S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

07/27/2018 - 02:19

ఇస్లామాబాద్, జూలై 26: దేశ ప్రధానిగా పగ్గాలు చేపట్టనున్న పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్‌ఖాన్ అనేక సంస్కరణలు చేపట్టనున్నారు. అట్టహాసాలు, ఆడంబరాలకు తమ ప్రభుత్వం పూర్తి వ్యతిరేకమన్న ఇమ్రాన్‌‘ప్రధాని కార్యాలయాన్ని విద్యా సంస్థల ప్రాంగణంగా తీర్చిదిద్దుతాం’ అని గురువారం ప్రకటించారు. ధనికులు ధనికులుగానే పేదలు ఎప్పుడూ పేదలుగా ఉండిపోవాలన్న విధానానికి తాము స్వస్తిచెబుతామన్నారు.

07/27/2018 - 02:31

న్యూఢిల్లీ, జూలై 26: క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడిగా అభిమానుల నీరాజనాలు అందుకున్న ఇమ్రాన్ ఖాన్ ఎంత సమర్థుడో అంతటి వివాదాల పుట్ట. గొప్ప ఆటగాడిగా ఎంత పేరుందో, వ్యక్తిత్వం లేని మనిషిగా అంతకంటే ఎక్కువ విమర్శలున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే, క్రికెట్‌లోనూ, నిజ జీవితంలోనూ అతనే హీరో, అతనే విలన్. పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా అతను ఎంతో మంది సమర్థులను వెలుగులోకి తీసుకొచ్చాడు.

07/27/2018 - 00:37

ఇస్లామాబాద్, జూలై 26: భారత్, పాకిస్తాన్ దేశాలు కాశ్మీర్ అంశంపై సామరస్యంగా కూర్చుని చర్చించుకుంటే పరిష్కారం లభిస్తుందని, రెండు దేశాల మధ్య ప్రధాన అడ్డంకి కాశ్మీర్ సమస్య అని ప్రధానిగా పగ్గాలు చేపట్టనున్న పీటీఐ పార్టీ అధినేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. పాకిస్తాన్ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తన్ తెహరిక్ -ఇ-ఇన్సాఫ్ ఆధిక్యత లభించింది.

07/26/2018 - 05:05

కంపాలా, జూలై 25: ఉగాండాలో మహాత్మాగాంధీ అంతర్జాతీయ హెరిటేజ్ సెంటర్‌ను నిర్మిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. మహాత్మాగాంధీ చితాభస్మాన్ని ఇక్కడ నిమజ్జనం చేశారని, ఇందుకు గుర్తుగా ఇక్కడ హెరిటేజ్ సెంటర్‌ను నిర్మించి ప్రపంచానికి గాంధీ త్యాగనిరతి, అహింసామార్గాన్ని చాటి చెబుతామన్నారు.

07/26/2018 - 21:17

ఇస్లామాబాద్, జూలై 25: పాకిస్తాన్ ఎన్నికల్లో పాకిస్తాన్ తెహ్రిక్-ఇ ఇన్సాఫ్ (పీటీఐ), పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) మధ్య పోటీ హోరా హోరీగా సాగుతోంది. హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. జాతీయ అసెంబ్లీలో కనీసం 172 సీట్లు తెచ్చుకున్న పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం అందుతుంది.

07/26/2018 - 21:16

ఇస్లామాబాద్, జూలై 25: పాకిస్తాన్ చరిత్రలో మొదటిసారిగా పాత సంప్రదాయాలను, ఛాందసవాదాన్ని బద్ధలు కొడుతూ అఫ్గానిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న పలు పాకిస్తాన్ గిరిజన గ్రామాలకు చెందిన మహిళలు బుధవారం పెద్దయెత్తున తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

07/26/2018 - 21:23

బీరుట్, జూలై 25: అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియా మరోసారి రక్తసిక్తమైంది. ఇస్లామిక్ గ్రూప్ పలు ప్రాంతాల్లో దాడులకు తెగబడడంతో బీరుట్ దద్దరిల్లింది. వరుస దాడుల్లో కనీసం నూరు మంతి మృతి చెందగా, గాయపడిన వారి సంఖ్య వందల్లో ఉంది. మృతుల్లో 35 మంది పౌరులు ఉన్నారని అధికారులు ప్రకటించారు. సిరియా సైన్యాన్ని లక్ష్యం చేసుకొని ఇస్లామిక్ గ్రూప్ ఈ దాడులకు తెగబడినట్టు తెలుస్తున్నది.

07/26/2018 - 02:06

కంపాల, జూలై 25: తన రెండు రోజుల ఉగండా దేశ పర్యటనను విజయవంతంగా ముగించుకున్న ప్రధాని నరేంద్రమోదీ దక్షిణాఫ్రికాకు పయనమయ్యారు. తన ఉగాండా దేశ పర్యటన పూర్తిగా విజయవంతమైందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేసుకునే నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు యొవోరి ముసేవెనితో ప్రధాని చర్చలు జరిపారు.

07/24/2018 - 02:32

చైనా: సాయుధ బలగాలను ఎప్పటికప్పుడు రిక్రూట్‌మెంట్ చేసుకుంటూ మరింత బలపడుతున్న చైనా ఇపుడు సముద్రతీర ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడులను ఎదుర్కొనేందుకు రోబోట్ సబ్‌మెరైన్లను వినియోగించే దిశగా ప్రయత్నాలకు సన్నద్ధమవుతోంది. ఆత్మాహుతి దాడులకు పాల్పడేవారిపై నిఘా ఉంచేందుకు కృత్రిమ మేధస్సుతో కూడిన సబ్‌మెరైన్లను రోబోట్‌లు స్వయంగా నడిపే దిశగా ముందుకు వెళ్తోంది.

07/23/2018 - 03:53

న్యూయార్కు, జూలై 22: అమెరికన్లకు సిక్కుమతం అంటే ఏమిటో తెలియదు. అందుకే తమ దేశ విద్యార్థులకు ప్రపంచంలోని మతాల వివరాలు తెలియచేసేందుకు పాఠ్యాంశాల్లో సిక్కుమతం అంశాన్ని చేర్చింది. సిక్కు సంప్రదాయాలు, మత పద్ధతులను విద్యార్థులు తెలుసుకోవాలని అమెరికా విద్యా శాఖ నిర్ణయించింది. దీని వల్ల విద్యార్థులకు ప్రపంచమంటే ఏమిటో తెలుస్తుందని విద్యా శాఖ నివేదికలో పేర్కొంది.

Pages