S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

06/13/2018 - 04:59

సింగపూర్: త్వరలో ఇరాన్‌తో ‘నిజమైన ఒప్పందం’ కదుర్చుకోవడమే తమ లక్ష్యమని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. ఒబామా యంత్రాంగం ప్రపంచంలోని ఇతర దేశాలతో కలిసి ఇరాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం నుంచి కొద్ది వారాలక్రితం ఏకపక్షంగా వైదొలగిన ట్రంప్ పైవిధంగా వ్యాఖ్యానించారు. 2015లో పీ5+1 (యుఎస్, యుకె, ఫ్రాన్స్, చైనా, రష్యా, జర్మనీ) దేశాలు ఇరాన్‌తో చర్చించి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

06/13/2018 - 00:13

ఉత్తర కొరియా ఇప్పుడు ప్రపంచ చరిత్రకెక్కింది. దశాబ్దాల వైరానికి స్వస్తి పలికి అమెరికాతో చారిత్రక రీతిలో శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. వరుసగా క్షిపణి ప్రయోగాలతో అగ్రరాజ్యాన్ని బెంబేలెత్తించిన కిమ్ అమెరికాతోనే ఒప్పందం కుదుర్చుకున్నారు. పూర్తిస్థాయిలో

06/12/2018 - 01:15

సింగపూర్, జూన్ 11: నెలల తరబడి ఎనలేని ఉద్రిక్తత... ఎదురుబడితే ఒకరినొకరు ఏం చేసుకుంటారోనన్న టెన్షన్... అమెరికా, ఉత్తర కొరియాల మధ్య సాగిన ఉద్రిక్తతలపై యావత్ ప్రపంచమే ఆందోళన చెందింది. అలాంటిది ఇరు దేశాలు శాంతి శకంలో అడుగుపెట్టబోతున్నాయి. అమెరికాతో చర్చలకు సిద్ధమంటూ ఉత్తర కొరియా ముందుకొచ్చింది. అందుకు అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ కూడా ఆహ్వానం పలికారు.

06/12/2018 - 01:08

వాషింగ్టన్, జూన్ 11: భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎవడుబడితే వాడు అమెరికాను దోచెయ్యడానికి మేమేమైనా పిగ్గీ బ్యాంకులమా? అంటూ ప్రశ్నించారు. అమెరికాను దోచుకునేందుకు ప్రయత్నించే ప్రతి దేశంతో వాణిజ్య సంబంధాలు తెంచుకునేందుకు ఎప్పుడూ సిద్ధమేనని ట్రంప్ తీవ్ర పదజాలంతో హెచ్చరించారు.

06/12/2018 - 00:45

నెలల తరబడి ఒకరంటే ఒకరికి పొసగని వైనం..ఆ ఇద్దరూ శాంతి మంత్రం జపిస్తూ సింగపూర్ వేదికగా కలుస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ల మధ్య మంగళవారం జరిగే చారిత్రక భేటీపైనే అందరి దృష్టి. సహకరిస్తే తాయిలాల వర్షమేనని అమెరికా ముందుగానే ప్రకటించింది. ప్రపంచ శాంతిపైనే ప్రభావం చూపించే ఈ శిఖరాగ్రం మలుపెటో వేచి చూడాల్సిందే!

06/11/2018 - 02:00

సింగపూర్, జూన్ 10: మరో 24 గంటల్లో ఆవిష్కృతం కానున్న అద్భుతాన్ని చవిచూసేందుకు ప్రపంచ దేశాలు కళ్లలో ఒత్తులేసుకుని మరీ ఎదురు చూస్తున్నాయి. ఆ అద్భుతం మరేదో కాదు. సింగపూర్ వేదికగా ట్రంప్-కిమ్ భేటీ.

06/11/2018 - 01:58

సింగపూర్, జూన్ 10: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్‌ల మధ్య మంగళవారం జరుగనున్న సమావేశం విజయవంతం కావాలని, శాంతికి బాటలు వేయాలని కోరుతూ పోప్ ఫ్రాన్సిస్ ప్రార్థనలు జరిపారు. ‘ఈ చర్చలు సానుకూల ఫలితాలనిచ్చి, భవిష్యత్తులో కొరియన్ ద్వీపకల్పంలో శాంతికి దోహదం చేయాలన్నదే నా ఆకాంక్ష’ అని పోప్ పేర్కొన్నారు.

06/11/2018 - 01:52

లండన్, జూన్ 10: కాంతివేగంతో మనం ప్రయాణించగలిగితే, మన గెలాక్సీ పాలపుంత డిస్క్‌ను దాటిపోవడానికి ఎంతకాలం పడుతుందో తెలుసా? సరిగ్గా రెండు లక్షల సంవత్సరాలు! అంచనా వేసినదానికంటే మన పాలపుంత డిస్క్ చాలా పెద్దదని శాస్తవ్రేత్తలు కనుగొన్నారు. సాధారణంగా పాలపుంత వంటి స్పైరల్ గెలాక్సీలకు డిస్క్‌లు ఉంటాయి. నిజానికి ఎంతో పలుచగా కనిపించే వీటిల్లోనే అత్యధికంగా నక్షత్రాలు కేంద్రీకృతమై ఉంటాయి.

06/11/2018 - 01:42

జింగ్‌డావో (చైనా), జూన్ 10: భారత్, పాకిస్తాన్ దేశాల రాకతో షాంఘై సహకార సంస్థ బలోపేతమైందని, ప్రాంతీయ దేశాల అభివృద్ధికి శుభపరిణామమని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అన్నారు. షాంఘై సహకార సంస్ధ సదస్సులో ఈ రెండు దేశాలకు సభ్యత్వం కల్పించడంతో, సభ్యుల సంఖ్య ఎనిమిదికి పెరిగిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సదస్సుకు హాజరు కావడాన్ని చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్ హర్షం వ్యక్తం చేశారు.

06/11/2018 - 03:55

జింగ్ డావో: షాంఘై సదస్సు సందర్భంగా మంగోలియా, కజఖస్తాన్, కిర్జిస్తాన్ దేశాధినేతలతో పరస్పర సహకారం, ఆర్థిక రంగంలో అభివృద్ధి అంశాలపై ప్రధాని నరేంద్రమోదీ ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య చర్చలు జరిపారు. ఈ మూడు దేశాల్లో అపారమైన వనరులు ఉన్నాయని, భారత్‌ను అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని మోదీ కోరారు.

Pages