S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

01/17/2018 - 02:55

.అందాల కనువిందు చేసే తాజ్ యువ ప్రేమ జంటలకే కాదు... దేశాధినేతలకూ దర్శనీయ స్థలమే. భారత్‌ను సందర్శించే ఏ దేశాధినేతలైనా తాజ్‌ను సందర్శించకుండా ఉండరంటే అతిశయోక్తి కాదేమో. భారత పర్యటనలో ఉన్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా ఇందుకు మినహాయంపు కాదు. తన సతీమణి సారాతో కలిసి మంగళవారం తాజ్‌ను సందర్శించి ఇలా ముచ్చట తీర్చుకున్నారు.

01/15/2018 - 01:55

లీమా, జనవరి 14: పెరూలోని సముద్రతీర ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. ఈ సంఘటనతో పెరూతోపాటు పొరుగు ప్రాంతమైన చిలీలోనూ సునామీకి దారితీసే ప్రమాదం ఉందని అమెరికాకు చెందిన ఒక ఏజన్సీ ప్రజలకు ఒక ప్రకటన ద్వారా హెచ్చరిక జారీ చేసింది. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం భూకంప ప్రభావ తీవ్రత 7.3 ఉందని పేర్కొంది.

01/15/2018 - 01:53

వాషింగ్టన్, జనవరి 14: అంతరిక్ష పరిశోధనల్లో శాస్తవ్రేత్తలు మరో ముందడుగు వేశారు. మన సౌర వ్యవస్థలోనే కాకుండా దాని ఆవల సుదూర ప్రాంతాల్లో ఉన్న నక్షత్రాలనే కాకుండా నక్షత్ర మండలాల్లో ఉన్న తమ విశ్వ శోధనాపటిమతో వెలికితీస్తున్నారు. తాజాగా 500 మిలియన్ సంవత్సరాల నాటి అత్యంత ప్రాచీన నక్షత్ర మండలాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన శాస్తవ్రేత్తలు కనుగొన్నారు.

01/14/2018 - 02:42

న్యూయార్క్, జనవరి 13: పర్యావరణ పరిరక్షణలో ఇతర దేశాలు విఫలమవుతున్న నేపథ్యంలో వాతావరణ సమతూకాన్ని కాపాడే విషయంలో భారత్, చైనాలు అద్భుతమైన నాయకత్వ పటిమను, నిబద్ధతను కనబరుస్తున్నాయని ఐక్యరాజ్య సమితి ప్రశంసించింది. పర్యావరణ సమతూకాన్ని పరిరక్షించుకునే విషయంలో ఐరాస గురుతరమైన రీతిలోనే తన కర్తవ్యాన్ని నిర్వహిస్తోందని సెక్రటరీ జనరల్ ఆంటోనియా గటెరస్ స్పష్టం చేశారు.

01/12/2018 - 07:55

వాషింగ్టన్, జనవరి 11: అమెరికాలో జరిగిన జంట హత్యల కేసులో ఇండో- అమెరికన్ రఘునందన్ యండమూరి (32)కి పెన్సిల్వేనియా కోర్టు మరణశిక్ష విధించింది. పదేళ్ల సాన్వీ వెన్నా, ఆమె అమ్మమ్మ సత్యవతి వెన్నా (61)ను రఘునందన్ దారుణంగా చంపేశాడు. సాన్వీని కిడ్నాప్ చేసి ఆమె తల్లిదండ్రుల నుంచి డబ్బులు డిమాండ్ చేయాలన్న అతడి ప్రయత్నం బెడిసికొట్టింది. సాన్వీనీ, ఆమె అమ్మమ్మను హత్యచేశాడు.

01/12/2018 - 06:15

వాషింగ్టన్, జనవరి 11: అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పరచుకోవాలని భావించే భారతీయ ఐటీ నిపుణులకు ప్రయోజనం కలిగించే పరిణామం ఇది. ‘ప్రతిభ ఆధారిత వలస విధానాన్ని’ ప్రోత్సహించేలా ఏడాదికి 45 శాతం గ్రీన్‌కార్డులను మంజూరు చేసేందుకు అమెరికా ప్రతినిధుల సభలో ఓ బిల్లును ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది.

01/10/2018 - 22:57

లండన్, జనవరి 10: బ్రిటన్‌లో ఇద్దరు భారతీయ సంతతికి చెందిన ఎంపీలు ప్రధాని థెరిసామే కేబినెట్‌లో చేరారు. ఐటీ దిగ్గజం, ఇన్ఫోసిన్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణ మూర్తి అల్లుడు రిషీ సునాక్‌కు కీలక పదవువి దక్కనుంది. నార్త్ ఇంగ్లిష్‌లోని రిచ్‌మండ్ (యార్క్‌షైర్) నుంచి కన్జర్వేటీవ్ పార్టీ తరఫున సునాక్ ఎంపీగా ఎన్నికయ్యారు.

01/10/2018 - 01:38

సియోల్, జనవరి 9: చిరకాలంగా తమ మధ్య నెలకొన్న వైరాన్ని తగ్గించుకునేందుకు ఉభయ కొరియాల మధ్య అరుదైన రీతిలో చర్చలు జరిగాయి. ఈ చర్చల పర్యవసానంగా దక్షిణ కొరియాలో జరిగే వింటర్ ఒలింపిక్ క్రీడలకు తమ బృందాన్ని పంపేందుకు ఉత్తర కొరియా సుముఖత తెలిపింది. రెండేళ్ల విరామం తర్వాత ఈ రెండు దేశాల ప్రతినిధులు చర్చలకు మంగళవారం నాడు నాంది పలికారు.

01/10/2018 - 01:35

లండన్, జనవరి 9: ‘ఆధార్’ సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో విక్రయిస్తున్నట్లు పరిశోధనాత్మక వార్తా కథనాన్ని అందించిన జర్నలిస్టుకు అవార్డు ఇవ్వడానికి బదులు కేసులు పెట్టడం దారుణమని అమెరికాకు చెందిన సిఐఏ మాజీ ఉద్యోగి ఎడ్వర్డ్ స్నోడెన్ ‘ట్విట్టర్’లో పేర్కొన్నారు.

01/10/2018 - 01:19

వాషింగ్టన్, జనవరి 9: భారతీయులకు గొప్ప ఊరట లభించేలా హెచ్-1బీ వీసా పొడిగింపు విధానంలో సంస్కరణలకు స్వస్తి పలుకుతూ ట్రంప్ యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్-1బీ వీసాదారులను తమ దేశం నుంచి వెనక్కి పంపే ప్రతిపాదన ఏదీ లేదంటూ అమెరికా ప్రకటించింది.

Pages