S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

01/06/2018 - 03:12

వాషింగ్టన్, జనవరి 5: హెచ్-1బీ వీసాల్లో మార్పులు చేయాలన్న ట్రంప్ ప్రభుత్వ నిర్ణయం పట్ల అమెరికాలో కొందరు ప్రజాప్రతినిధులు, న్యాయవాదుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచనలతో అమెరికాకు నష్టం జరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

01/06/2018 - 03:00

చిత్రం..అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు వ్యతిరేకంగా ఇస్లామాబాద్‌లో నిరసన ప్రదర్శనలు జరుపుతున్న పాకిస్తాన్ విద్యార్థులు

01/06/2018 - 01:58

వాషింగ్టన్/ఇస్లామాబాద్, జనవరి 5: ఉగ్రవాద నిర్మూలనలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న పాకిస్తాన్‌కు అమెరికా గట్టి షాక్ ఇచ్చింది. పాకిస్తాన్‌కు ప్రకటించిన 1.15 బిలియన్ డాలర్ల సాయం ఆపేయాలని అమెరికా నిర్ణయించింది. ఉగ్రవాదంపై కఠినంగా ఉన్నామని మాయమాటల చెబుతూ 15 ఏళ్లుగా అమెరికా సాయం పొందుతోందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తీవ్రంగా దుయ్యబట్టారు.

01/05/2018 - 03:47

బీరట్, జనవరి 4: సిరియాలో రెబెల్స్‌కు పట్టున్న ఘౌటా తూర్పు ప్రాంతంలో రష్యా జరిపిన వైమానిక దాడుల్లో 23 మంది పౌరులు మరణించారు. బ్రిటన్‌కు చెందిన సిరియాలో పౌర హక్కుల పర్యవేక్షకులు మాత్రం 18 మంది మృతిచెందినట్లు వెల్లడించారు. వారిలో 11 మంది మహిళలతోపాటు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని పర్యవేక్షక సంఘం అధిపతి రమి అబ్దుల్ రహ్మాన్ తెలిపారు.

01/05/2018 - 03:30

హైదరాబాద్, జనవరి 4: రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల ద్విచక్ర వాహనాల మెకానిక్‌ల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని రవాణా శాఖ మంత్రి పి.మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. మెకానిక్‌లు అందరిని అసంఘటిత కార్మికులుగా గుర్తించేందుకు తమ వంతు సహకారం అందిస్తానని చెప్పారు.

01/05/2018 - 02:11

ఇస్లామాబాద్, జనవరి 4: ఇస్లామాబాద్ జైలులో ఉన్న భారత నావికాదళం మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ చేత మరికొన్ని విషయాలు ‘ఒప్పిస్తూ’ పాకిస్తాన్ ప్రభుత్వం మరో వీడియోను తాజాగా విడుదల చేసింది. జైలులో తనకు ఎవరూ హాని తలపెట్టలేదని, తాను బాగున్నందున ఎవరూ ఆందోళన చెందనక్కర్లేదని జాదవ్ అన్నట్లు ఆ వీడియోలో ఉంది.

01/04/2018 - 01:06

జెరూసలెం, జనవరి 3: 500 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువ చేసే ‘రాఫెల్ యుద్ధ విమానాల’ కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుందని ఇజ్రాయల్‌లోని ప్రఖ్యాత ఆయుధ తయారీ సంస్థ వెల్లడించింది. ఇజ్రాయల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత్ పర్యటన నేపథ్యంలో- ‘ఒప్పందం రద్దు నిర్ణయం’ పట్ల ఆ సంస్థ ‘విచారం’ వ్యక్తం చేసింది.

01/04/2018 - 01:05

వాషింగ్టన్, జనవరి 3: అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ‘బై అమెరికన్, హైర్ అమెరికన్’ నినాదం ఫలితంగా హెచ్-1బీ వీసాలను నియంత్రించేందుకు రంగం సిద్ధమైంది. ట్రంప్ ప్రతిపాదించిన సవరణ బిల్లు ఆమోదం పొందితే దాదాపు 5 లక్షల మంది భారతీయులు అమెరికాలో ఉద్యోగాలకు దూరమై, సొంత గడ్డకు పయనం కావల్సి ఉంటుందని ఓ అంచనా.

01/03/2018 - 22:46

వాషింగ్టన్, జనవరి 3: అణ్వాయుధ హెచ్చరికలతో కుతకుత ఉడికిస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదే తీరులో తీవ్ర హెచ్చరిక చేశారు. కొత్త ఏడాది వేడుకల సందర్భంలో కిమ్ జోంగ్ మాట్లాడుతూ ‘నా టేబుల్‌మీదే న్యూక్లియర్ బటన్ ఉంటుంది. తిక్కరేగితే నొక్కేస్తా’నంటూ అమెరికాను తీవ్రంగా హెచ్చరించటం తెలిసిందే.

01/03/2018 - 22:43

బీజింగ్, జనవరి 3: భారత దేశంలో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ ఉనికిని తాము ఎన్నడూ గుర్తించలేదని చైనా బుధవారం స్పష్టం చేసింది. అలాగే అరుణాచల్‌లోకి తమ సైనిక దళాల చొరబాటుపైనా వౌనం వహించింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని సియాంగ్ జిల్లాలో దాదాపు 200 మీటర్లమేర తమ దళాలు చొరబడ్డాయన్న కథనాలపై చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ తీవ్రంగానే స్పందించింది.

Pages