S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

02/12/2018 - 06:19

దుబాయ్, ఫిబ్రవరి 11: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో మొట్టమొదటి హిందూ ఆలయ నిర్మాణ ప్రాజెక్టుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం శంకుస్థాపన చేశారు. దుబాయ్ ఒపెరా హౌస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్వామినారాయణ ఆలయానికి మోదీ శంకుస్థాపన చేస్తూ, మానవత్వం, సామరస్యం, భారతీయతకు ఈ పవిత్ర ప్రాంతం తలమానికంగా నిలువగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆలయ నమూనాను ఆవిష్కరించారు.

02/12/2018 - 06:10

మాస్కో, ఫిబ్రవరి 11: రష్యా రాజధాని మాస్కో శివారులో ఓ ప్రయాణికుల విమానం కూలిపోయిన దుర్ఘటనలో 71 మంది దుర్మరణం చెందారు. మాస్కోలోని డొమండెడోవ్ విమానాశ్రయం నుంచి బయలు దేరిన ఎఎన్-148 అనే విమానంలో ప్రమాద సమయానికి ఆరుగురు సిబ్బంది, 65మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ విమానం మాస్కో నుంచి ఓర్క్స్ పట్టణానికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.

02/12/2018 - 00:56

దుబాయ్, ఫిబ్రవరి 11: సాంకేతిక విజ్ఞానాన్ని సమగ్రాభివృద్ధి సాధనంగా ఉపయోగించాలే తప్ప విధ్వంసం కోసం కాదని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నాడిక్కడ పిలుపునిచ్చారు. సైబర్ స్పేస్ దుర్వినియోగాన్ని అన్ని కోణాల్లోనూ పూర్తిస్థాయిలో అరికట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

02/12/2018 - 00:42

కేంబ్రిడ్జ్ (మసాచ్యూసెట్స్), ఫిబ్రవరి 11: త్వరలోనే తమిళనాడు రాజకీయ పార్టీ పెడతానని సంకేతాలు అందించిన ప్రముఖ నటుడు కమల్‌హాసన్, మరో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో పొత్తు విషయంలో తాజా మెలిక పెట్టారు. రజనీకాంత్ రంగు ‘కాషాయం’ అయితే, ఆయనతో పొత్తుకు తాను ఎంతమాత్రం సిద్ధంగా లేనని కమల్ స్పష్టం చేశారు. పరోక్షంగా బీజేపీతో రజనీకాంత్ సన్నిహితం అవుతున్నారన్న సంకేతాలను తన మాటల్లో ఆయన ధ్వనించారు.

02/11/2018 - 02:25

జెరూసలేం, ఫిబ్రవరి 10: ఇరాన్‌కు చెందిన డ్రోన్ ఒకటి ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించడంతో ఇజ్రాయెల్ దానిని కూల్చివేసింది. సిరియాలో దాడులు చేసేందుకు ఇజ్రాయెల్ దళాలు సన్నద్ధమవుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని, తమ సారభౌమాధికారానికి భంగం కలిగించే ఎలాంటి చర్యలనూ ఉపేక్షించేది లేదని ఇజ్రాయెల్ తెగేసి చెప్పింది.

02/11/2018 - 02:19

ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు మంచు గుప్పిట్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయ. అమెరికాలోని చికాగాలో దాదాపు 7 అంగుళాల మేర రహదారులపై మంచు పేరుకుపోయంది. దాన్ని తొలగించేందుకు సిబ్బంది నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

02/11/2018 - 02:15

జోహనె్నస్‌బర్గ్, ఫిబ్రవరి 10: దక్షిణాఫ్రికాలో రాజకీయ ప్రతిష్ఠంభన ఇంకా కొనసాగుతోంది. సొంత పార్టీ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పదవినుండి వైదొలగాలని కోరినప్పటికీ దేశాధ్యక్షుడు జాకబ్‌జుమా పదవిని పట్టుకుని వేళ్లాడుతూండటంతో ఆయనను సాగనంపే ప్రయత్నాలు ఇంకా ఫలితాన్ని ఇవ్వలేదు. పదవినుంచి వైదొలిగే విషయంలో జాకబ్‌జుమాతో జరుపుతున్న చర్చలు ఇంకా కొలిక్కిరాలేదు.

02/11/2018 - 01:06

రామల్లా, ఫిబ్రవరి 10: పాలస్తీనాలో పర్యటించిన తొలి ప్రధానిగా చరిత్ర సృష్టించిన నరేంద్ర మోదీకి ఆ దేశం సముచితరీతిలో గౌరవించింది. పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్‌తో ద్వైపాక్షిక చర్చలు పూర్తయిన వెంటనే ఆయనకు ‘గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా’ ప్రదానం చేశారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను సుధృడం చేయడంలో మోదీ చేసిన కృషికి గుర్తింపుగా ఈ సత్కారం చేశారు.

02/11/2018 - 01:05

రామల్లా (వెస్ట్‌బ్యాంక్), ఫిబ్రవరి 10: ఇజ్రాయిల్‌తో జరుపుతున్న శాంతి ప్రక్రియలో భారత్ జోక్యం చేసుకోవాలని పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ కోరారు. ఇరుదేశాల మధ్య శాంతి నెలకొనేందుకు ప్రస్తుతం అనుసరిస్తున్న ‘రెండు దేశాల’ విధానానికి బదులుగా ‘బహుళ దేశాల యంత్రాంగం’ ఏర్పాటు చేసే విషయంలో భారత్ మద్దతు కావాలని ఆయన కోరారు.

02/11/2018 - 03:43

భారత్ తరఫున తొలిసారి పాలస్తీనా పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీకి అధ్యక్షుడు మహమ్మూద్ అబ్బాస్ నుంచి అపురూప స్వాగతం లభించింది. ఆ దేశ అత్యంత గౌరవాత్మక ప్రశంసాపత్రం
గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా పత్రంతో అధ్యక్షుడు అబ్బాస్ మోదీని సత్కరించారు

Pages