S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

11/28/2017 - 03:30

బీరుట్, నవంబర్ 27: ఐసిస్ ఆధీనంలో వున్న ఈశాన్య సిరియాలోని ఓ గ్రామంపై రష్యా వైమానిక దళాలు జరిపిన దాడుల్లో 53మంది పౌరులు మృతిచెందారు. వీరిలో 21మంది వరకూ పిల్లలు ఉన్నారని చెబుతున్నారు. ఊఫ్‌రేట్స్ నది కుడిగట్టుకు ఆనుకుని వున్న డెయిర్ ఎజ్జోర్ ప్రావిన్స్‌లోని అల్-సఫా గ్రామంపై రష్యా వైమానిక దళాలు విరుచుకుపడ్డాయని సిరియా పరిస్థితులపై పని చేస్తున్న బ్రిటన్ ఆధారిత మానవ హక్కుల కమిటీ ఒకటి వెల్లడించింది.

11/28/2017 - 03:22

ఇస్లామాబాద్, నవంబర్ 27: పాకిస్తాన్‌లో అతివాద మత గ్రూపుల ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గడంతో న్యాయ శాఖ మంత్రి జహీద్ హమీద్ సోమవారం పదవి నుంచి తప్పుకున్నారు. ప్రభుత్వం దిగిరావడంతో అతివాదులు తమ హింసాత్మక ఆందోళనలను ఉపసంహరించుకున్నారు. ఈ ఆందోళనల్లో ఆరుగురు మృతి చెందగా, వందలాది మంది గాయపడ్డారు.

11/28/2017 - 03:20

ఢాకా, నవంబర్ 27: ‘బంగ్లాదేశ్ రైఫిల్స్’ (బిడిఆర్)కు చెందిన 139 మంది సైనికులకు మరణశిక్ష, మరో 146 మంది సైనికులకు యావజ్జీవ జైలుశిక్ష విధించాలన్న కింది కోర్టు తీర్పును బంగ్లాదేశ్ హైకోర్టు సమర్థించింది. 2009లో దేశంలో తిరుగుబాటు సందర్భంగా 74 మంది పౌరులను, 57 ఆర్మీ అధికారులను బిడిఆర్ సైనికులు హతమార్చినందుకు ఈ శిక్షలను విధించారు.

11/28/2017 - 04:01

లాస్ వేగాస్ (అమెరికా), నవంబర్ 27: దాదాపు నాలుగు దశాబ్దాల విరామం తర్వాత దక్షిణాఫ్రికాకు చెందిన ముద్దుగుమ్మ మరోసారి ‘విశ్వసుందరి’ కిరీటాన్ని కైవసం చేసుకుంది. అమెరికాలోని లాస్ వేగాస్ నగరంలో ఆదివారం రాత్రి జరిగిన తుది పోటీలో దక్షిణాఫ్రికాకు చెందిన 22 ఏళ్ల డెమి-లేహ్- నెల్ పీటర్స్‌ని ‘విశ్వసుందరి’గా ఎంపిక చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. 1978లో

11/27/2017 - 03:15

ఇస్లామాబాద్, నవంబర్ 26: వరుసగా రెండోరోజు కూడా పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ అల్లర్లతో దద్దరిల్లింది. అతివాద మత సంస్థల కార్యకర్తలకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఆరుగురు మరణించారు. 200మందికి పైగా గాయపడ్డారు. గత మూడు వారాలుగా అతివాద మత సంస్థలకు చెందిన కార్యకర్తలు ఇస్లామాబాద్‌కు దారితీసే మార్గాలన్నింటినీ దిగ్బంధం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది.

11/27/2017 - 02:57

లాహోర్, నవంబర్ 26: ముంబయిపై జరిగిన భయానక దాడికి కుట్ర జరిపిన వారిని శిక్షించే విషయంలో పాకిస్తాన్ ఎప్పుడూ కూడా చిత్తశుద్ధితో వ్యవహరించలేదు. పదిమంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు 2008 నవంబర్ 26న ముంబయిపై దాడి జరిపి 166మందిని బలిగొన్న విషయం తెలిసిందే. ఆ దాడికి సంబంధించి పాక్ కుట్రదారుల ప్రమేయాన్ని రుజువు చేస్తూ భారత్ ఎన్నో సాక్ష్యాధారాలను పాక్‌కు అందించింది.

11/27/2017 - 00:25

న్యూజిలాండ్, నవంబర్ 26: మనిషి మేధస్సు నుంచే పుట్టినా, మనిషిని -మర మనిషి ఎప్పుడో దాటిపోయాడు. మానవుడికి అసాధ్యమైన అనేకానేక రంగాల్లో తన కృత్రిమ మేథస్సుతో అద్భుతాలు సాధిస్తున్నాడు. అలాంటి రోబోలు రాజకీయాల వైపూ దృష్టి పెడితే.. న్యూజిలాండ్‌లో అదే జరగబోతోంది. రాజకీయాల్లో నేతల విశ్వసనీయత మీద సవాలక్ష అనుమానాలు ముసురుతున్న తరుణంలో -రాజకీయ కార్యకలాపాలు చక్కదిద్దే రోబోలు రూపుదిద్దుకుంటున్నాయి.

11/26/2017 - 03:28

పాకిస్తాన్‌లో శనివారం చెలరేగిన అల్లర్లలో పోలీసు వాహనాన్ని తగులబెట్టిన ఆందోళనకారులు

11/26/2017 - 03:22

వాషింగ్టన్, నవంబర్ 25: ముంబయి పేలుళ్ల సూత్రధారి, జమాత్- ఉద్ దవా అధిపతి హఫీజ్ సరుూద్ పాక్ రాజకీయాల్లో తీవ్రవాదాన్ని చొప్పించి ఆ దేశంపై ఆధిపత్యాన్ని చెలాయించాలని ఆరాటపడుతున్నట్లు అమెరికా గూఢచారి సంస్థ ‘సిఐఏ’ మాజీ డిప్యూటీ డైరెక్టర్ మైకేల్ మోరల్ అన్నారు. ఉగ్రవాద చర్యలతో నరమేధం సృష్టిస్తున్న సరుూద్ తలపై అమెరికా ప్రభుత్వం పది మిలియన్ల డాలర్ల రివార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే.

11/26/2017 - 03:21

వాషింగ్టన్, నవంబర్ 25: అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సరుూద్‌ను గృహనిర్బంధం నుంచి విడుదల చేయడం తప్పుడు నిర్ణయమని, ఉగ్రవాదంపై పోరులో అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాలని అమెరికా పేర్కొంది. ముంబయి పేలుళ్లకు సూత్రధారి అయిన సరుూద్‌ను వెంటనే అరెస్టు చేయాలని అమెరికా పాక్‌కు తేల్చిచెప్పింది. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ తీవ్రంగా పరిగణించాల్సిన సమయం ఆసన్నమైందని అమెరికా వ్యాఖ్యానించింది.

Pages