిటెంట్లు చనిపోయారు.

04/15/2017 - 01:28

ఇస్లామాబాద్/ లాహోర్/ న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: పాకిస్తాన్ మిలిటరీ కోర్టు మరణ శిక్ష విధించిన భారతీయుడు కుల్‌భూషణ్ జాదవ్‌ను భారత కాన్సుల్ కలవడానికి అవకాశం కల్పించాలని భారత్ మరోసారి పాకిస్తాన్‌ను కోరింది. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషనర్ గౌతం బంబవాలే శుక్రవారం పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి తెహ్‌మినా జాంజువాతో భేటీ అయి కుల్‌భూషణ్ జాదవ్ అంశాన్ని చర్చించారు.

Pages