S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

08/16/2018 - 04:50

న్యూయార్క్, ఆగస్టు 15: భిన్నత్వంలో ఏకత్వం సాధించడం, ప్రజాస్వామ్యం పరిఢవిల్లేందుకు తీసుకుంటున్న చర్యల ద్వారా దక్షిణాసియాలోనే భారతదేశం చక్కని ఉదాహరణగా నిలిచిందని అమెరికా ప్రభుత్వం ప్రశంసించింది. 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను సందర్భంగా అమెరికా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ మిచాయెల్ పోంపెయో భారతదేశానికి శుభాకాంక్షలు తెలిపారు.

08/16/2018 - 04:45

లండన్, ఆగస్టు 15: నలంద బుద్ధుడు తిరిగి చేరుకుంటారు. 60 ఏళ్ల క్రితం బిహార్‌లోని నలందా ఆర్కియాలజీ మ్యూజియంలోని బుద్ధుడి విగ్రహం చోరీకి గురైంది. ఖండాంతరాలు దాటి చివరకు లండన్‌కు చేరుకుంది. లండన్‌లోని ఈ ఏడాది మార్చి నెలలో జరిగిన ఒక కళాఖండాల ప్రదర్శనలో ఈ బుద్ధుడి విగ్రహం ప్రత్యక్షమైంది. దీంతో లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు రంగంలోకి దిగారు.

08/13/2018 - 02:08

బీరుట్, ఆగస్టు 12: సిరియా వాయువ్య ప్రాంతంలో తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న నగరంలో జరిగిన పేలుళ్లలో 39 మంది పౌరులు మరణించారు. మృతుల్లో 12 మంది పిల్లలు ఉన్నారు. టర్కీ సరిహద్దుల్లో ఉన్న ఇడిబ్ ప్రావిన్స్‌లో శర్మద్ అనే నగరంలో ఈ పేలుళ్లు జరిగాయి. పేలుళ్ల ధాటికి రెండు భవనాలు కుప్పకూలాయి. భవనాల శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు.

08/13/2018 - 01:58

ఇస్లామాబాద్, ఆగస్టు 12: పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెల్చుకున్న ఏకైక పార్టీగా అవతరించిన మాజీ క్రికెటర్, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ పార్టీలో మరో 33 రిజర్వుడ్ సీట్లు జమ అయ్యాయి. ఈ రిజర్వుడ్ సీట్లు దక్కించుకోవడంతో ఆ పార్టీ బలం 158కు చేరుకుంది.

08/13/2018 - 01:55

కొలంబో, ఆగస్టు 12: శ్రీలంకలో భారత మూలాలున్న ప్రజలకు యూఎస్‌డీ 350 ప్రాజెక్టు ద్వారా కొత్తగా నిర్మించిన నివాస గృహాలను భారత ప్రభుత్వం ఆదివారం అందజేసింది. అక్కడి తేయాకు, రబ్బరు తోటల్లో పనిచేస్తూ పెద్దసంఖ్యలో భారతీయులు, ప్రత్యేకించి తమిళులు నివస్తున్నారు.

08/13/2018 - 00:22

లండన్, ఆగస్టు 12: నోబెల్ బహుమతి గ్రహీత విఎస్ నైపాల్ వయోభారంతో ఆదివారం ఇక్కడ కన్నుమూశారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. వలసవాదం, మతం, రాజకీయాలపై ఆయన విమర్శనాత్మకమైన రచనలు చేశారు. జీవితంలో చివరి క్షణాల్లో నైపాల్ మరణించే సమయంలో దగ్గర భార్య, ఆత్మీయులు ఉన్నారు. తాను అనుకున్నది సాధించే లక్ష్యం ఉన్న మహోన్నత రచయిత నైపాల్ అని భార్య లేడీ నదిరా నైపాల్ పేర్కొన్నారు.

08/13/2018 - 00:18

వాషింగ్టన్: ఊహకు కూడా అందని ఓ అద్భుతాన్ని నాసా ఆవిష్కరించింది. సూర్యుడికి అత్యంత సమీపంలోకి వెళ్లి, సమాచారం సేకరించడమేగాక, ప్రయోగాలు నిర్వహించే సామర్థ్యం ఉన్న పార్కర్ సోలార్ ప్రోబ్ మిషన్‌ను విజయవతంగా ప్రయోగించింది.

08/12/2018 - 02:15

తంపా (అమరికా): సూర్య మండలానికి పార్కర్ సోలార్ ప్రోబ్ వ్యోమనౌక ప్రయోగాన్ని ఆదివారానికి వాయిదా వేస్తున్నట్లు నాసా అంతరిక్ష ప్రయోగ సంస్థ ప్రకటించింది. ఈ వ్యోమనౌకను సూర్య గ్రహం బాహ్య వాతావరణం కరోనాలోకి పంపి అక్కడి వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు పంపించాలని అమెరికా అంతరిక్ష శాస్తవ్రేత్తలు నిర్ణయించారు. ఈ వ్యోమనౌకను ఆదివారం తెల్లవారుజామున 3.31 గంటలకు ప్రయోగిస్తామని నాసా పేర్కొంది.

08/12/2018 - 02:12

లండన్, ఆగస్టు 11: భారతదేశంలో స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలకు ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో లండన్‌లోని ట్రఫాల్గర్ స్క్వేర్ ప్రాంతంలో ఆదివారం ఖలిస్తాన్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ర్యాలీ జరపనున్నారు. భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రాన్ని విడగొట్టి ప్రత్యేక ఖలిస్తాన్ ఏర్పాటు చేస్తూ ఎన్నికలు నిర్వహించాలని ఎంతోకాలం నుంచి ఒక వర్గానికి చెందిన నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

08/11/2018 - 01:34

ఇస్లామాబాద్, ఆగస్టు 10: ఎన్నికల్లో ఓటు వేసేందుకు పాటించాల్సిన గోప్యత నిబంధనను ఉల్లంఘించి, బహిరంగంగా ఓటు వేసినందుకు పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న ఇమ్రాన్‌ఖాన్ ఎలక్షన్ కమిషన్‌కు బేషరతుగా రాతపూర్వక క్షమాపణ చెప్పారు. వచ్చే వారంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న ఇమ్రాన్‌కు ఈ వివాదం అవరోధంగా మారుతుందని భావిస్తున్న నేపథ్యంలో ఆయన క్షమాపణ చెప్పి వివాదానికి తెరదించారు.

Pages