S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

06/14/2018 - 03:50

మెయిన్‌పురి (యూపీ), జూన్ 13: ఉత్తరప్రదేశ్‌లో బుధవారం తెల్లవారుజామున సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది దుర్మరణం చెందగా, 25 మంది తీవ్రంగా గాయపడ్డారు.

06/14/2018 - 03:45

వాషింగ్టన్, జూన్ 13: భారత్‌కు అపాచి యుద్ధ హెలికాప్టర్లు , మిసైళ్లను విక్రయించే ఒప్పందానికి ట్రంప్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ వివరాలను పెంటగాన్ ప్రకటనలో పేర్కొంది. ఆరు ఏహెచ్-64ఇ అపాచీ హెలికాప్టర్లు, హెలిఫైర్, మిసైళ్లను భారత్ కొనుగోలు చేయనుంది. వచ్చే నెలలో భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ , రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్ అమెరికాకు రానున్నారు.

06/14/2018 - 04:34

మాస్కో, జూన్ 13: ప్రపంచ కప్ సాకర్ చాంపియన్‌షిప్‌కు నగారా మోగింది. క్వాలిఫయర్స్ అడ్డంకిని అధిగమించి, మెయిన్‌కు అర్హత సంపాదించిన 32 జట్లు పోరాడే ఈ మహాయుద్ధానికి సిద్ధంగా 736 మంది ఆటగాళ్ల మధ్య సంకుల సమరం గురువారం రష్యా, సౌదీ అరేబియా జట్ల మ్యాచ్‌తో మొదలుకానుంది. గ్రూప్ దశలో మొత్తం ఎనిమిది గ్రూపులు.. ఒక్కో గ్రూపులో నాలుగు జట్లు ఉంటాయ.

06/13/2018 - 02:11

బోస్టన్, జూన్ 12: ఇప్పటివరకు గోడకు ఆవల ఏం జరుగుతుందనేది ఎవ్వరికీ తెలియదు. కానీ కృత్రిమ మేధస్సు పుణ్యమాని ఇప్పుడు గోడకు ఆవల వ్యక్తుల కదలికలను కూడా తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం కృత్రిమ మేధో ఎక్స్-రే విజన్ వ్యవస్థను, ఎంఐటీ శాస్తవ్రేత్తలు అభివృద్ధి చేశారు. దీని సహాయంతో గోడకు ఆవల ఉన్న వ్యక్తుల కదలికలను స్పష్టంగా వీక్షించవచ్చు.

06/13/2018 - 01:44

సింగపూర్, జూన్ 12: దాదాపు ఏడు దశాబ్దాల వైరానికి స్వస్తి పలికి అమెరికా, ఉత్తర కొరియా దేశాలు చారిత్రక రీతిలో చేతులు కలిపాయి. అసలు జరుగుతుందా లేదా అన్న అనుమానాల నేపథ్యంలో సింగపూర్ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ మనసు విప్పి మాట్లాడుకున్నారు. కొరియాల మధ్య శాంతికి, అంతర్జాతీయ ప్రశాంతతకు బలమైన పునాదులు వేస్తూ చారిత్రక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.

06/13/2018 - 01:18

బ్రస్సెల్స్, జూన్ 12: ట్రంప్-కిమ్‌ల మధ్య సింగపూర్‌లో జరిగిన సమావేశాన్ని ‘కీలకం మరియు అవసరం’ అని ఈయూ పేర్కొంది. ఈ సమావేశం స్వాగతించదగ్గ పరిణామంగా పేర్కొంది. ఈ చర్చలు కొరియా ద్వీపకల్పంలో పూర్తి అణు నిరాయుధీకరణకు దారితీయగవన్న ఆశాభావాన్ని ఈయూ దౌత్యవేత్త ఫెడెరికా మొఘెరిని వ్యక్తం చేశారు. కొరియా ద్వీపకల్పంలో ‘నిరూపణీయ, సుస్థిరమైన అణు నిరాయుధీకరణ’ జరగాలన్నదే అంతర్జాతీయ సమాజం కోరుకుంటోందన్నారు.

06/13/2018 - 01:11

ప్రపంచ అధినేతలను కలుసుకోవడం మాట ఎలా వున్నా కనీసం దూరం నుంచైనా చూడాలన్న ఆసక్తి అందరికీ ఉంటుంది. సింగపూర్‌లో చారిత్రక శిఖరాగ్ర భేటీకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కలుసుకునేందుకు ఓ భారతీయ సంతతికి చెందిన వ్యక్తి మలేషియా నుంచి సింగపూర్ వచ్చాడు. దాదాపు 38వేల రూపాయలు ఖర్చు పెట్టి ఓ రాత్రంతా ఓ హోటల్‌లో బస చేశాడు. 25 ఏళ్ల మహారాజ్ మోహన్ అనే వ్యక్తి సోమవారం షాంగ్రీలా హోటల్‌లో ఓ రూమ్ తీసుకున్నాడు.

06/13/2018 - 01:08

సింగపూర్ శిఖరాగ్ర చర్చల్లో ఓ హాలీవుడ్ తరహా వీడియో దర్శనమిచ్చింది. ఇదేదో సినిమాలకు సంబంధించింది కాదు. తమతో శాంతి ఒప్పందం కుదుర్చుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఉత్తర కొరియా అధినేత కిమ్‌కు తెలియజేసేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ వీడియోను ప్రదర్శించారు. ప్రచ్ఛన్న యుద్ధం నాటి ఈ వైరి దేశాలు చేతులు కలిపితే ఎలాంటి శాంతి అవకాశాలు అందివస్తాయో ఈ వీడియో ద్వారా ట్రంప్ తెలియజెప్పారు.

06/13/2018 - 01:07

ట్రంప్ - కిమ్ శిఖరాగ్ర భేటీలో సింగపూర్ ప్రధాన న్యాయమూర్తులు ఒకప్పుడు వినియోగించిన 80 సంవత్సరాల నాటి టేక్‌వుడ్ టేబుల్ కీలక భూమిక పోషించింది. ఈ చారిత్రక టేబుల్ పైనే నేతలు, ప్రతినిధుల మధ్య సింగపూర్‌లోని కాపెల్లా హోటల్లో చర్చలు జరిగాయి. 4.3 మీటర్ల పొడవైన ఈ టేబుల్‌పైనే ట్రంప్ -కిమ్‌లు సంయుక్త ప్రకటనపై సంతకం చేశారు. ఈ శిఖరాగ్ర సదస్సు కోసం ఈ చారిత్రక టేబుల్‌ను అమెరికా ఎంబసీ అద్దెకు తీసుకుంది.

06/13/2018 - 01:44

చిత్రాలు..ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌తో చేసుకున్న ఒప్పంద పత్రాలను చూపుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
*ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్,
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల కరచాలనం

Pages