S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

11/08/2019 - 22:15

వాషింగ్టన్, నవంబర్ 8: అమెరికా ప్రభుత్వం హెచ్1బీ వీసాల జారీని మరింత కఠినతరం చేసింది. దీన్లో భాగంగా హెచ్1బీ వీసా దరఖాస్తు ఫీజును పెంచేసింది. హెచ్1బీ వీసా దరఖాస్తు ఫీజు 10 డాలర్లు పెంచినట్టు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఐటీ నిపుణులు అత్యధికంగా భారతీయులు ఎక్కువ మంది హెచ్1బీ వీసాపైనే అమెరికాకు ఉద్యోగాల కోసం వస్తుంటారు. అమెరికా కంపెనీల్లో పనిచేసేందుకు ఈ వీసాలపైనే వస్తుంటారు.

11/08/2019 - 00:09

మెల్‌బోర్న్, నవంబర్ 7: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌పై భారత్ మరోసారి పరోక్ష దాడికి దిగింది. ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించొద్దని గురువారం అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది. ఉగ్రవాదానికి మద్దతిస్తున్న, ఉగ్రవాదులు నిధులు సమకూర్చుకోవడానికి సహకరిస్తున్న వారందరికి వ్యతిరేకంగా ప్రపంచ స్థాయిలో ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చింది.

11/08/2019 - 00:02

వాషింగ్టన్, నవంబర్ 7: అమెరికాలో జరుగుతున్న పలు రాష్ట్రాలు, స్థానిక ఎన్నికల్లో నలుగురు భారతీయ అమెరికన్లు విజయం సాధించారు. వర్జీనియా సెనేట్‌కు ఎన్నికైన తొలి ముస్లిం మహిళ కావడం ద్వారా గజాలా హష్మి చరిత్ర సృష్టించారు. అలాగే మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు వైట్‌హౌస్ టెక్నాలజీ విధాన సలహాదారుగా పనిచేసిన సుహాస్ సుబ్రహ్మణ్యం వర్జీనియా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు.

11/07/2019 - 23:46

వాషింగ్టన్, నవంబర్ 7: ఒకపక్క తనపై అభిశంసన తీర్మానానికి డెమోక్రాట్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పట్టును మరింత బిగించారు. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ తనను ఎన్నుకోకపోతే దేశం తీవ్రస్థాయిలో మాంద్య పరిస్థితులకు గురవుతుందని హెచ్చరించారు. లూసియానాలో జరిగిన రిపబ్లికన్ ర్యాలీలో మాట్లాడిన ఆయన మళ్లీ తనదే విజయమన్న ధీమాను వ్యక్తం చేశారు.

11/07/2019 - 04:55

సిడాన్‌లో బుధవారం ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శన నిర్వహిస్తున్న లెబనాన్ విద్యార్థులు. విద్యావ్యవస్థను ప్రభుత్వం నీరుగారుస్తోందని ఆరోపిస్తూ గత మూడు వారాలుగా విద్యార్థులు సమ్మె చేస్తున్నప్పటికీ లెబనాన్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పరిస్థితి తీవ్రరూపం దాల్చింది.

11/07/2019 - 04:52

వాషింగ్టన్, నవంబర్ 6: హెచ్-1బి వీసాలు పొందడంలో భారత్‌కు చెందిన ఐటీ కంపెనీలకు భారీ దెబ్బ పడుతోంది. వివిధ దేశాల నుంచి వస్తున్న దరఖాస్తుల్లో తిరస్కరణకు గురవుతున్న వీసాల్లో భారత్‌కు చెందినవే 90 శాతం ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత హెచ్-1బి వీసాల జారీలో కఠినంగా వ్యవహారిస్తున్నది.

11/07/2019 - 04:50

మిలాన్‌లో బుధవారం ప్రారంభమైన కనోవా-తోవల్డ్‌సేన్ ప్రదర్శనలో ఆహూతులను ఆకట్టుకుంటున్న ‘సెల్ఫ్ పోట్రేట్ విత్ హోప్’ శిల్పం. 1861లో నెదర్లాండ్స్ శిల్పి బర్టెల్ తోవల్డ్‌సేన్ ఈ విగ్రహాన్ని మలిచాడు. తాజాగా ప్రారంభమైన ఎగ్జిబిషన్‌లో 17 విభాగాలకు చెందిన 150 శిల్పాలను ప్రదర్శనకు ఉంచారు. వీటిలో 1757-1822 మధ్యకాలానికి చెందిన యాంటానియో కనోవా చెక్కిన శిల్పాలు ఉన్నాయి

11/07/2019 - 04:45

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌ను ఈ సంవత్సరం డెంగ్యూ వ్యాధి గతంలో ఎన్నడూ లేనంతగా పీడిస్తోంది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు దేశంలో 44వేల మందికి ఈ వ్యాధి సోకిందని ఒక సీనియర్ ఆరోగ్య శాఖ అధికారి బుధవారం వెల్లడించారు. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం డెంగ్యూ వ్యాధి బాగా ప్రబలిందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్‌ఐహెచ్)లో సీనియర్ అధికారి డాక్టర్ రాణా సఫ్దర్ తెలిపారు.

11/07/2019 - 01:56

ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని టర్కీ రెస్టారెంట్ వద్ద ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనకారుల నిరసన. ఇరాక్ ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ప్లకార్డులు, బ్యానర్లు బాగ్దాద్ అంతటా దర్శనమిస్తున్నాయి. చివరికి విదేశీ రెస్టారెంట్లు, వివిధ కంపెనీలను కూడా ఆందోళనకారులు విడిచిపెట్టలేదు

11/06/2019 - 23:57

జెరూసలెం, నవంబర్ 6: పాలస్తీనా శరణార్థులకోసం పనిచేస్తున్న ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఏజెన్సీ అధినేత తన పదవి నుంచి తప్పుకున్నారు. ఏజెన్సీ నిర్వహణలో చోటు చేసుకున్న అక్రమాలపై సంస్థాగత విచారణ కొనసాగుతున్నందున అతడిని తాత్కాలికంగా పదవి నుంచి తప్పించినట్టు ఏజెన్సీ పేర్కొంది. యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏగా పేరు పొందిన ఐరాస ఏజెన్సీ కమిషనర్ జనరల్ పిర్రె క్రాహెన్‌బుహుల్ తాత్కాలికంగా తన పదవి నుంచి తప్పుకున్నారు.

Pages