S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

04/15/2018 - 05:43

వాషింగ్టన్, ఏప్రిల్ 14: అంతర్వుద్ధంతో అల్లాడుతున్న సిరియాపై అమెరికా నాయకత్వంలోని సంకీర్ణ దళాలు మెరుపు దాడులు చేశాయి. సిరియా అధ్యక్షుడు బషర్ అసద్ రసాయనిక దా డులకు వ్యతిరేకంగానే తామీ ప్రతికార చర్యలు చేపట్టామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సిరియాను నేరాల రాక్షసుడిగా అభివర్ణించిన ట్రంప్ ఫ్రాన్స్, యూకేతో కలిసి సం యుక్త దాడులు చేసినట్టు వెల్లడించారు.

04/14/2018 - 03:34

వాషింగ్టన్, ఏప్రిల్ 13: తాలిబన్ ఉగ్రవాదులు, హక్కానీ నెట్‌వర్క్‌కు పాకిస్తాన్ ఇప్పటికీ సర్గ్ధామంగా ఉందని అమెరికా సైనిక జనరల్ మార్క్ ఏ మిల్లీ ధ్వజమెత్తారు. ఉగ్రవాద సంస్థలకు పాక్ సహకరించినంత కాలం ఆఫ్గనిస్తాన్‌లో శాంతి నెలకొల్పడం కష్టంతో కూడుకున్నదేనని పెంటగాన్ వర్గాలు హెచ్చరించాయి. ఉగ్రవాద సంస్థలతో అంటగాగుతున్న పాక్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక ఆర్థిక ఆంక్షలు విధించారు.

04/13/2018 - 04:16

ఈరోడ్, ఏప్రిల్ 12: కావేరీ నదీజలాల సమస్యను పరిష్కరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు ఏవిధమైన చర్యలు తీసుకోవడంలేదంటూ, గురువారం తమిళనాడులోని ఈరోడ్‌లో 25 ఏళ్ల యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మాహుతి యత్నానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ధర్మలింగం అనే యువకుడు ఒంటికి నిప్పంటించుకోవడంతో 90శాతం గాయపడ్డాడు.

04/12/2018 - 21:02

ఐక్యరాజ్యసమితి, ఏప్రిల్ 11: ‘అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవ పట్టించడానికే ఐక్యరాజ్య సమితి యత్నిస్తోంది. ఐరాస సిరియా వ్యతిరేక శక్తుల చేతిలో కీలుబొమ్మగా మారింది. ఒక సర్వసత్తాక రాజ్యంపై, ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు తీర్పు చెప్పడం సిగ్గుచేటు’ అం టూ ఐక్యరాజ్య సమితిలో రష్యా ప్రతినిధి వాసిల్లీ నెబెంజియా విమర్శించారు.

04/10/2018 - 02:57

న్యూయార్క్, ఏప్రిల్ 9: భారత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రెండోసారి కూడా విజయం సాధిస్తుందని, అవినీతి ఆనవాళ్లను పూర్తిగా తుడుచిపెట్టేస్తుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి అన్నారు.

04/10/2018 - 02:57

వాషింగ్టన్, ఏప్రిల్ 9: తన లాయర్ అడిగే ప్రశ్నలకు డోనాల్డ్ ట్రంప్ ప్రమాణం చేసి మరీ సమాధానం చెప్పాలని, పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ కోరింది. ఈ మేరకు లాస్ ఏంజిలిస్‌లోని ఫెడరల్ కోర్టులో తన లాయర్ ద్వారా పిటిషన్ దాఖలు చేసింది. 2016 అధ్యక్ష ఎన్నికలకు ముందు డోనాల్డ్ ట్రంప్ తన లాయర్ మైఖెల్ కోహెన్ ద్వారా 1,30,000 అమెరికన్ డాలర్లను తనకు చెల్లించారని డేనియల్స్ చెబుతోంది.

04/08/2018 - 02:12

వాషింగ్టన్, ఏప్రిల్ 7: తాను అధికారంలోకి వచ్చిన మొదట్లో పారిస్ పర్యావరణ ఒప్పందంపై తీవ్ర విమర్శలు గుప్పించి దానినుంచి వైదొలిగిన అమెరికా అధ్యక్షు డు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఏకంగా ప్రపం చ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)పైనే గురిపెట్టారు.

04/08/2018 - 02:08

న్యూయార్క్, ఏప్రిల్ 7: కాశ్మీర్ లోయలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ముఖ్యంగా ఆధీనరేఖ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెచ్చరిల్లడం వల్ల అంతర్జాతీ య శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉం దని భద్రతా మండలికి పాకిస్తాన్ స్పష్టం చేసింది. కాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులను తాము భద్రతా మండలి దృష్టికి తీసుకెళ్లామని ఐరాసలో పాకిస్తాన్ రాయబారి మలీహా లోథీ స్పష్టం చేశారు.

04/08/2018 - 04:00

ఒట్టావా: కెనాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సస్కాషెవన్ ప్రావిన్స్‌లో ఐస్ హాకీ జూనియర్ ప్లేయర్స్‌తో వెళుతున్న ఓ బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో 14 మంది ఆటగాళ్లు దుర్మరణం చెందారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సస్కాషెవన్‌లవ జరుగుతున్న జూనియర్ హాకీ లీగ్ పోటీల్లో పాల్గొనేందుకు హంమోల్డ్ బ్రాంకోస్ జట్టు శుక్రవారం రాత్రి బయలుదేరింది.

04/08/2018 - 00:35

పనాజీ, ఏప్రిల్ 7: ఫిషింగ్ ట్రాలర్ ముసుగులో ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉన్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇందుకు సంబంధించి పూర్తి అప్రమత్తంగా ఉండాలని తీరప్రాంత దళాలకు ఆదేశాలు జారీ చేశాయి. ఈ హెచ్చరిక నేపథ్యంలో అన్ని ట్రాలర్ల, పడవల యజమానులు అప్రమత్తమయ్యారు. రెప్పవాల్చని రీతిలో 24గంటల నిఘా కొనసాగిస్తున్నారు.

Pages