S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

05/25/2018 - 01:48

వాషింగ్టన్, మే 24: రాజకీయ కారణాలను ఆధారంగా చేసుకుని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ట్విటర్ ఖాతాలోని ఫాలోవర్స్‌ని బ్లాక్ చేయరాదని ఫెడరల్ జడ్జి తీర్పులో పేర్కొన్నారు.

05/25/2018 - 01:45

బీజింగ్, మే 24: పారిశ్రామిక విప్లవం రాకముందు భూమి ఉష్ణోగ్రతలతో పోలిస్తే మరో నాలు గు డిగ్రీలు పెరిగే అవకాశమున్నదని ఒక అధ్యయనం వెల్లడించింది. 21వ శతాబ్దం ముగియడానికి ముందే ఈ ఉష్ణోగ్రతల్లో పెరుగుదల నమోదవుతుందని స్పష్టం చేసింది.

05/25/2018 - 01:43

వాషింగ్టన్, మే 24: అంగారక గ్రహంపై నాసా చేస్తున్న పరిశోధనల్లో కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఏడాది క్రితం నాసా ప్రయోగించిన క్యురియాసిటీ మార్స్ రోవర్ విజయవంతంగా మట్టి శాంపిల్స్‌ను సేకరించాయి. అంగారక గ్రహం పైన ఉన్న శిలలను తవ్వి పౌడర్‌ను సేకరించినట్లు నాసా పేర్కొంది. గ్రహంపైన ఉన్న దులుత్ అనే శిలను లక్ష్యంగా చేసుకుని రెండు ఇంచు ల మేరకు రోవర్ తవ్వినట్లు నాసా పేర్కొంది.

05/25/2018 - 01:41

న్యూయార్క్, మే 24: కాశ్మీర్ సమస్య పరిష్కారంలో అమెరికా ఎటువంటి పరిస్థితుల్లో జోక్యం చేసుకోదని అమెరికా దక్షిణాసియా దేశ వ్యవహారాల నిపుణుడు అలీస్సా ఐర్స్ స్పష్టం చేశారు. కాశ్మీర్ వివాదాన్ని పరిష్కరించేందుకు మూడవ పార్టీ జోక్యం చేసుకుంటే తమకు సమ్మతమేనని ఇప్పటికే ఇస్లామాబాద్ పలుసార్లు పేర్కొందని, కాని ఈ విషయం పట్ల అమెరికాకు ఆసక్తి లేదన్నారు.

05/25/2018 - 01:17

కోజిక్కోడ్, మే 24: నిఫా వైరస్ బారిన పడిన మరో వ్యక్తి చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించడంతో, ఇప్పటి వరకు ఈ వ్యాధికి బలైనవారి సంఖ్య 11కు చేరింది. వి.మూసా (61) అనే వద్ధుడు కొద్ది రోజులుగా ఒక ప్రైవేటు ఆసుపత్రిలో వెంటిలేటర్ సహాయంతో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించి గురువారం ఉదయం మరణించాడని, జిల్లా వైద్యాధికారణి డాక్టర్. జయశ్రీ విలేకర్లకు తెలిపారు.

05/24/2018 - 04:46

యాంగాన్, మే 23: మయన్మార్‌లో ఆ దేశ సైనికుల దాడికి భయపడి ఆ దేశంలో నివసిస్తున్న ఏడు లక్షల మంది రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్, ఇతర దేశాలకు పారిపోయారని, అమాయకులైన రోహింగ్యాలపై ఇలాంటి దాడులు సరికావని ఇంతకాలం అంతర్జాతీయ సమాజం సానుభూతితో పేర్కొంటుండగా, దానిపై పరిశోధన చేసిన అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వారిలోని క్రూరచర్యలను ప్రపంచానికి వెల్లడించింది.

05/23/2018 - 04:42

బీజింగ్, మే 22: ఉగ్రవాదం, డ్రగ్ ట్రాఫికింగ్, బహుళజాతి నేర సవాళ్లను సంయుక్తంగా ఎదుర్కోవడానికి ఎలాంటి మార్గాలు అనుసరించాలి, పరస్పర సహకారాన్ని ఎలా బలోపేతం చేసుకోవాలన్న దిశగా షాంఘై సహకార మండలి (ఎస్సీవో) సభ్యదేశాలు విస్తృత చర్చలు జరిపాయి.

05/22/2018 - 03:38

సోచి, మే 21: భారత్-రష్యాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య బంధం మరింత కీలక ప్రాధాన్యతను సంతరించుకుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో నల్లసముద్ర తీర ప్రాంత నగరమైన సోచిలో సోమవారం సమావేశమైన మోదీ ‘రెండు దేశాల బంధానికి విశ్వసనీయతే గీటురాయి’ అని పేర్కొన్నారు. తాజాగా ఈ మైత్రి మరింత ఉన్నతిని సంతరించుకోవడం ఘన విజయమని పేర్కొన్నారు.

05/21/2018 - 02:17

వాషింగ్టన్, మే 20: 1984లో సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన దాడుల్లో నష్టపోయిన ప్రతి కుటుంబానికి న్యాయం చేసేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం తాను చేయాల్సిందంతా చేస్తుందని సీనియర్ బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ స్పష్టం చేశారు. వాషింగ్టన్ డీసీలోని మేరీల్యాండ్ శివారులో జరిగిన వైశాఖి వేడుకల్లో పాల్గొన్న వందలాది మంది సిక్కులనుద్దేశించి ఆయన ప్రసంగించారు.

05/21/2018 - 01:51

బీజింగ్, మే 20: అరుణాచల్ ప్రదేశ్ మరోసారి వార్తలకు ఎక్కింది. భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్‌తో సరిహద్దు కలిగి ఉన్న చైనా త్వరలో తన భూభాగంలో భారీ ఎత్తున గనుల తవ్వకం పనులను చేపట్టనుణది. దీంతో ఈ ప్రాంతం మరోసారి భారత్-చైనా మధ్య వివాదాలు తలెత్తే అవకాశాలు లేకపోలేదని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు.

Pages