S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

12/24/2017 - 03:38

వాషింగ్టన్, డిసెంబర్ 23: గత నెల 19న ఖండాంతర క్షిపణి ప్రయోగ పరీక్షను నిర్వహించినందుకు ఉత్తర కొరియాపై ఐక్యరాజ్యసమితిలోని భద్రతామండలి సరికొత్త ఆంక్షలను విధించింది. ఈ ఆంక్షలను ‘మండలి’ ఏకగ్రీవంగా ఆమోదించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఇంధన రంగం, ఎగుమతి, దిగుమతులు, వలస కార్మికులకు సంబంధించి ఉత్తర కొరియాపై ఈ ఆంక్షలు ఉంటాయి.

12/24/2017 - 01:44

ఇస్లామాబాద్, డిసెంబర్ 23: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి మిల్లీ ముస్లిం లీగ్ (ఎంఎంఎల్)కు అర్హత కల్పించవద్దంటూ ఇస్లామాబాద్ హైకోర్టును పాక్ ప్రభుత్వం కోరింది. హైకోర్టు వ్యక్తం చేసిన కొన్ని అభ్యంతరాలపై లేఖ రాస్తూ, ఆ పార్టీ అసలు స్వరూపం ముంబయి టెర్రర్ సూత్రధారి హఫీజ్ సరుూదేనని విస్పష్టంగా పేర్కొంది.

12/23/2017 - 02:42

ఐక్యరాజ్య సమితి, డిసెంబర్ 22: ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్‌ను కట్టడి చేయాలని ఐరాస భద్రతా మండలిలో భారత్ ఉద్ఘాటించింది. ఆఫ్గనిస్తాన్‌లో శాంతి భద్రతలు క్షీణించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్, లష్కరే ఉగ్రవాదులను ప్రోత్సహించే చర్యలకు పాకిస్తాన్ స్వస్తిచెప్పాలని ఐరాసలో భారత్ డిప్యూటీ శాశ్వత ప్రతినిధి తన్మయ లాల్ డిమాండ్ చేశారు.

12/23/2017 - 02:40

పారిస్, డిసెంబర్ 22: జెరూసలెంను ఇజ్రాయల్ రాజధానిగా గుర్తిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇపుడు అమలు చేయాలనుకుంటున్న ‘శాంతి ప్రణాళిక’ను తమ ప్రజలు ఆమోదించే ప్రసక్తే లేదని పాలస్తీనా అధ్యక్షుడు మహముద్ అబ్బాస్ స్పష్టం చేశారు.

12/23/2017 - 02:38

వాషింగ్టన్, డిసెంబర్ 22: ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తే తగిన మూల్యం చెల్లించుకోవల్సి ఉంటుందని పాకిస్తాన్‌ను అమెరికా హెచ్చరించింది. ఇప్పటికే పలుమార్లు పాక్ చర్యలను వ్యతిరేకిస్తున్న అమెరికా తాజాగా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న దేశాల జాబితాలో పాకిస్తాన్‌ను చేర్చింది. ఈ విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ శుక్రవారం వెల్లడించారు.

12/23/2017 - 02:13

బీజింగ్, డిసెంబర్ 22: డోక్లాం వివాదం తర్వాత భారత్, చైనాల మధ్య తొలిసారిగా సరిహద్దు చర్చలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఢిల్లీ వేదికగా ఇరుదేశాల ప్రతినిధుల మధ్య 20వ విడత చర్చలు కొనసాగాయి. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనాకు చెందిన స్టేట్ కౌన్సిలర్ యాంగ్ జీచీలతో పాటు ఉభయ దేశాలకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

12/22/2017 - 04:31

ఇస్లామాబాద్, డిసెంబర్ 21: వివాదాలను పరిష్కరించుకునే దిశగా పాక్‌లోని పౌర ప్రభుత్వం భారత్‌తో చర్చలు జరిపితే తాను మద్దతునిస్తానని ఆ దేశ ఆర్మీ అధిపతి జనరల్ ఖ్వమర్ జావేద్ బజ్వా అన్నారు. పాక్ పార్లమెంటులోని ఎగువసభ (సెనేట్)కు తమ దేశంలో భద్రతా పరిస్థితులు, ప్రాంతీయ అంశాల గురించి ఆయన వివరించారు.

12/20/2017 - 01:56

బీజింగ్, డిసెంబర్ 19: ‘డోక్లాం సమస్య భారత్- చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు అగ్నిపరీక్ష లాంటిది. భవిష్యత్‌లో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా డోక్లాం నుంచి పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది’ అని చైనా వ్యాఖ్యానించింది. భారత్-చైనా సరిహద్దు సమస్యలపై శుక్రవారం నుంచి చర్చలుకానున్న తరుణంలో చైనా నర్మగర్భమైన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

12/18/2017 - 04:12

కరాచీ/లాహోర్, డిసెంబర్ 17: నిషేధిత ఉగ్రవాద సంస్థలు ‘లష్కరే తోయిబా’, ‘జమాత్ ఉద్ దవా’ దేశభక్తికి ప్రతీకలని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ప్రశంసలు కురిపించారు. పాకిస్తాన్ రక్షణ, భద్రత కోసం రాబోయే ఎన్నికల్లో ఆ సంస్థలను కూటమిలో చేర్చుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు.

12/18/2017 - 04:02

ఇస్లామాబాద్, డిసెంబర్ 17: పాకిస్తాన్ జైలులో ఉన్న భారత వాయుసేన మాజీ అధికారి కులభూషణ్ జాదవ్‌ను కలుసుకునేందుకు అతని తల్లి, భార్యలకు వీసాలను కొద్దిరోజుల్లో పంపిస్తామని ఆ దేశ విదేశాంగ కార్యాలయం ప్రతినిధి మహమ్మద్ ఫైజల్ ఆదివారం ట్విట్టర్‌లో తెలిపారు. వీసాలు మంజూరు చేయాల్సిందిగా ఆ ఇద్దరూ పంపిన దరఖాస్తులు తమకు అందాయని, వీసాలు తయారైన వెంటనే వారికి అందజేస్తామన్నారు.

Pages