S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

06/11/2018 - 01:39

జింగ్‌డావో (చైనా), జూన్ 10: భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్న నేపథ్యంలో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్‌తో కరచాలనం చేశారు. ఇరువురు నేతలు కరచాలనాల వరకే పరిమితమయ్యారు. ఎటువంటి చర్చలు, ప్రత్యేక భేటీలు చోటుచేసుకోలేదు. ఏసీసీవో సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్ విలేఖర్లను ఉద్దేశించి ప్రసంగించారు.

06/11/2018 - 01:37

జింగ్‌డావో, జూన్ 10: ఉగ్రవాద, వేర్పాటువాద, తీవ్రవాద గ్రూపు కార్యకలాపాలకు యువతదూరంగా ఉండాలని, ఈ సంస్థల కార్యకలాపాలను తిప్పిగొట్టాలని షాంఘై సహకార సదస్సు డిక్లరేషన్‌లో ప్రకటించారు. షాంఘై సహకార సదస్సుకు చైనా, భారత్, పాకిస్తాన్‌తో పాటు ఎనిమిది దేశాలు అధినేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చేసిన తీర్మానాన్ని షాంఘై సదస్సు విడుదల చేసింది.

06/11/2018 - 01:33

క్వింగ్‌డావో, జూన్ 10: భారత్-చైనాల మధ్య 2020 నాటికి 100 బిలియన్ యుఎస్ డాలర్ల మేర ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యంగా నిర్దేశించుకోవాలని చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ భారత్‌కు సూచించారు. ఇదే సమయంలో రెండు దేశాల మధ్య కొనసాగుతున్న పెద్దమొత్తంలో వాణిజ్యలోటును తగ్గించేందుకు భారత్ నుంచి బాసుమతీయేతర బియ్యాన్ని, చక్కెరను దిగుమతి చేసుకోవాలని చైనా భావిస్తోందని జీ జిన్‌పింగ్ పేర్కొన్నారు.

06/11/2018 - 01:26

షాంఘై (చైనా), జూన్ 10: ఇరాన్ అణు ఒప్పందాన్ని తుంగలో తొక్కి తమ దేశ ప్రయోజనాలకు అమెరికా భంగం కలిగించిందని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ అన్నారు. ట్రంప్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుందని ఆయన విమర్శించారు. ఇదే సమయంలో తమను ఆదుకునేందుకు రష్యా, చైనా, ఐరోపాదేశాలు ముందుకు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

06/11/2018 - 00:15

జింగ్‌డావో (చైనా), జూన్ 10: ఇరుగుపొరుగు దేశాల సార్వభౌమాధికారం, సమగ్రతను గౌరవిస్తూ పరస్పర సహకారం, అభివృద్ధిపై సంబంధాలను మెరుగుపరిచేందుకు షాంఘై సహకార సంస్థలోని సభ్యత్వ దేశాలు అంకితం కావాలని భారత ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఆదివారం ఇక్కడ షాంఘై సహకార సంస్థ (ఎస్‌సివో) దేశాల సదస్సు జరిగింది.

06/10/2018 - 02:51

వాషింగ్టన్, జూన్ 9: అమెరికా నేవీకి చెందిన అత్యంత విలువైన డాటాను చైనా ప్రభుత్వ హ్యాకర్లు అపహరించారు. సముద్రగర్భంలో సంచరిచే సబ్‌మెరైన్, ఏంటీషిప్ మిస్సయిల్, ఇతర అతి ముఖ్యమైన డేటాను చైనాహ్యాకర్లు దొంగిలించినట్టు వాషింగ్టన్ పోస్టు వెల్లడించింది.

06/10/2018 - 04:54

కింగ్‌డావో, జూన్ 9: చైనాతో భారత్ సంబంధాలు శాంతియుత స్ఫూర్తికి దోహదపడాలని భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. రెండు రోజుల చైనా పర్యటనలో భాగంగా షాంగై సహకార సంస్థ (ఎస్‌సిఓ) వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు నరేంద్ర మోదీ శనివారం ఇక్కడకు చేరుకున్నారు. ఎస్‌సిఓలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లభించిన తర్వత మోదీ చైనాకు రావడం ఇదే ప్రథమం. పాకిస్తాన్ సైతం ఇటీవల ఈ సంస్థలో శాశ్వత సభ్యత్వాన్ని పొందింది.

06/09/2018 - 04:14

వాషింగ్టన్, జూన్ 8: దలైలామాగా బౌద్ధమతంలోని లామాలనే టిబెటన్లు ఎంపిక చేసుకోవాలని ట్రంప్ ప్రభుత్వం సూచించింది. టిబెటన్ల మత విశ్వాసాల ప్రకారం ఎవరి జోక్యం లేకుండా దలైలామాగా లామాలకు చెందిన వారినే ఎంపిక చేసుకోవాలని అమెరికా స్పష్టం చేసింది. టిబెట్‌లో చైనా జోక్యాన్ని దృష్టిలో పెట్టుకుని అమెరికా ఈ సూచన చేసిందని భావిస్తున్నారు.

06/08/2018 - 04:12

ఉదయ్‌పూర్ (త్రిపుర), జూన్ 7: కేంద్ర ప్రభుత్వం ‘యాక్ట్ ఈస్ట్’ పాలసీని అమలు పరచడానికి తీవ్రంగా కృషి చేస్తున్నదని రాష్టప్రతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. గోమతి జిల్లాలోని త్రిపురసుందరి దేవాలయాన్ని, దక్షిణ త్రిపురలోని సబ్రూమ్‌ను కలిపే జాతీయ రహదారిని ఆయన గురువారం దేశానికి అంకితం ఇచ్చారు. 73.71 కిలోమీటర్ల దూరమున్న ఈ రహదారి ఇప్పటివరకు సింగిల్ లేన్‌గా ఉండేది.

06/08/2018 - 03:41

బాగ్దాద్, జూన్ 7: బాగ్దాద్‌లోని ఒక మసీదులో బుధవారం రాత్రి పేలుళ్లు జరగడంతో 18 మంది మృతిచెందారు. షియాలకు చెందిన మసీదులో ఉంచిన మందుగుండు సామగ్రి విస్ఫోటం చెందడంతో చుట్టుపక్కల 20 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ సంఘటనలో మృతుల సంఖ్య 18కి చేరుకోగా మరో 38 మంది గాయపడ్డారు. ఈ సంఘటన నేపథ్యంలో చుట్టుపక్కల ఇళ్లల్లో గాలింపు చర్యలు చేపట్టాలని ప్రధాని అల్-అబది భద్రతా దళాలను ఆదేశించారు.

Pages