S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

07/06/2018 - 23:22

టుల్టెపెక్, జూలై 6: మెక్సికోలోని టుల్టెపెక్ నగరంలో బాణాసంచా దుకాణంలో సంభవించిన పేలుళ్లలో 24 మంది దుర్మరణం చెందారు. వరుస పేలుళ్లలో 49 మంది గాయపడ్డారు. పేలుళ్ల దాటికి పలు భవనాలు ధ్వంసమయ్యాయి. పేలుళ్ల సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి వెళ్లిన నలుగురు అగ్నిమాపక సిబ్బంది, ఇద్దరు పోలీసులు అధికారులు చనిపోయారు. బాణాసంచా కేంద్రంలో మొదటి సారి పేలుళ్లు జరిగిన వెంటనే అధికారులు అక్కడి చేరుకున్నారు.

07/06/2018 - 04:49

ఖాట్మాండూ, జూలై 5: పవిత్ర మానససరోవర్ యాత్రికుల కష్టాలు ఇంకా తొలగిపోలేదు. మానససరోవర్‌ను సందర్శించి వస్తున్న వెయ్యి మంది యాత్రికులు నేపాల్ పర్వత ప్రాంతాల్లో చిక్కుకుని ఉన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య యాత్రికులు అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని ఇండియన్ ఎంబసీ పేర్కొంది. భారత్ అధికారుల చొరవ వల్ల హిల్సాలో చిక్కుకున్న 250 మంది భారతీయ యాత్రికులను సురక్షితంగా బయట పడ్డారు.

07/05/2018 - 04:51

మార్సెల్లీ, జూలై 4: మృత్యువు ముంచుకొస్తున్నప్పుడు గుక్కెడు నీళ్లు తాగినా గుటక పడక మరణిస్తారని ఒక నానుడి. అలాగే కొన్ని మిలియన్లకు అధిపతి, తన వ్యాపార నైపుణ్యంతో ఎందరికో ఆదర్శంగా నిలిచిన చైనా టైకూన్ పిల్లచేష్టకు పాల్పడి పిట్టగోడ మీద నుంచి పడి మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. కేవలం గోడ మీద నుంచి కిందకు పడి తీవ్ర గాయాలతో మరణించడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.

07/05/2018 - 04:47

లండన్, జూలై 4: రష్యాలో పనిచేసిన మాజీ గూఢాచారి, అతని కుమార్తెపై విషప్రయోగం జరిగినట్లుగా భావిస్తున్న సంఘటన ఇంగ్లాండ్‌లో సంచలనం సృష్టిస్తోంది. లండన్‌కు సమీపంలోని శాలిస్‌బ్యూరీ పట్టణానికి 16 కి.మీ దూరంలో ఉన్న ఏమ్స్‌బ్యూరీలో ఈ ఘటన చోటు చేసుకుంది. రష్యాలో గూఢాచారిగా పనిచేసిన సెర్గి స్క్రిపాల్, ఆయన కుమార్తె యూలియాలు ఇంట్లో స్పృహ తప్పి పడిపోయి ఉన్న సమాచారం పోలీసులకు తెలిసింది.

07/05/2018 - 05:12

లండన్, జూలై 4: దివ్యాంగులకు ఇప్పటి వరకూ అమరుస్తున్న కృత్రిమ చేతుల స్థానంలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన సరికొత్త చేతులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. బ్రిటన్‌లోని ఇంపీరియల్ కాలేజ్ లండన్, జర్మనీకి చెందిన గోటిన్‌జెన్ యూనివర్శిటీ శాస్తవ్రేత్తల బృందం చేస్తున్న పరిశోధనలు ఫలించాయి. ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని వినియోగించుకునే కృత్రిమ చేతిని వారు రూపొందించగలిగారు.

07/03/2018 - 05:16

ఢాకా, జూలై 2: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. దీనితో ఆమె కనీసం మరో నెల రోజులు జైలులోనే గడపాల్సి ఉంటుంది. మూడు పర్యాయాలు ప్రధానిగా బంగ్లాదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పిన 72 ఏళ్ల ఖలిదా జియాపై అవినీతి ఆరోపణలతోపాటు, మర్డర్ కేసు కూడా ఉంది.

07/02/2018 - 02:49

వాషింగ్టన్, జూలై 1: వివాదాస్పదమైన ఇమ్మిగ్రేషన్ విధానాలను అవలంబిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిపై ఆ దేశంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఇండియన్ అమెరికన్లు సహా వేలాది మంది ట్రంప్ చర్యలపై ఆగ్రహం వ్యక్తం ఆ దేశంలోని పలు నగరాలలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ‘తల్లీబిడ్డలను వేరు చేసే ట్రంప్ వీసా విధానాలు మాకొద్దు’ అంటూ నినదించారు.

07/02/2018 - 02:47

టోక్యో, జూలై 1: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చల ద్వారా జపాన్ ఆయుధాల కొనుగోలు, మిసైళ్ల పరీక్షలు, ప్రదర్శన పోటీ నుంచి తగ్గుముఖం పట్టింది. ఇటీవల కిమ్‌తో ట్రంప్ సమావేశమై ఉత్తర కొరియా అణు నిరాయుధీకరణకు తలొగ్గాల్సిందేనని కోరిన విషయం విదితమే. దీంతో జపాన్ మిసైళ్ల ఎక్కువ సంఖ్యలో తయారు చేయాలని, సేకరించాలన్న విధానంపై పునరాలోచనలో పడింది.

07/02/2018 - 02:42

టోక్యో, జూలై 1: జపాన్ దక్షిణ ప్రాంతాన్ని పెను తుపాను తాకే ప్రమాద ముందని వాతావరణ శాస్తవ్రేత్తలు హెచ్చరించారు. ఒకినావా ప్రాంతంలోదయం నుంచే పెద్ద ఎత్తున రాక్షస అలలు, పెనుగాలులు చుట్టుముట్టాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురై సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు. ఒకినావా రాజధాని నహా నగరానికి భయంకరమైన తుపాను తాకే ప్రమాదం ఉందని, గంటకు 144 కి.మీ వేగంతో గాలులు వీచాయని జపాన్ వాతావరణ శాఖ పేర్కొంది.

07/02/2018 - 02:41

కిర్‌కుక్, జూలై 1: ఇరాన్‌లోని ఒక గిడ్డంగిలో ఉంచిన బ్యాలెట్ బాక్స్‌లను ధ్వంసం చేయడం లక్ష్యంగా జరిగిన ఆత్మాహుతి దాడిలో 19 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో తొమ్మిది మంది పోలీసులు, ఆరుగురు ఉగ్రవాదులు, నలుగురు పౌరులు ఉన్నారు. ఉత్తర బాగ్దాద్‌లోని కిర్‌కుక్‌లో ఉంచిన బ్యాలెట్ బాక్స్‌లు లక్ష్యంగా కారులో వచ్చిన ఆత్మాహుతి దళం వారు గిడ్డంగి మెయిన్‌గేట్‌ను ఢీకొట్టారు.

Pages