S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

10/10/2017 - 01:59

ఇస్లామాబాద్, అక్టోబర్ 9: పనామా పేపర్ల కేసులో పదవి కోల్పోయిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోమవారం కోర్టు వాయిదాకు గైర్హాజరయ్యారు. ఆయనపై 13న అభియోగాలు నమోదుచేయాలని కోర్టు ఆదేశించింది. మరోపక్క షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ (43), ఆమె భర్త మహ్మద్ సఫ్దర్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరియం, ఆమె భర్త మాజీ ఆర్మీ కెప్టెన్‌లపై పనామా పేపర్ల కుంభకోణం ఆరోపణలున్నాయి.

10/10/2017 - 01:04

స్టాక్‌హోమ్, అక్టోబర్ 9: అర్థశాస్త్ర నియమ నిబంధనలను మానవీయ కోణంలో ఆవిష్కరించే సరికొత్త ప్రవర్తనాత్మక కోణాన్ని వెలుగులోకి తెచ్చిన అమెరికా ఆర్థికవేత్త రిచర్డ్ తాలెర్‌కు 2017 సంవత్సరానికి గాను అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ఆర్థిక, ద్రవ్యపరమైన నిర్ణయాలు తీసుకునేవారంతా అన్ని వేళలా సహేతుకంగా ఉండరని, వారిలో మానవీయ కోణాలు తరచూ వెలుగుచూస్తాయని ఆయన సూత్రీకరించారు.

10/09/2017 - 02:14

న్యూ ఓర్లాన్స్, అక్టోబర్ 8: వరుస తుపాన్ల బీభత్సంతో అమెరికా అల్లాడుతోంది. కొద్ది రోజుల క్రితమే మధ్య అమెరికాలో విధ్వంసాన్ని సృష్టించిన తీవ్ర హరికేన్ల నష్టాల నుంచి ప్రజలు తేరుకోకముందే, యుఎస్ గల్ఫ్ తీరాన్ని నేట్ హరికేన్ వణికిస్తోంది. తుపాను తీవ్రతవున్న ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనలతో వణుకుతున్నారు.

10/08/2017 - 02:12

మాస్కో, అక్టోబర్ 7: సిరియాలో భారీఎత్తున వైమానిక దాడులు జరిపిన రష్యా 180 మంది ఐఎస్ మిలిటెంట్లను మట్టుబెట్టింది. 24 గంటల్లో మొత్తం 120 మంది ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు, 60 మంది విదేశీ కిరాయి సైనికులను హతం చేసినట్టు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ శనివారం మాస్కోలో ప్రకటించింది. అయితే ఒమర్ అల్ షిషానీతోపాటు ముగ్గురు సీనియర్ ఐఎస్ కమాండర్లను వైమానిక దాడుల్లో చంపేశామని రష్యా చెప్పుకొచ్చింది.

10/08/2017 - 02:12

ఇస్లామాబాద్, అక్టోబర్ 7: భారత నౌకాదళ మాజీ ఉద్యోగి కుల్‌భూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజె)లో పిటిషన్ దాఖలు చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నాలు ప్రారంభించింది. గూఢచర్యం నేరంపై 46 ఏళ్ల జాదవ్‌కు పాకిస్తాన్ సైనిక కోర్టు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. 2016 మార్చిలో బలోచిస్తాన్‌లో జాదవ్‌ను పాకిస్తాన్ భద్రతాదళాలు పట్టుకున్నాయి.

10/08/2017 - 01:49

వాషింగ్టన్, అక్టోబర్ 7: అంతర్జాతీయ అణ్వాయుధాల నిషేధ ఒప్పందంపై సంతకం చేసే ఉద్దేశం లేదని అమెరికా స్పష్టం చేసింది.‘ప్రస్తుత పరిస్థితుల్లో మాకు ఆ ఉద్దేశం లేదు. అణ్వాయుధాలకు సంబంధించి మా విధానం మారదు. అణ్వాయుధాల నిషేధం ఒప్పందానికి మద్దతు ఇవ్వడం లేదా సంతకం పెట్టడం జరగదు’అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వెల్లడించారు.‘ఈ ఒప్పందం వల్ల వొనగూరేదీ ఏమీ ఉండదు. ప్రపంచంలో ఒక్కసారిగా శాంతి నెలకొనదు.

10/08/2017 - 01:49

ఐక్యరాజ్య సమితి, అక్టోబర్ 7: భారత్‌లో వేర్పాటువాదులు, నక్సలైట్లు బాలలను తమలో చేర్చుకుంటుండటం పట్ల ఐక్యరాజ్య సమితి (ఐరాస) సెక్రెటరి జనరల్ ఆంటోనియో గుటెరిస్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల సాయుధ గ్రూపులకు, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో బాలలు నలిగిపోతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేకంగా జమ్మూకాశ్మీర్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లలో ఈ పరిస్థితి ఉందని ఆయన తెలిపారు.

10/08/2017 - 01:15

పాంగ్యాంగ్, అక్టోబర్ 7: అగ్రరాజ్యం ఎన్ని బెదిరింపులకు దిగినప్పటికీ వెనక్కి తగ్గని ఉత్తర కొరియా, ఇప్పుడు ఏకంగా అమెరికాపైకే లాంగ్ రేంజ్ క్షిపణిని ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్షిపణి అమెరికా పశ్చిమ తీరాన్ని తాకగలదని భావిస్తున్నట్లు రష్యా పార్లమెంట్ సభ్యుడు ఆంటోన్ మొరొజోవ్ తెలిపారు.

10/07/2017 - 02:08

న్యూయార్క్, అక్టోబర్ 6: ఆధునిక ప్రపంచ అవసరాలకు అనుగుణంగా ఐక్యరాజ్య సమితి (ఐరాస) అనుబంధ సంస్థలను సంస్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ముఖ్యంగా ఐరాస భద్రతామండలి సంస్కరణ, విస్తరణకు సంబంధించి మరింత బలంగా తమ వాదనను వినిపించిన భారత్‌‘ఈ వ్యవస్థలన్నీ కూడా కేవలం కొన్ని దేశాల ప్రయోజనానాలను దృష్టిలోపెట్టుకుని నాటి అవసరాల కోసం ఏర్పడినవే’అని స్పష్టం చేసింది.

10/07/2017 - 01:14

ఓస్లో, అక్టోబర్ 6: ఉత్తర కొరియా, ఇరాన్‌లు సృష్టిస్తున్న అణు సంక్షోభం నేపథ్యంలో అణు నిరాయుధీకరణ కోసం గత దశాబ్దకాలంగా అహరహరం శ్రమిస్తున్న ఓ ఎన్జీఓ బృందానికి నోబెల్ శాంతి బహుమతి లభించింది. ప్రపంచాన్ని అణుబాంబు నుంచి విముక్తం చేయాలంటూ ‘ఐకెన్’ సంస్థ అవిశ్రాంతంగా ప్రచారం జరుపుతోంది.

Pages