S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

07/17/2016 - 04:35

ఇస్లామాబాద్, జూలై 16: పాకిస్తాన్ మోడల్ ఖాందిల్ బాలోచ్ దారుణ హత్యకు గురైంది. ఆమె సోదరుడే పంజాబ్ రాష్ట్రంలోని ముల్తాన్‌లో బాలోచ్‌ను హత్యచేశాడు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. పాశ్చాత్య సంస్కృతిని వ్యతిరేకించేవారిని ఆమె తీవ్రంగా విమర్శించేది. దీనిపై సోషల్ మీడియాలో పోస్టుచేస్తూ సంచలన మోడల్‌గా పేరుతెచ్చుకుంది.

07/17/2016 - 03:57

అంకారా, జూలై 16: టర్కీలో అధ్యక్షుడిపై సైన్యం తిరగబడింది. అధికారాన్ని హస్తగతం చేసుకోవటానికి బీభత్సకాండ సృష్టించింది. దేశంలోని అన్ని నగరాల్లో విశృంఖల వీరవిహారం చేసింది. సైనిక ట్యాంకులు విచ్చలవిడిగా వీధుల్లో పెట్రేగిపోయాయి. కాల్పులు, బాంబుల మోతలతో రాత్రంతా జనం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడపాల్సివచ్చింది. 250 మందికి పైగా ప్రజలు మృత్యువాత పడగా 1400 మంది గాయాలపాలయ్యారు.

07/17/2016 - 03:47

ఇస్లామిక్ ప్రపంచంలో ఎంతో ఉన్నతభావాలు కలిగిన ఉదారవాద దేశంగా ఉన్న టర్కీలో సైనిక తిరుగుబాటు జరగడం అంతర్జాతీయ సమాజాన్ని విస్మయానికి గురి చేసింది. అధ్యక్షుడు ఎర్డోగన్ వ్యవహార శైలే ఇందుకు కారణమనే అభిప్రాయం ఉంది. కొంతకాలంగా టర్కీలో అనూహ్య మార్పులు జరుగుతున్నాయి. 1920లో ముస్త్ఫా కెమాల్ పాషా టర్కీని లౌకిక రాజ్యంగా ప్రకటించారు. నేటి నూతన టర్కీ నిర్మాణంకోసం విశేషంగా కృషి చేశారు.

07/17/2016 - 03:36

నీస్, జూలై 16: ప్రాన్స్‌లోని నీస్ నగరంలో శుక్రవారం ట్రక్కు దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద ముఠా ప్రకటించుకుంది. ఈ మేరకు ఉగ్రవాదులకు చెందిన ‘అముఖ్’ వార్తాసంస్థ తెలియజేసింది. ఐఎస్‌కు వ్యతిరేకంగా పోరాడాలని సంకీర్ణ దేశాలు పిలుపునిచ్చినందుకు ప్రతీకారంగా ఈ దాడి చేసినట్లు ఆ వార్తాసంస్థ తెలియజేసింది. ట్రక్కు దాడి జరిపింది తమ సైనికుడేనని కూడా ఐఎస్ స్పష్టం చేసింది.

07/17/2016 - 02:54

హైదరాబాద్, జూలై 16: హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన కాంగో (సౌత్ ఆఫ్రికా) మహిళ సింథియా హత్య కేసులో నిందితుడు రూపేష్‌కుమార్ కస్టడీ ముగిసింది. ఈనెల 4న సింథియాను ఆమె భర్త రూపేష్‌కుమార్ అతి దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని శంషాబాద్ సమీపంలోని మదనపల్లిలో పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే.

,
07/17/2016 - 02:34

అసలే ఉగ్రవాదుల వరుస బాంబు దాడులతో రక్తమోడుతున్న టర్కీ.. ఇప్పుడు ఏకంగా సైనిక తిరుగుబాటుకు అల్లల్లాడిపోయింది. ఈ ఏడాది జనవరి నుంచి సగటున నెలకు కనీసం రెండు మానవ బాంబు దాడులతో నిరంతర రుధిరధార పారుతున్న ఈ నాటో కూటమి దేశాన్ని శుక్రవారం రాత్రి అనూహ్యమైన రీతిలో జరిగిన సైనిక తిరుగుబాటుతో రక్తసిక్తం చేసింది.

07/17/2016 - 06:29

న్యూఢిల్లీ, జూలై 16: నైజీరియాలో అపహరణకు గురైన భారతీయులు శ్రీనివాస్, అనీష్‌లను ఉగ్రవాదులు విడుదల చేసినట్లు నైజీరియాలో భారత హైకమిషనర్ బిఎన్ రెడ్డి తెలిపారు. శ్రీనివాస్, అనీష్ శర్మలను ఉగ్రవాదులు శనివారం ఉదయం విడుదల చేసినట్లు బిఎన్‌రెడ్డి ఢిల్లీలోని ఏపి భవన్ రెసిడెంట్ కమిషనర్ అర్జా శ్రీకాంత్‌కు సందేశం పంపించారు.

07/16/2016 - 18:11

ముంబయి: పాకిస్తాన్‌లో యువతులను, బాలికలను హతమార్చడం దారుణమని బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ఆందోళన వ్యక్తం చేసింది. పాక్‌లో వివాదాస్పద మోడల్ ఖండీల్ బలోచ్‌ను ఆమె సోదరుడు గఫూర్ హత్య చేయడంతో ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇకనైనా మేల్కొనాలని సూచించింది. ఆడపిల్లల సంక్షేమానికి భారత ప్రధాని మోదీ అమలు చేస్తున్న ‘బేటీ బచావ్..

07/16/2016 - 18:07

లెబనాన్: ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో ట్రక్కుదాడి జరిపి 84 మంది ప్రాణాలను బలిగొన్నది తామేనని ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని ఉగ్రవాదుల వార్తా సంస్థ అమఖ్ శనివారం ప్రకటించింది. ట్రక్కు డ్రైవర్ తమ సంస్థలో సుశిక్షితుడైన సైనికుడని, తమను అంతం చేస్తామని సంకీర్ణదేశాలు ప్రకటించిన నేపథ్యంలో తాము నీస్‌లో దాడికి పాల్పడ్డామని ఐసిస్ స్పష్టం చేసింది.

07/16/2016 - 17:28

ఢిల్లీ: టర్కీలోని భారతీయులంతా క్షేమంగా ఉన్నారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌కు 1100కి.మీ. దూరంలోని టాబ్జాన్ నగరంలో వల్డ్ స్కూల్ ఛాంపియన్‌షిప్‌ పోటీ పాల్గొనేందుకు 38మంది అధికారులతో కలిసి 148మంది భారతీయ చిన్నారులు టాబ్జాన్ వెళ్లారు. టర్కీలో సైనిక తిరుగుబాటు నేపధ్యంలో టర్కీలో ఉన్న భారతీయుల గురించి ఆందోళన వద్దని సుష్మా అన్నారు.

Pages