S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

07/30/2018 - 01:47

ఇస్లామాబాద్, జూలై 29: అవినీతి కేసులో జైలుపాలైన పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను జైలు నుంచి ఆసుపత్రికి తరలించాలని ఆపద్ధర ప్రభుత్వం జైలు అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం రావల్పిండిలోని ఆడియాల జైలులో నవాజ్ ఉన్నారు. గుండె నొప్పితో నవాజ్ ఆరోగ్యం క్షీణించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ప్రాథమిక వైద్య చికిత్సను అందించారు.

07/30/2018 - 01:45

కరాచీ, జూలై 29: పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న విపక్షాల ఆందోళనకు బలం చేకూరే విధంగా కరాచీ, సియాల్‌కోట నగరాల వద్ద ఖాళీ బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు లభించాయి. దీంతో ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందనే ఆరోపణలు నిజమేనంటూ ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలతో దాడిని తీవ్రం చేశాయి.

07/30/2018 - 01:43

ఇస్లామాబాద్, జూలై 29: సుమారు 470మందికి పైగా భారతీయులు పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతున్నారు. ఇందులో 418మంది మత్స్యకారులే కావడం గమనార్హం. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సుప్రీ కోర్టుకు సమర్పించిన ఓ నివేదిక ఈ గణాంకాలను వివరించింది. అలాగే పాకిస్తాన్‌కు చెందిన 357 మంది భారత జైళ్లలో శిక్షలను అనుభవిస్తున్నారు.

07/30/2018 - 01:41

వాషింగ్టన్, జూలై 29: భారత ప్రభుత్వం దేశంలోని మతపరమైన మైనార్టీ ప్రజలకు కనీవినీ ఎరుగని విధంగా మతరమైన సదుపాయాలను, స్వేచ్ఛను కల్పిస్తోందని, దీనివల్లనే సుస్థిరమైన ప్రజాస్వామ్యంతో విరాజిల్లుతోందని అమెరికాకు చెందిన హిందూ అడ్వకసీ గ్రూప్ ప్రకటించింది. అందుకే అమెరికా కూడా భారత్‌తో సంబంధాలు బలంగా ఉండాలని కోరుకుంటోంది.

07/30/2018 - 01:52

ఇస్లామాబాద్: పాకిస్తాన్ స్వాతంత్య్రదినోత్సవం రోజు ఆగస్టు 14వ తేదీన ప్రధానమంత్రిగా పీటీఐ పార్టీ అధినేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. దేశంలో కొత్త ప్రభుత్వాన్ని తమ పార్టీ ఏర్పాటు చేస్తుందని, మద్దతు కోసం ఇతర పార్టీలను సంప్రదిస్తున్నామని పీటీఐ పార్టీ ప్రకటించింది. ఈ నెల 25వ తేదీన జరిగిన ఎన్నికల్లో పీటీఐ 116 సీట్లు తెచ్చుకుని అతి పెద్ద పార్టీగా అవతరించంది.

07/30/2018 - 01:31

వాషింగ్టన్: భారత సంతతికి చెందిన బాల మేధావి కేవలం పదిహేనేళ్ల వయసుకే బయోమెడికల్ ఇంజినీరింగ్ కోర్సులో డిగ్రీ పూర్తిచేసి తదుపరి డాక్టరేట్ (పీహెచ్‌డీ) కోసం సన్నద్ధమవుతూ అందరి ప్రశంసలందుకుంటున్నాడు. క్లిష్టతరమైన విద్యాభ్యాస ప్రయాణ లక్ష్యాన్ని చిరుప్రాయంలోనే చేరుకుంటున్న ఆ బాలుడి పేరు తనిష్క్ అబ్రహాం.

07/29/2018 - 02:05

ఇస్లామాబాద్, జూలై 28: పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి కొద్దిరోజుల కిందట జరిగిన సాధారణ ఎన్నికల్లో మాజీ క్రికెటర్, పాకిస్తాన్ తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పార్టీ 116 స్థానాలు సాధించి అతిపెద్ద ఏకైక పార్టీగా ఆవిర్భవించింది. దేశంలోని మొత్తం 270 పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఈ నెల 25న సాధారణ ఎన్నికలు నిర్వహించారు.

07/29/2018 - 02:00

ఖాట్మండ్, జూలై 28: నేపాల్-ఇండియా దేశాల తొలి మేధో సదస్సు ఈనెల 31న ప్రారంభం కానుంది. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోడంపై నిర్వహించే సదస్సును నేపాల్ మాజీ ప్రధానమంత్రి, నేపాల్ కమ్యూనిస్టు పార్టీ మాజీ చైర్మన్ ప్రచండ ప్రారంభించనున్నారు.

07/29/2018 - 01:56

లాస్‌ఏంజిల్స్, జూలై 28: అస్సామీ చిత్రం ‘జొహిహోబొటే ధెమాలైట్’ (రెయిన్‌బో ఫీల్డ్స్) మూడు టాప్ అవార్డులను కైవసం చేసుకుంది. ఇక్కడ జరుగుతున్న 3వ లవ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రం ఉత్తమ మూవీగా సైతం ఎంపికైంది. ఉత్తమ నటిగా దీపన్నితా శర్మ, ఉత్తమ సంగీతంలో అనురాగ్ సైకియా ఎంపికయ్యారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రపంచంలోని దాదాపు 36 దేశాల నుంచి 150 చిత్రాలకు పైగా ఎంట్రీలో పాల్గొన్నాయి.

07/29/2018 - 01:44

వాషింగ్టన్, జూలై 28: యోగా, ఆయుర్వేద ఉత్పత్తులతో ప్రపంచ దేశాల్లో విశేష ప్రచారం పొందిన రాందేవ్ బాబా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య సారూప్యతలు చాలా ఉన్నాయని, వీరిద్దరి మనస్తత్వాన్ని, ప్రవర్తనను పోల్చుతూ న్యూయార్కు టైమ్స్‌లో ఆసక్తికర వ్యాసం ప్రచురితమైంది. రాందేవ్ బాబా ఒకరోజు భారత్ ప్రధాని అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని కూడా ఈ పత్రిక పేర్కొంది.

Pages