S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

06/17/2018 - 03:40

కాబూల్, జూన్ 16: ఆఫ్గనిస్తాన్‌లోని తూర్పు ప్రాంతంలో రంజాన్ పండగ సందర్భంగా ప్రార్ధనలు చేసేందుకు సమావేశమైన తాలిబన్ ఉగ్రవాదుల శిబిరం వద్ద జరిగిన ఆత్మహుతి దాడిలో 21 మంది మరణించారు. 41 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో, గాయపడిన వారిలో చాలా మంది తాలిబన్లు ఉన్నారని పోలీసు చీఫ్ గులాం సనారుూ స్టాంక్‌జీ తెలిపారు. ప్రార్ధనలు జరుగుతున్న సమయంలో తాలిబన్లు నిరాయుధులుగా ఉన్నారు.

06/17/2018 - 03:40

బీజింగ్, జూన్ 16: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పాటించే దేశాల జాబితాలో చైనా చేరింది. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సివో) శనివారం యోగా కార్యక్రమాలను నిర్వహించింది. యోగాసనాల ఈవెంట్‌ను చైనా నిర్వహించడం ఇదే తొలిసారి. ఐక్యరాజ్యసమితి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా డే గా ప్రకటించి, 2014 నుంచి అమలు చేస్తోంది. చైనాలో యోగాభాస్యం చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

06/17/2018 - 01:05

వాషింగ్టన్, జూన్ 16: అమెరికా గ్రీన్‌కార్డు కావాలంటే ఒక భారతీయుడు ఎనే్నళ్లు నిరీక్షించాలో తెలుసా ? కనీసం 150 ఏళ్లని వాషింగ్టన్‌కు చెందిన కాటో ఇనిస్టిట్యూట్ అంచనావేసి ప్రకటించింది. ఇటీవల అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ యుఎస్ గ్రీన్‌కార్డుకోసం పెండింగ్‌లోవున్న భారతీయుల దరఖాస్తుల వివరాలు విడుదల చేసింది.

06/16/2018 - 01:32

వాషింగ్టన్, జూన్ 15: అమెరికాలో హెచ్-4వీసాల రద్దుపై ట్రంప్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ దిశగా వడివడిగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ వీసాలను రద్దు చేసే యోచనతో ఉన్నట్లు ట్రంప్ ప్రభుత్వం కరాఖండిగా చెప్పింది. అమెరికాలో ఉద్యోగం చేయాలంటే హెచ్-1 బి వీసా ఉండాలి. కాగా దంపతుల్లో ఒకరికి హెచ్-1బి వీసా ఉంటే, మరొకరు ఉద్యోగం చేయడానికి హెచ్-4 వీసా ఉండాలి.

06/16/2018 - 01:28

వాషింగ్టన్, జూన్ 15: పాక్ తాలిబన్ ఉగ్రవాద మూకలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కరుడుగట్టిన ప్రపంచ ఉగ్రవాది, పాక్ తాలిబన్ చీఫ్ వౌలానా ఫజుల్లా అమెరికా భద్రతా బలగాల చేతిలో ఖతమయ్యాడు. ఆఫ్గనిస్తాన్ తూర్పు కునార్ ప్రాంతంలో యూఎస్ బలగాలు జరిపిన డ్రోన్ దాడిలో ఫజుల్లా మృతి చెందినట్టు ఆఫ్గాన్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు ధ్రువీకరించారు.

06/16/2018 - 01:25

వాషింగ్టన్, జూన్ 15: మధ్యవయస్కులు, వృద్ధులైన మహిళలు త్వరగా పడుకొని, వేకువనే లేవడం వల్ల వారిలో డిప్రెషన్‌కు అవకాశాలుండవని ఒక అధ్యయనం పేర్కొంది. నాలుగేళ్లపాటు 32,000 మంది మహిళలపై పరిశోధన నిర్వహించి ఈ ఫలితాన్ని సైకియాట్రిక్ రీసెర్చ్ జర్నల్‌లో ప్రచురించారు. సగటున 55 సంవత్సరాల వయసున్న మహిళలపై ఈ అధ్యయనాలను కొనసాగించారు.

06/16/2018 - 01:22

ఐరాస, జూన్ 14: కశ్మీర్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకె)ల్లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్నదన్న ఆరోపణలపై, అంతర్జాతీయంగా ఉన్నత స్థాయి స్వతంత్ర విచారణ జరపాలనేదానిపై మానవ హక్కుల చీఫ్ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో, తీసుకోవాల్సిన తదుపరి చర్యను యుఎన్ మానవ హక్కుల మండలి సభ్యులు నిర్ణయిస్తారని, ఐరాస ప్రతినిధి అంటానియో గుటెర్రిస్ తెలిపారు.

06/15/2018 - 03:52

వాషింగ్టన్, జూన్ 14: కిమ్ జోంగ్ ఉన్‌తో సమావేశం తర్వాత, ఇక అణుభయం లేదని ప్రకటించిన ట్రంప్ ఇప్పుడు మీడియాపై విరుచుకుపడ్డారు. ఉత్తర కొరియా నియంతతో కుదిరిన ఒప్పందాలను మీడియా తక్కువ చేసి చూపిందంటూ ఆగ్రహం వెళ్లగక్కారు. మంగళవారం ట్రంప్-కిమ్‌ల మధ్య కుదిరిన ఒప్పందం అస్పష్టంగా ఉన్నదంటూ దేశంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామం ట్రంప్‌కు మింగుడు పడటం లేదు.

06/15/2018 - 03:39

ఐరాస, జూన్ 14: పురుషులకు పితృత్వ సెలవలు మంజూరు చేయని 90 దేశాల్లో భారత్ కూడా ఒకటి అంటూ యునిసెఫ్ పేర్కొంది. అందుకు అవసరమైన జాతీయ విధానాలు భారత్‌లో అమల్లో లేకపోవడం విచిత్రమని వ్యాఖ్యానించింది. ప్రపంచంలో దాదాపు 2/3 వంతుల మంది అంటే 90 మిలియన్ల మంది ఏడాది లోపు చిన్నారులే. కానీ ఒక్క రోజు కూడా పురుషులకు చెల్లింపుతో కూడిన పితృత్వపు సెలవులు ఇవ్వడం లేదని యునిసెఫ్ విశే్లషించింది.

06/15/2018 - 03:36

లండన్, జూన్ 14: బ్రిటన్‌లో పనిచేసే, జీవించే హక్కు కోసం పోరాడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారత్‌కు చెందిన ఐటీ నిపుణుల సమస్యను పరిష్కరించేందుకు పార్టీలతో నిమిత్తం లేకుండా ఎంపీలు ముందుకు వస్తున్నారు. ఈ వారంలో బ్రిటన్ పార్లమెంట్‌లో వీరు ఐటీ నిపుణులకు మద్దతుగా నిలవనున్నారు.

Pages