S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

08/02/2018 - 22:14

పోర్ట్‌బ్లెయిర్, ఆగస్టు 2: అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో ప్రమాదానికి గురైన ప్యాసింజర్ షిప్ ఎంవీ స్వరాజ్ నుంచి 343 మంది సురక్షితంగా కోస్టుగార్డు సిబ్బంది ఒడ్డుకు చేర్చారు. కార్ నికోబార్‌కు 40 నాటికన్ మైళ్ల దూరంలో ఎంవీ స్వరాజ్ ప్రమాదానికి గురైంది. నౌకలోకి భారీగా నీరు చేరడంతో ఇండియన్ కోస్ట్‌గార్డ్ సహాయం అర్ధించారు.

08/02/2018 - 22:14

కాబూల్, ఆగస్టు 2: ఆఫ్గన్ రాజధాని కాబూల్ నగరంలో ఉగ్రవాదులు తెగబడ్డారు. భారత్‌కు చెందిన ఓ చెఫ్‌తోపాటు ఇద్దరు విదేశీయులను అపహరించుకెళ్లిన ఉగ్రవాదులు కాల్చిచంపేశారు. ఓ అంతర్జాతీయ ఫుడ్ సర్వీస్ కంపెనీలో ముగ్గురూ చెఫ్‌లుగా పనిచేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. సొడెక్స్ అనే కంపెనీలో వారు పనిచేస్తున్నారు.

08/02/2018 - 22:08

ఇస్లామాబాద్, ఆగస్టు 2: పాకిస్తాన్ ప్రధానిగా పదవీ బాధ్యతలను ఈ నెల 11న స్వీకరించనున్న ఇమ్రాన్ ఖాన్ ఈ కార్యక్రమాన్ని కేవలం దేశానికి మాత్రమే పరిమితం చేయాలని, సాధ్యమైనంత వరకూ సాదాసీదాగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల జరిగిన పాక్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ క్రికెటర్ ఇమ్రాన్ నాయకత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) అతి పెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే.

08/01/2018 - 01:54

లాహోర్, జూలై 31: పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించే అంశాన్ని తెహ్రీక్ ఎ ఇన్ఫాఫ్ పార్టీ చురుగ్గా పరిశీలిస్తోంది. భారత్‌తో పాటు అన్ని సార్క్ దేశాల ప్రధానులు, అధ్యక్షులనూ ఆహ్వానించాలని ఇమ్రాన్ పార్టీ యోచిస్తోంది.

08/01/2018 - 05:15

వాషింగ్టన్, జూలై 31: ఆరునూరైనా అమెరికా వలస చట్టాలను మార్చాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కంకణం కట్టుకున్నారు. వాటి మార్పునకు సొంత పార్టీలో ఎదురవుతున్న వ్యతిరేకతను సైతం ఆయన లెక్కచేయకుండా తన కృతనిశ్చయాన్ని వారికి వెల్లడించారు.

07/31/2018 - 22:06

దుబాయ్, జూలై 31: నిర్మాణ రంగంలోని ఓ ప్రముఖ ప్రైవేటు కంపెనీ ద్వారా పనులు చేసి బకాయిల కోసం ఎదురు చూస్తున్న 710 మంది కూలీలకు ఎట్టకేలకు కువైట్ ప్రభుత్వం అభయహస్తం చూపింది. కూలీలకు సంబంధించి తలెత్తిన వివాదం నేపథ్యంలో ఆ దేశాన్ని వదిలి భారత దేశానికి తిరుగుముఖం పట్టిన కూలీలు అష్టకష్టాలు పడుతున్నారు. వీరికి బకారుూలను సైతం ఆ ప్రైవేటు కంపెనీ చెల్లించలేదు.

07/31/2018 - 02:55

పెషావర్, జూలై 30: పాకిస్తాన్ కొత్త ప్రధానమంత్రిగా ఆగస్టు 11న ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. అప్పటికి తమ పార్టీ అన్ని అడ్డంకులను అధిగమించి ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యతో ముందుకు సాగుతుందని అన్నారు. మొత్తం 342 మంది సభ్యులు కలిగిన జాతీయ అసెంబ్లీకి 272 మంది ఎన్నికయ్యారు.

07/31/2018 - 02:48

ఇస్లామాబాద్, జూలై 30: అవినీతి కేసులో శిక్షపడి జైలు శిక్ష అనుభవిస్తూ అనారోగ్య కారణాల వల్ల ప్రిమియర్ పాకిస్తాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ (పిఐఎంఎస్)లో చికిత్స పొందుతున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్‌షరీఫ్ ప్రస్తుతం ఉన్న హాస్పిటల్ వార్డుని సబ్‌జైలుగా ప్రభుత్వం ప్రకటించింది.

07/31/2018 - 04:59

గౌహతి, జూలై 30: గత కొంత కాలంగా తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తూ వచ్చిన అసోం జాతీయ పౌరసత్వ రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సి) దాదాపు 40లక్షల మంది పౌరుల పౌరసత్వానే్న ప్రశ్నార్థకం చేసింది. రాష్ట్రంలోని ప్రజల పౌరసత్వాన్ని నిర్ధారించే జాతీయ పౌర రిజిస్టర్ ముసాయిదాను అసోం ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఈ రిజిస్టర్‌లో 40 లక్షల మంది పౌరుల పేర్లను తొలగించడంతో పౌరుల్లో అయోమయ పరిస్థితి ఏర్పడింది.

07/30/2018 - 02:18

ఇస్లామాబాద్, జూలై 29: పాకిస్తాన్ పార్లమెంటుకు జరిగిన ఎన్నిల్లో ఓ హిందూ సత్తా చాటాడు. పాక్ జాతీయ అసెంబ్లీకి ఎన్నికైన తొలి హిందువుగానేగాక, మొదటి ముస్లిమేతర అభ్యర్థిగా మహేష్ కుమార్ మలానీ చరిత్ర సృష్టించారు. 16 ఏళ్ల క్రితం పాక్‌లో ముస్లిమేతరులకు ఓటు హక్కు లభించినప్పటికీ, ఇనే్నళ్లకు జాతీయ అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం దక్కింది.

Pages