S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

08/08/2018 - 03:56

కన్సాస్,ఆగస్టు 7: అమెరికా సబర్బన్ కన్సాస్ సిటీ బార్‌లో ఇద్దరు భారతీయులపై పాశవికంగా కాల్పులు జరిపి, మరో వ్యక్తిని గాయపడేలా చేసిన నిందితుడికి నేడు శిక్షపడే అవకాశం వుంది. ఈ మూడు కేసులకు సంబంధించి ఒలాతేకు చెందిన నిందితుడు ఆడం పురింటన్ తన నేరాన్ని అంగీకరించడంతో న్యాయస్థానం అతనికి ఏక కాలంలో మూడు జీవిత ఖైదు శిక్షలు విధించే అవకాశాలున్నాయి.

08/07/2018 - 03:29

ఖాడ్మండూ, ఆగస్టు 6: కైలాస-మానస సరోవర్ తీర్థయాత్రకు వెళ్లిన సుమారు 175 మంది భారతీయులు రెండు రోజులుగా నేపాల్‌కే పరిమితమయ్యారు. యాత్ర ముగించుకుని ఇళ్లకు తిరుగుముఖం పట్టిన వీరు అనివార్యంగా నేపాల్‌లోనే ఉండాల్సి వచ్చింది. వాతావరణం సహకరించకపోవండంతో విమాన రాకపోకలను ప్రభుత్వం రద్దు చేసింది.

08/07/2018 - 02:11

మటారం, ఆగస్టు 6: ఇండోనేషియాలోని లాంబాక్ ద్వీపం ప్రాంతంలో సంభవించిన తీవ్ర భూకంపం కారణంగా మృతుల సంఖ్య సోమవారం నాటికి 91కి చేరుకుంది. చాలా ప్రాంతాల్లో భూకంప తీవ్రతకు వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. వారం రోజుల కిందట 6.9 తీవ్రతతో భూకంపం సంభవించడంతో వివిధ రిసార్టుల్లో ఉన్న పర్యాటకులతోపాటు స్థానికులు దాదాపు 17 మంది మరణించారు.

08/07/2018 - 02:03

ఇస్లామాబాద్, ఆగస్టు 6: ఇమ్రాన్‌ఖాన్‌ను పాకిస్తాన్ ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఇటీవల ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్ఫాఫ్(పీటీఐ) మంగళవారం ఇక్కడ సమావేశమైంది. 65 ఏళ్ల ఇమ్రాన్‌ఖాన్‌ను ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు పీటీఐ పార్లమెంటరీ కమిటీ వెల్లడించింది. ఇస్లామాబాద్‌లోని ఓ హోటల్‌లో సమావేశమైన పీటీఐ పార్లమెంటరీ కమిటీ ఇమ్రాన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది.

08/06/2018 - 01:46

ఐక్యరాజ్య సమితి, ఆగస్టు 5: ప్రపంచ శాంతి స్థాపనకు భారత్ చేస్తున్న కృషి అమోఘమని ఐక్యరాజ్య సమితి ప్రశంసించింది. ఎన్ని అడ్డంకులు ఎదురవుతున్నప్పటికీ స్థిరంగా నిలబడిన భారత్ శాంతి కోసం అన్ని విధాలా సహకరించడం ముదావహమని పేర్కొంది. అవసరాలను గుర్తించి, అందుకు దీటైన స్థాయిలో సేవలు అందించడానికి భారత్ ఎప్పుడూ ముందు ఉంటున్నదని శాంతి పరిరక్షణ వ్యవహారాల అండర్ సెక్రటరీ జనరల్ జీన్ పియరీ లాక్రోక్స్ అన్నారు.

08/06/2018 - 02:02

జెనీవా: విమానం కూలిన ప్రమాదంలో 20మంది మృతి చెందిన సంఘటన స్విట్జర్లాండ్‌లో జరిగింది. స్విస్ ఎయిర్‌ఫోర్సుకు చెందిన ఈ విమానం టిసినో నుంచి బయలుదేరింది. ఇందులో 17 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బందితో ఉన్న ఈ విమానం పర్వత ప్రాంతంలో శనివారం కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 20 మంది మృతి చెందినట్టు అక్కడి అధికారులు ప్రకటించారు.

08/06/2018 - 02:01

లాహోర్: బాలికపై అత్యంత పాశవికంగా అత్యాచారం..హత్యలకు పాల్పడిన కేసులో కఠిన శిక్షను అనుభవిస్తున్న కరుడుగట్టిన కామాంధుడికి ఇలాంటి మరో మూడు కేసులతో సైతం సంబంధం ఉందని తేలడంతో పాకిస్తాన్ తీవ్రవాద నియంత్రణ ప్రత్యేక కోర్టు నిందితుడిపై నిప్పులు చెరిగింది. ఈ మానవ మృగానికి కేవలం ఒక మరణ శిక్ష సరిపోదని మరో 12 మరణ శిక్షలు విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.

08/06/2018 - 01:35

జకార్తా, ఆగస్టు 5: ఇండోనేషియాలో వారం రోజుల వ్యవధిలో రెండోసారి భూకంపం సంభవించింది. లాంబాక్ ఐలాండ్‌లో ఆదివారం ఉదయం భూకంప ప్రకంపనలతో జనం పరుగులు తీశారు. అమెరికా జియలాజికల్ సర్వే ప్రకారం రిక్టర్ స్కేలుపై భూకంప పరిమాణం తీవ్రత 7గా నమోదైనట్లు పేర్కొంది. గత వారం హాలిడే ఐలాండ్‌లో సంభవించిన భూకంపం వల్ల 17 మంది మరణించారు.

08/06/2018 - 01:19

తాష్కెంట్, ఆగస్టు 5: కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్‌లో ఆదివారం నాడు పర్యటించారు. భారత రెండవ ప్రధాన మంత్రి లాల్‌బహదూర్ శాస్ర్తీకి అక్కడ ఉన్న స్మారక చిహ్నం వద్ద సుష్మ పుష్పమాలికలతో నివాళులు అర్పించారు. శనివారం నాడు తొలిసారిగా తాష్కెంటుకు చేరుకున్న సుష్మ ఆదివారం ఉదయం లాల్‌బహదూర్ శాస్ర్తీ స్మారక చిహ్నం వద్దకు వచ్చారు.

08/06/2018 - 01:15

ఇస్లామాబాద్, ఆగస్టు 5: పాకిస్తాన్ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్‌ను ప్రధానమంత్రి అభ్యర్థిగా సోమవారం ప్రకటించేందుకు రంగం సిద్ధమైంది. ఈమేరకు ఈ పార్టీ వర్గాలు ఆదివారం స్పష్టమైన సంకేతాలను అందించడంతోపాటు ఇమ్రాన్ తన తొలి మంత్రివర్గాన్ని 15 నుంచి 20 మందితో ఏర్పాటు చేయవచ్చునని స్పష్టం చేశాయి.

Pages