S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

07/11/2018 - 01:27

బీజింగ్, జూలై 10: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రెండోస్థానంలో కొనసాగుతున్న చైనా జనాభా విషయంలో దిగిజారిపోతోందా? అంటే ఔననే అంటున్నారు విశే్లషకులు. ఓ సర్వే ప్రకారం 2050నాటికి చైనా జనాభా భారత జనాభాలో 65 శాతానికి పడిపోతుందని అంచనా వేస్తున్నారు. దీనికి కారణం చైనా వాసుల్లో సంతానోత్పత్తి పడిపోవడంతోపాటు ఆ దేశం అవలంబిస్తున్న జనాభా విధానమేనని ఆ సర్వే చెబుతోంది.

07/11/2018 - 01:24

జలాలాబాద్, జూలై 10: అఫ్గానిస్తాన్ భద్రతా దళాలు ప్రయాణిస్తున్న వాహనంపై ఒక ఆత్మాహుతి దళం సభ్యుడు దాడి చేసిన సంఘటనలో దాదాపు 12 మంది దుర్మరణం చెందారు. వీరిలో చాలావరకు సాధారణ పౌరులు ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి. పేలుడు ధాటికి జలాలాబాద్ ఈశాన్య ప్రాంతంలోని పెట్రోలు బంకు సమీపంలో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారని సంబంధిత అధికార ప్రతినిధి అట్టాల్లాహ్ ఖొగ్యానీ తెలిపారు.

07/11/2018 - 01:17

చియాంగ్‌రాయ్, జూలై 10: థాయ్‌కేవ్ ఆపరేషన్ విజయవంతమైంది. థాయ్‌లోని ఒక గుహలో చిక్కుకున్న ఫుట్‌బాల్ కోచ్, 12 మంది బాలురు ఎట్టకేలకు సురక్షితంగా బయటపడటంతో ప్రపంచవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఆదివారం నుంచి అధికారులు నిరంతరంగా చేపట్టిన రిస్క్యూ ఆపరేషన్ పూర్తిగా విజయవంతమైంది. గుహలో చిక్కుకున్న 13 మంది క్షేమంగా బయటకు వచ్చారు.

07/10/2018 - 02:47

ఇస్తాంబుల్, జూలై 9: టర్కీలు ఆదివారం ఒక రైలు పట్టాలు తప్పడంతో 24 మంది మృతిచెందగా, వందలాదిమంది గాయపడ్డారు. దాదాపు 360 మంది ప్రయాణికులతో గ్రీక్-బల్గేరియా సరిహద్దు నుంచి ఇస్తాంబుల్‌లోని హల్‌కాలీ స్టేషన్‌కు వెళుతున్న రైలు కార్లు జిల్లాలోని సిరిలార్ గ్రామం వద్ద పట్టాలు తప్పింది. దీంతో రైల్లోని ఆరు బోగీలు నేలకొరిగాయి.

07/09/2018 - 04:18

మీ సాయ్ (థాయిలాండ్): ప్రజల ప్రార్థనలు.. అధికారుల దృఢచిత్తమైన కృషి ఫలించింది. గత 15 రోజులుగా చిమ్మ చీకటి.. చుట్టూ నీరు.. వెళ్లడానికి సరైన దారి లేని థాయిలాండ్‌లోని గుహల్లో తిండీతిప్పలు లేకుండా చిక్కుకుని ఉన్న ఫుట్‌బాల్ కోచ్, 12 మంది పిల్లల్లో ఆరుగురిని అధికారులు ఆదివారం సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మిగిలిన వారిని కూడా బయటకు తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు.

07/08/2018 - 05:28

లండన్, జూలై 7: దేశంలో పరిశోధనా రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి వీలుగా భారత్‌సహా వివిధ దేశాల శాస్తవ్రేత్తలు, విద్యావేత్తలకు యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) కొత్త వీసా విధానాన్ని ప్రకటించింది. శాస్త్ర, సాంకేతిక, పరిశోధన, విద్యాది రంగాల అభివృద్ధి కోసం ప్రస్తుతం టైర్-5 వీసా నిబంధనలకు కొత్త విధానం అనుసంధానమవుతుంది.

07/08/2018 - 05:43

టోక్యో, జూలై 7: దక్షిణ జపాన్‌లో భారీ వర్షాలు, వరదలు అల్లకల్లోలం సృష్టించాయి. వరద బీభత్సానికి 38 మంది మరణించినట్టు, నలుగురు గాయపడ్డారని అధికార మీడియా ఎన్‌హెచ్‌కే శనివారం వెల్లడించింది. సుమారు 50 మంది గల్లంతయ్యారని తెలిపారు. వొకాయమ ప్రాంతం పూర్తిగా జలమయమైంది. జనవాసాలన్నీ ఓ జలాశయాన్ని తలపించేలా ఉన్నాయి. వరద దృశ్యాలు స్థానిక టీవీ చానళ్లలో ప్రసారమయ్యాయి.

07/07/2018 - 04:29

పుత్రజయ, జూలై 6: తన వివాదాస్పద ప్రసంగాలతో యువత, ఇతరులను రెచ్చగొట్టడమే కాక, వారిని ఉగ్రవాదంవైపు ప్రోత్సహించాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇస్లామిక్ మత బోధకుడు జకీర్ నాయక్‌ను అతని స్వదేశమైన భారత్‌కు వెనక్కి పంపే ఉద్దేశం తమకు లేదని మలేషియా ప్రధాని మహతిర్ మహ్మద్ స్పష్టం చేశారు.

07/06/2018 - 23:27

ఖాట్మాండూ, జూలై 6: మానస సరోవర్ యాత్రకు వెళ్లి నేపాల్ హిమాలయ ప్రాంతాల్లో సిమికోట్‌లో చిక్కుకున్న 1220 మంది యాత్రికులను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు భారత్ ఎంబసీ ప్రకటించింది. హిల్సాలో ఉన్న యాత్రికులను రక్షించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. సిమికోట్ నుంచి రక్షించిన వారిని నేపాల్ గంజ్‌కు చేర్పించారు. భారత్ సరిహద్దుకు సమీపంలో నేపాల్ గంజ్, సుర్కేట్ అనే చిన్న పట్టణాలు ఉన్నాయి.

07/06/2018 - 23:23

వాషింగ్టన్, జూలై 6: అమెరికాలో నివసిస్తున్న ప్రతి గుజరాతీ అక్కడ నివసిస్తున్న ఐదు విదేశీ కుటుంబాలు భారత్‌ను సందర్శించేలా ప్రేరణ కల్పించాలని భారత ప్రధాని నరేంద్రమోదీ సూచించారు.

Pages