S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

01/03/2018 - 03:25

ఢాకా, జనవరి 2: మూడేళ్లనాటి కేసులో మాజీ ప్రధాని ఖలీదా జియాపై బంగ్లాదేశ్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ప్రభుత్వ విధానాలకు నిరసనగా 2015లో ఖలీదా నాయకత్వంలోని పార్టీ ఓ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా ఓ బస్సుపై బాంబుదాడి జరిగి ఎనిమిది మంది మృతి చెందారు. దీనిపై మాజీ ప్రధాని ఖలీదా జియాపై కేసు నమోదైంది. పేలుళ్ల ఘటనకు సంబంధించి జియాపై పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు.

01/03/2018 - 01:40

వాషింగ్టన్, జనవరి 2: అధికారంలోకి వచ్చిన వెంటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ‘బై అమెరికన్, హైర్ అమెరికన్’ ఆలోచన క్రమంగా అమల్లోకి వస్తోంది. తాజాగా హెచ్1బి వీసాలకు సంబంధించి నియమ నిబంధనల్లో చేస్తున్న మార్పుల వల్ల భారత ఉద్యోగులపై తీవ్రస్థాయిలో ప్రతికూల ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.

01/02/2018 - 03:21

ఇస్లామాబాద్, జనవరి 1: ముంబయి పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సరుూద్ అణచివేతకు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. జమాత్ -ఉద్ -దవా చీఫ్ హఫీజ్ సరుూద్‌కు చెందిన చారిటీ సంస్థలు, ఆస్తులను సీజ్ చేయాలని యోచిస్తున్నట్టు ఓ మీడియా కథనం వెలువడింది.

01/02/2018 - 03:31

సియోల్, జనవరి 1: కొత్త ఏడాది తొలి రోజున ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ మరింత రెచ్చిపోయారు. తమ జోలికొస్తే ఏం చేస్తానో తెలియదంటూ పరోక్షంగా అమెరికాను హెచ్చరించారు. తమ దేశ సార్వభౌమత్వాన్ని హరిస్తే, ముప్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తే దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయన్నారు. తనకు తిక్కరేగిందంటే నిరంతరం అందుబాటులో ఉండే అణు మీట నొక్కేస్తానంటూ బెంబేలెత్తించారు.

01/02/2018 - 02:07

వాషింగ్టన్, జనవరి 1: ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్తాన్‌కు ఎలాంటి ఆర్థిక సహాయం అందజేయబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రకటించారు. ‘పాకిస్తాన్ పచ్చి అబద్ధాల కోరు. మోసానికి పాల్పడి ఇన్నాళ్లూ అమెరికా ఆర్థిక సాయం పొందింది’అంటూ ట్రంప్ నిప్పులు చెరిగారు. గత పదిహేనేళ్లలో అమెరికా 33 బిలియన్ డాలర్ల సాయం అందించిందని ట్రంప్ తన ట్విట్టర్‌లో తెలిపారు.

01/01/2018 - 03:47

జలాలాబాద్, డిసెంబర్ 31: తూర్పు అఫ్గానిస్తాన్‌లో ఓ శవదహన సంస్కారం జరుగుతున్న ప్రాంతంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 15 మంది మరణించారు. మరో 14మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడికి తమదే బాధ్యత అని ఏ మిలిటెంట్ సంస్థా ప్రకటించనప్పటికీ ఇటీవలి కాలంలో ఈ తరహా దాడులకు ఒడిగడుతున్న తాలిబన్, ఐసిస్ మిలిటెంట్లే ఈ దాడికి పాల్పడి ఉండవచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

12/31/2017 - 03:08

ఖాట్మండు, డిసెంబర్ 30: ఒక్కరే పర్వతారోహణ చేయడాన్ని నేపాల్ ప్రభుత్వం నిషేధించింది. ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు నేపాల్ సాంస్కృతిక, టూరిజం, విమానయాన శాఖ మంత్రిత్వ విభాగం కార్యదర్శి మహేశ్వర్ న్యూపనే విలేఖరులకు తెలిపారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు న్యూపనే తెలిపారు.

12/31/2017 - 02:59

సియోల్, డిసెంబర్ 30: బాక్‌మెయిలింగ్‌కు పాల్పడడం, తమ సరిహద్దుల్లో యుద్ధవిన్యాసాలు నిర్వహించడం వంటి దుశ్చర్యలను అమెరికా కొనసాగిస్తున్నంతకాలం అణ్వస్త్ర పరీక్షలను వీడేదిలేదని ఉత్తర కొరియా స్పష్టం చేసింది. ఉత్తరకొరియా ఈ యేడాది చేపట్టిన అతిపెద్ద అణ్వాయుధ ప్రయోగాలు, క్షిపణి పరీక్షలపై సమీక్షించినట్టు అధికార కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజన్సీ పేర్కొంది.

12/30/2017 - 02:22

వాషింగ్టన్, డిసెంబర్ 29: మహిళలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయడంలో భారత్‌లో పరిస్థితి సవాళ్ల మయంగానే ఉందని, లింగ న్యాయం అన్నది ఇప్పటికీ ఓ పెద్ద సమస్యగానే పరిణమిస్తోందని ఐక్యరాజ్య సమితి సహాయ సెక్రటరీ జనరల్, అలాగే యుఎన్ విమెన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లక్ష్మీపురి అన్నారు.

12/30/2017 - 02:19

న్యూయార్క్, డిసెంబర్ 29: అమెరికాలోని ఓ ఐదంస్తుల భవనంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 12మంది మరణించారు. వీరిలో ఓ పసికందు కూడా ఉంది. ఇటీవలి కాలంలో అమెరికాలో ఇంత భారీ అగ్నిప్రమాదం జరగడం ఇదే మొదటిసారిగా చెబుతున్నారు. అగ్నిప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేస్నున్నట్టు పోలీస్ అధికారులు వల్లడించారు.

Pages