S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

03/23/2018 - 03:38

న్యూయార్క్: ప్రఖ్యాత భారతీయ చిత్రకారుడు రాజా రవివర్మ చిత్రరాజం తిలోత్తమకు న్యూయార్క్‌లోని సోత్‌బేస్ వేలం కేంద్రంలో 5.17 కోట్ల రూపాయల ధర పలికింది. కేంద్రం నిర్వాహకులు 3.90 కోట్ల రూపాయలు వస్తాయన్న అంచనాలు తల్లకిందులు చేస్తూ ఆధునిక, దక్షిణాసియా సమకాలిన కళకు అత్యధిక ధర పలికింది. హిందూ పురాణాల నుంచి గ్రహించిన వనదేవతను రాజా రవివర్మ అత్యద్భుతంగా మలిచారు.

03/23/2018 - 01:04

కొద్ది రోజులుగా అమెరికాలోని చాలా ప్రాంతాల్లో శీతగాలులకుతోడు మంచు వానలా కురుస్తోంది. రాజధానిలోని వాషింగ్టన్‌లో కురిసిన మంచు కొన్ని అంగుళాల మేర పేరుకుపోవడంతో ఆటలాడుకుంటున్న చిన్నారులు.

03/22/2018 - 01:28

యునైటెడ్ నేషన్స్, మార్చి 21: ఆయుధాల అక్రమ రవాణా అరికట్టేందుకు నిఘా పెంచడంతోపాటు సంబంధిత యంత్రాంగాన్ని పటిష్టం చేయాలని ఐక్యరాజ్య సమితిని భారత్ కోరింది. చిన్న, తేలికపాటి ఆయుధాలు, పేలుడు పదార్థాలు సరిహద్దులు దాటి అక్రమంగా రవాణా అవుతున్నాయని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి అడ్డుకట్టవేయడానికి ఐరాస చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

03/22/2018 - 01:24

యాంగాన్, మార్చి 21: మయన్మార్ అధ్యక్షుడు, అంగ్ సాన్ సూకి విధేయుడు అయిన హితిన్ క్యా (71) తన పదవికి రాజీనామా చేశారు. ఇక విశ్రాంతి కోసమే తాను పదవికి రాజీనామా చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గత ఏడాది అనారోగ్యం కారణంగా ఆయన రెండుసార్లు విదేశాల్లో చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది.

03/21/2018 - 02:46

వాషింగ్టన్, మార్చి 20: ఇమ్మిగ్రేషన్ కొత్త నిబంధనలతో తీవ్రంగా నష్టపోతున్నామంటూ అమెరికాలోని భారతీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా అమెరికా వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వందలాది మంది నిపుణులు శాంతియుతంగా ర్యాలీలు నిర్వహించారు. ఇండియన్ అమెరికన్లు ప్రధానంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన హెచ్1బీ వర్క్ వీసాలపై ఉంటున్నవారు అమెరికా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

03/21/2018 - 02:44

ఐక్యరాజ్య సమితి, మార్చి 20: భారత్‌లో నీటి లభ్యతను పెంచేందుకు స్థానిక సమాజాలు చేస్తున్న కృషిని ఐక్యరాజ్య సమితి ఒక నివేదికలో ప్రశంసించింది. కాగా 2050 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఐదు బిలియన్ ప్రజలకు తగినంత తాగునీటి లభ్యత ఉండదని ఐరాస పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రకృతి పరమైన పరిష్కారాలు ఎంతో ఉత్తమమైనవిగా ఐరాస ప్రపంచ నీటి అభివృద్ధి నివేదిక-2018 పేర్కొంది.

03/21/2018 - 01:37

బాగ్దాద్, మార్చి 20: మూడేళ్ల క్రితం ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు హతమార్చిన 38 మంది భారతీయు కూలీల మృతదేహాలను కనుగొన్నట్టు ఇరాక్ అధికార్లు ప్రకటించారు. బదుష్ గ్రామ సమీపంలో ఈ మృతదేహాలను పాతిపెట్టారు. ఈ గ్రామం వౌసల్ పట్టణానికి వాయువ్యంగా ఉన్నది. ఈ ప్రాంతాన్ని ఇరాకీ దళాలు గత జూలైలో స్వాధీనం చేసుకున్నాయి.

03/21/2018 - 03:57

బీజింగ్ : తమ భూభాగంలో ఒక్క అంగుళం కూడా ఇతరులకు వదులుకోబోమని, అవసరమైతే భీకర యుద్ధం చేయడానికి వెనుకాడబోమని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ స్పష్టం చేశారు. ఇక్కడ జరుగుతున్న నేషనలిస్టిక్ కమ్యూనిస్టు పార్టీ ముగింపు సమావేశంలో మంగళవారం 30 నిముషాల సేపు ప్రసంగిస్తూ, ‘‘ఆధునిక కాలం ప్రారంభం నుంచి గ్రేట్ చైనా పునరుద్ధరణ దేశ ప్రజల ప్రధాన కలగా మారింది’’ అన్నారు.

03/20/2018 - 01:00

మాస్కో, మార్చి 19: రష్యా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ ఘనవిజయం సాధించారు. దీంతో ఆయన మరో ఆరేళ్లపాటు రష్యా అధ్యక్షుడిగా కొనసాగుతారు. ఇప్పటివరకు రెండు దశాబ్దాలకుపైగా రష్యాను పాలించిన పుతిన్‌కు ఈ ఎన్నికల్లో 75 శాతానికి పైగా ఓట్లు లభించినట్లు ప్రాథమిక ఫలితాలను బట్టి తెలుస్తోంది. అధ్యక్షపదవికి పుతిన్‌తో మొత్తం ఏడుగురు పోటీపడ్డారు.

03/18/2018 - 03:20

కౌలాలంపూర్, మార్చి 17: అతడో సెలబ్రిటీ. ఎలాంటి విషసర్పాన్నయినా అవలీలగా పట్టుకుంటాడు. పాము పడగమీద ముద్దాడుతూ, దాని తనలను నోట్లో పెట్టుకుని ఆడించడం అలవాటు. ఎక్కడ విష సర్పం కనిపించినా క్షణాల్లో అక్కడకు వెళ్లి పట్టుకుని మరీ పాముకోరలు తీసేసేవాడు. అలాంటి వ్యక్తి ఆ పాముకాటుకే బలైపోయిన విషాదం ఘటన మలేసియాలో చోటుచేసుకుంది. అబు జరీన్ హుసీన్ (33) విషసర్పాలతో చేసిన విన్యాసాలు టీవీల్లో, య్యూటూబ్‌ల్లో అనేకం.

Pages