S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

01/09/2018 - 02:52

వాషింగ్టన్, జనవరి 8: చర్చల ప్రక్రియ ప్రారంభించాలంటే ఉత్తర కొరియా క్షిపణలు, అణ్వస్త్రాల ప్రయోగాలకు స్వస్తి పలకాలని ఐక్యరాజ్యసమితిలోని ఇండో-అమెరికన్ రాయబారి నిక్కీ హేలీ తేల్చిచెప్పారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో ఫోన్‌లో మాట్లాడతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనకు స్పందిస్తూ, అణుయుద్ధం వస్తే ప్రపంచం ఏమవుతుందో అన్న విషయాన్ని కిమ్ తెలుసుకోవడం లేదన్నారు.

01/09/2018 - 02:50

దుబాయి, జనవరి 8: ఇక్కడ ఓ కంపెనీలో బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న భారతీయుడు లాటరీలో జాక్‌పాట్ కొట్టాడు. 21 మిలియన్ల ధిర్హాం అంటే 3.2 మిలియన్ల అమెరికా డాలర్ల మనీ ప్రైజ్ లభించింది. 2002 నుంచి హరికృష్ణ వి నాయర్ (42) కుటుంబంతోపాటు దుబాయినే ఉంటున్నాడు. అబుదాబీ ప్రభుత్వం ఏటా తీసే డ్రాలో ఇప్పటికి పదిమంది భారతీయులకు మనీ ప్రైజ్ వచ్చింది.

01/09/2018 - 02:46

జెరూసలేం, జనవరి 8: మోషే హోల్జ్‌బెర్గ్ ఇజ్రాయెల్‌కు చెందిన 11 ఏళ్ల బాలుడు.. రెండేళ్ల ప్రాయంలో ఉండగా 2008 నవంబర్ 26న జరిగిన ముంబయి పేలుళ్ల ఘటనలో క్షేమంగా బయటపడి తన సొంత దేశం చేరుకున్నాడు.. తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌ను సందర్శించేందుకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో కలిసి వస్తున్నాడు..

01/09/2018 - 02:44

వాషింగ్టన్, జనవరి 8: అమెరికాలో పాక్ రాయబార కార్యాలయం వద్ద ఇండియా, ఆఫ్గాన్, బలోచ్ సంతతికి చెందిన ప్రజలు సోమవారం పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ‘చెప్పుల దొంగ పాకిస్తాన్’ పేరిట నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాక్ అంబసీ అధికారులకు పెద్దఎత్తున చెప్పులు సమర్పించే ప్రయత్నం చేశారు.

01/08/2018 - 04:28

కరాచి, జనవరి 7: ఎంతకాదన్నా, అమెరికా పెద్దనే్న. సాధ్యమైనంత వరకూ ఆ దేశంతో సంబంధాలు కొనసాగించాలన్నదే ఇస్లామాబాద్ యోచన అని పాక్ విదేశాంగ కార్యదర్శి తెహ్‌మినా జంజ్వా స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవడంలో ఇస్లామాబాద్ పూర్తిగా విఫలమైందని భావిస్తోన్న అమెరికా, 2 బిలియన్ డాలర్ల రక్షణ సాయాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే.

01/08/2018 - 04:23

పాకిస్తాన్ ప్రభుత్వం 147 మంది భారత జాలర్లను విడుదల చేసింది. వీరంతా అక్రమంగా తమ సముద్ర జలాల్లో ప్రవేశించారంటూ నిర్బంధించింది. ఈ జాలర్లంతా ఆదివారం కరాచీ చేరుకుని అక్కడి నుంచి రైల్లో భారత్‌కు పయనమయ్యారు.

01/08/2018 - 04:12

సింగపూర్, జనవరి 7: ఆగ్నేయ ఆసియా దేశాలతో మరింతగా బలమైన, విస్తృతమైన మైత్రీ బంధాన్ని పెంపొందించుకోవాలన్నదే తమ ఆశయమని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆదివారం నాడిక్కడ స్పష్టం చేశారు. సభ్యదేశాలు పరస్పరం సహకరించుకోవడం వల్లే ఆగ్నేయ ఆసియా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతోందని సుష్మ అన్నారు. అలాగే ఆసియా ప్రాంత అభివృద్ధిలో ఆసియాన్ అత్యంత కీలకమైన అంతర్గమైన భాగమని స్పష్టం చేశారు.

01/07/2018 - 04:05

మలేసియాలోని కౌలాలంపూర్‌లో శనివారం నిర్వహించిన ఒక కార్యక్రమానికి ప్రత్యేక హెలికాప్టర్‌లో చేరుకున్న ప్రముఖ తమిళ సినీనటులు రజినీకాంత్, కమల్‌హాసన్. వీళ్లిద్దరూ రాజకీయాల్లోకి రానున్నట్లు, త్వరలో పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించడంతో వీరిద్దరూ కలిసి ఒకే హెలికాప్టర్‌లో వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

01/07/2018 - 02:34

వాషింగ్టన్, జనవరి 6: పాకిస్తాన్‌ను ఎలా దారిలోకి తీసుకురావాలో తమకు తెలుసని, దానికోసం అనేక ఆప్షన్లు ఉన్నాయని శే్వతసౌధం శనివారం ప్రకటించింది. ‘పాక్‌ను ఏ విధంగా డీల్ చేయాలో మాకు బాగా తెలుసు. ఆ విషయాలన్నీ అధ్యక్షుడి టేబుల్‌పై ఉన్నాయి’ అంటూ వైట్‌హౌస్ వర్గాలు స్పష్టం చేశాయి.

01/07/2018 - 02:32

లాహోర్, జనవరి 6: తన పరువుకు నష్టం కలిగించినందుకు 100 మిలియన్ రూపాయలు చెల్లించాలంటూ అంతర్జాతీయ ఉగ్రవాది, జమాత్-ఉద్-దవా (జెయుడి) అధినేత హఫీజ్ సరుూద్ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖుర్రమ్ దస్తగిర్‌కు లీగల్ నోటీసు పంపాడు. ఉగ్రవాదులకు పాక్ ఆశ్రయం కల్పిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశాక, విరాళాల సేకరణకు సంబంధించి జెయుడిపై పాక్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

Pages