S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

01/22/2018 - 02:36

ఇస్లామాబాద్, జనవరి 21: అధీనరేఖ ప్రాంతంలో భారత్ సైనిక దళాలు ఎలాంటి కవ్వింపు లేకుండా కాల్పులకు పాల్పడ్డాయంటూ వరుసగా నాల్గవ రోజైన ఆదివారం కూడా భారత డిప్యూటీ హైకమిషనర్‌ను పాకిస్తాన్ పిలిపించింది. భారత దళాల కాల్పుల కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారని తెలిపింది. సోమవారం నుంచి ఇప్పటివరకూ భారత డిప్యూటీ హైకమిషనర్ జేపీసింగ్‌ను అనేకసార్లు పిలిపించి ఈ కాల్పులకు సంబంధించి పాకిస్తాన్ సంజాయిషీ కోరింది.

01/21/2018 - 02:46

జొహెనె్నస్‌బెర్గ్, జనవరి 20: దక్షిణాఫ్రికా అధ్యక్షపదవి నుంచి జాకబ్ జుమాను త్వరలోనే సాగనంపడం అనివార్యమన్న కథనాల నేపథ్యంలో అధికార ఏఎన్‌సీ పార్టీ పునర్మించేందుకు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆఫ్రికా నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షపదవి నుంచి గతేడాది డిసెంబర్‌లో జుమాను తొలగించారు.

01/21/2018 - 02:15

వాషింగ్టన్, జనవరి 20: నిర్ణీత వ్యవధిలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందకపోవడంతో అమెరికా ప్రభుత్వం మూతపడింది. ఈ విషయాన్ని ట్రంప్ ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది. అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తయిన సమయంలోనే ఆ దేశంలో ఇలాంటి అనిశ్చితి ఏర్పడడం చర్చనీయాంశమైంది. అమెరికా ప్రభుత్వం ‘షట్‌డౌన్’ కావడంతో అక్కడి ప్రభుత్వ వార్షిక లావాదేవీలన్నీ స్తంభించిపోయాయి.

01/20/2018 - 03:16

ఇస్లామాబాద్, జనవరి 19: పాకిస్తాన్‌లో వెలుగుచూసిన నకిలీ డిగ్రీ సర్ట్ఫికెట్ల స్కామ్‌పై దర్యాప్తుకు సుప్రీం కోర్టు ఆదేశించింది. పాకిస్తానీ సంస్థ ప్రమేయంతో ఈ కుంభకోణం నడవడంపై తీవ్రంగా స్పందించిన సుప్రీం కోర్టు ‘ఇది అత్యంత దిగ్భ్రాంతికరం. అలాగే జాతికే తీరని అవమానం’అని పేర్కొంది.

01/20/2018 - 02:53

ఇస్లామాబాద్, జనవరి 19: సరిహద్దులో భారత సైనికులు కవ్వింపుచర్యలకు పాల్పడడం, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇటీవల ఎక్కువైందని పాక్ ఆరోపిస్తోంది. భద్రతాదళాల కాల్పుల్లో తమ పౌరులు మృతి చెందారని శుక్రవారం ఇక్కడ భారత డిప్యూటీ హైకమిషనర్ జేపీ సింగ్‌ను పిలిపించి నిరసన వ్యక్తం చేశారు.

01/20/2018 - 02:50

వాషింగ్టన్, జనవరి 19: అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సరుూద్‌పై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని, చట్టప్రకారం అన్ని కోణాల్లోనూ సమగ్ర దర్యాప్తు జరపాలని అమెరికా గట్టిగా డిమాండ్ చేసింది. ఐక్యరాజ్య సమితి ఇప్పటికే సరుూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించినందున అతనిపై పాకిస్తాన్ తక్షణం విచారణ చేపట్టాలని అమెరికా తన స్వరం పెంచింది.

01/20/2018 - 02:49

బీజింగ్, జనవరి 19: భారత్, చైనాల మధ్య డోక్లామ్ వివాదం మరోసారి రాజుకుంటోంది. ఇరు దేశాల సరిహద్దులోని డోక్లామ్ భూభాగం తమదేనని, అక్కడ సైనికుల కోసం తాము చేపట్టిన నిర్మాణాలన్నీ చట్టబద్ధమేనని చైనా సరికొత్త వాదన వినిపించింది. భారత్ పదే పదే అభ్యంతరం చెప్పినప్పటికీ, డోక్లామ్ వద్ద తాను చేపట్టిన సైనిక సముదాయం పనులను చైనా సమర్థించుకుంది.

01/19/2018 - 03:50

ఇస్లామాబాద్, జనవరి 18: ‘జమాత్- ఉద్-దవా’ అధినేత హఫీజ్ సరుూద్‌కు వ్యతిరేకంగా తాము ఎలాంటి చర్యలు తీసుకోబోమని పాకిస్తాన్ స్పష్టం చేసింది. ‘సరుూద్ సాహెబ్’పై తమ దేశంలో ఎలాంటి కేసు నమోదు కానందున ఏ రకమైన చర్యా తీసుకోవడం లేదని పాక్ ప్రధాని షాహిద్ ఖాన్ అబ్బాసీ ప్రకటించారు.

01/19/2018 - 01:58

టర్కీలోని ట్రాబ్‌జోన్ విమానాశ్రయంలో దిగుతూ గత శనివారం రన్‌వే మీదినుంచి
నల్ల సముద్రం తీరంలో జారి పడిపోయన బోయంగ్ విమానాన్ని గురువారం క్రేన్ల సహాయంతో బయటకు తీసుకువస్తున్న దృశ్యం. పెగాసెస్ ఎయర్ లైన్స్‌కు చెందిన ఈ విమానం ఈ ప్రమాదానికి గురయన సంఘటనలో ప్రాణనష్టం జరగలేదన్న విషయం తెలిసిందే.

01/19/2018 - 01:48

వాషింగ్టన్, జనవరి 18: పాకిస్తాన్ ఓ పక్క ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ మరోపక్క అబద్ధాలాడుతూ తమను మోసం చేస్తోందని డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను అమెరికా శే్వతసౌధం గట్టిగా సమర్ధించింది. ఇన్నాళ్లూ తమ నాయకులను వెర్రివాళ్లను చేసి గత పదిహేనేళ్లుగా 33 బిలియన్ డాలర్ల సాయం కొట్టేసిందని మండిపడ్డ ట్రంప్ ఇకనుంచి నయాపైసా సాయం చేయబోమని ఇటీవల ప్రకటించారు.

Pages