S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

02/08/2018 - 00:36

హువాలిన్, ఫిబ్రవరి 7: తైవాన్ తూర్పుతీరంలో సంభవించిన భూకంపం ధాటికి పలు భవనాలు కుప్పకూలిపోయాయి. పెద్దసంఖ్యలో పౌరులు శిథిలాలకింద చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు సహాయకబృందాలు నిర్విరామంగా పనిచేస్తున్నాయి. భూకంపం సృష్టించిన విధ్వంసంలో కనీసం ఆరుగురు మరణించగా, 88మంది ఆచూకీ తెలియలేదు. 256 మంది తీవ్రంగా గాయపడ్డారు.

02/07/2018 - 23:54

జర్మనీ సహా అనేక దేశాలు మంచుమయం అవుతున్నాయ. ఆ మంచు నుంచే తన దారిలో దూసుకుపోతోంది జర్మనీకి చెందిన ఈ నారోగేజ్ రైలు. పట్టాలు ఎక్కడున్నాయో తెలియనంతగా దట్టమైన మంచు ఇటు నేలను, అటు ఆకాశాన్ని కమ్మేసినా ఈ రైలు మాత్రం ‘నా దారి నాదే’నంటూ

02/06/2018 - 03:35

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 5: నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వద్ద నజాపిర్, నికియల్, కరేలా సెక్టార్‌లో ఆదివారంనాడు భారత జవాన్ల కాల్పుల్లో తమ పౌరులు ఇద్దరు మృతి చెందారని పాక్ ఆరోపించింది. ఈ మేరకు ఇక్కడి భారత డిప్యూటీ హైకమిషనర్ జేపీ సింగ్‌ను కలిసి పాక్ విదేశాంగ శాఖ డైరెక్టర్ జనరల్ (దక్షిణాసియా, సార్క్) మహ్మద్ ఫైజల్ నిరసన తెలిపారు.

02/06/2018 - 03:39

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 5: కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించకుండా లోయలో శాంతి, శ్రేయస్సు సాధ్యం కావని, స్వీయనిర్ణయాధికారానికి కశ్మీరీ ప్రజలు చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఎప్పటికీ ఉంటుందని పాకిస్తాన్ పునరుద్ఘాటించింది. కశ్మీర్ సంఘీభావ దినోత్సవం సందర్భంగా పాకిస్తాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్, ప్రధానమంత్రి షాహిద్ ఖాకన్ అబ్బాసీ వేరువేరు సందేశాలలో ఈ వ్యాఖ్యలు చేశారు.

02/03/2018 - 05:10

వాషింగ్టన్, ఫిబ్రవరి 2: వీసా లాటరీ ప్రాతిపదికగా కాకుండా నైపుణ్యం, సమానత్వం, నిష్పాక్షికత ప్రాతిపదికగా ఇమ్మిగ్రేషన్ విధానాన్ని అమలు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపు పునరుద్ఘాటించారు. లాటరీ పద్ధతిలో వీసాలు మంజూరు చేయడం అన్నది భయానక విధానమని అభివర్ణించారు.

02/03/2018 - 05:06

ఖాట్మండ్, ఫిబ్రవరి 2: నూతనంగా ఎన్నికైన నేపాల్ ప్రజాస్వామ్య ప్రభుత్వంతో కలసి ముందడుగు వేస్తామని, ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేర్చి ఉభయులకు లబ్ది చేకూర్చే దిశగా భారత్ ప్రయత్నిస్తుందని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ హామీ ఇచ్చారు. ఆర్థికవృద్ధి, అభివృద్ధి విషయంలో ఇరుదేశాల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఉండేలా అడుగులు వేస్తామని అన్నారు.

02/03/2018 - 05:04

లండన్, ఫిబ్రవరి 2: తన నాయకత్వం విషయంలోనూ, బ్రెగ్జిట్‌కు సంబంధించి అనుసరిస్తున్న వ్యూహం విషయంలోనూ పార్టీనుంచి విపరీతమైన వత్తిళ్లు వస్తున్నా తాను నిలకడగా ఉంటున్నానని, ప్రజలు ఏం కోరుకుంటున్నారో దానికే కట్టుబడి ఉన్నానని బ్రిటీష్ ప్రధాని ధెరిసా మే స్పష్టం చేశారు.

02/01/2018 - 00:38

న్యూఢిల్లీ, జనవరి 31: ఆకాశవీధిలో బుధవారం రాత్రి అరుదైన అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. పౌర్ణమి రోజున పండువెనె్నలను పంచే చంద్రుడు మూడు రంగుల్లో దర్శనం ఇచ్చి వీక్షకులకు కనువిందు చేశాడు.. మరపురాని మధురానుభూతిని మిగిల్చాడు.. ‘సూపర్ మూన్’, ‘బ్లడ్ మూన్’, ‘బ్లూ మూన్’ల పేరిట చంద్రుడు త్రిపాత్రాభినయం చేశాడు. అంబర వీధిలో ఈ ఘట్టాన్ని ‘సూపర్ బ్లూ బ్లడ్ మూన్’గా శాస్తవ్రేత్తలు అభివర్ణించారు.

01/31/2018 - 22:11

వాషింగ్టన్, జనవరి 31: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి రెండో ఏడాదిలో ప్రవేశించిన డొనాల్డ్ ట్రంప్ ఇపుడు వలస విధానాల్లో సంస్కరణలపైనే ప్రధానంగా దృష్టి సారించారు. అధ్యక్ష పదవి చేపట్టాక తొలిసారిగా ఆయన ‘స్టేట్ ఆఫ్ యూనియన్ అడ్రస్’ (ఎస్‌ఓటీయూ)కు హాజరై తన ఎజెండాలోని కీలక అంశాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు.

01/31/2018 - 02:06

వాషింగ్టన్, జనవరి 30: ‘అత్యంత ప్రమాదకరమైన’ 11 దేశాలకు చెందిన శరణార్థులు అమెరికాలో ప్రవేశించడంపై అమలులో ఉన్న నిషేధాన్ని ట్రంప్ యంత్రాంగం రద్దు చేసింది. అయితే, శరణార్థుల ప్రవేశంపై ‘లోతైన పరిశీలన’ ఉంటుందని అగ్రరాజ్యం స్పష్టం చేసింది. 11 దేశాల పేర్లను ప్రస్తావించక పోయినప్పటికీ వాటిలో ఉత్తర కొరియా, పది ముస్లిం దేశాల పేర్లు ఉన్నాయని సమాచారం.

Pages