S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

09/27/2017 - 02:42

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 26: పనామా పత్రాల కుంభకోణానికి సంబంధించి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై అక్టోబర్ 2న చార్జిషీట్ నమోదు చేయాలని పాకిస్తాన్‌కు చెందిన అవినీతి వ్యతిరేక కోర్టు మంగళవారం నిర్ణయించింది. పనామా పత్రాల కుంభకోణంలో అవినీతి ఆరోపణలను ఎదుర్కోవడం కోసం లండన్‌నుంచి వచ్చిన షరీఫ్ మంగళవారం తొలిసారిగా కోర్టు ముందు హాజరయ్యారు.

09/27/2017 - 02:40

ఐరాస, సెప్టెంబర్ 26: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను ప్రపంచానికే రాజునని భావిస్తున్నారని వెనిజులా ధ్వజమెత్తింది. ఐరాస జనరల్ అసెంబ్లీలో వెనిజులా విదేశాంగ మంత్రి జోర్గే అర్రెజా మాట్లాడుతూ ట్రంప్‌పై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. వెనిజులా అధికారుల పర్యటనపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఐరాస సర్వసభ్య వార్షిక సమావేశంలో ప్రపంచ దేశాల నేతల వద్ద ట్రంప్‌పై నిప్పులు చెరిగారు.

09/27/2017 - 02:39

చిత్రం..జమ్ముకాశ్మీర్‌లో పాక్ ప్రోత్సాహిత ఉగ్రవాదులు జరిపిన మారణకాండకు సంబంధించి చిత్రాలను
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో చూపుతున్న భారత ప్రతినిధి పౌలోమి త్రిపాఠి

09/27/2017 - 02:38

బీజింగ్, సెప్టెంబర్ 26: పాకిస్తాన్‌ను ఉద్దేశించి భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చేసిన వ్యాఖ్యలను చైనా మీడియా ఎద్దేవా చేసింది. పాకిస్తాన్ ఉగ్రవాదులను తయారు చేసే దేశం అంటూ ఐరాస జనరల్ అసెంబ్లీలో స్వరాజ్ ఎండగట్టిన సంగతి తెలిసిందే. ‘పాకిస్తాన్‌లో ఉగ్రవాదం ఉన్నమాట వాస్తవమే. అయితే ఆ దేశాన్ని ఉద్దేశించి సుష్మా స్వరాజ్ చేసిన వ్యాఖ్యలు దురహంకార పూరితం’ అని ప్రభుత్వ మీడియా ‘చైనా డైలీ’ ఆరోపించింది.

09/27/2017 - 02:31

ఢాకా, సెప్టెంబర్ 26: మైన్మార్‌లో రోహింగ్యా మైనారిటీలపై జరుగుతున్న దారుణాలనుంచి తప్పించుకుని దాదాపు 6వేల మంది పిల్లలు తమ తల్లిదండ్రులను వదిలిపెట్టి బంగ్లాదేశ్‌కు చేరుకున్నారు. వారికోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆ దేశ మంత్రి నురుజ్జామన్ అహ్మద్ తెలిపారు. అందుకోసం అన్ని సౌకర్యాలతో భవనాన్ని నిర్మించేందుకు 200 ఎకరాల స్థలాన్ని సేకరించాలని అధికారులను ఆదేశించారు.

09/27/2017 - 02:30

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 26: పాకిస్తాన్ ఇంటలిజెన్స్ బ్యూరోలో ముసలం పుట్టింది. ఈ సంస్థ ఉగ్రవాదులను రక్షిస్తోందంటూ ఓ సీనియర్ ఇంటలిజెన్స్ అధికారి ఏకంగా కోర్టులోనే పిటిషన్ వేశాడు. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన కోర్టును కోరినట్లుగా మీడియా కథనాలు వెలువడ్డాయి. పాకిస్తాన్ ఇంటలిజెన్స్ బ్యూరోలో ఎఎస్‌ఐగా పనిచేస్తున్న మాలిక్ ముఖ్తార్ అహ్మద్ అనే ఈ అధికారి తన సీనియర్ అధికారులపైనే తీవ్ర ఆరోపణలు చేశారు.

09/26/2017 - 02:39

వాషింగ్టన్, సెప్టెంబర్ 25: తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధించిన దేశాల జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని దేశాలను చేర్చారు. తాజాగా ఉత్తర కొరియా, వెనెజులా, చాద్ దేశాల పౌరులను చేర్చారు. దీంతో నిషేధిత దేశాల సంఖ్య 8కి చేరుకొంది. నిషేధిత ఉత్తర్వులపై ట్రంప్ ఆదివారం సంతకం చేశారు. గతంలో ఆరు ముస్లిం దేశాలపై విధించిన నిషేధం ఆదివారంతో ముగిసింది.

09/26/2017 - 02:38

లండన్, సెప్టెంబర్ 25: బ్రిటన్‌లో ఓ ముస్లిం డాక్టర్‌పై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేసి మెడపై తీవ్రంగా గాయపరిచారు. నాసిర్ కుర్దీ అనే ఈ 58 ఏళ్ల డాక్టర్ గ్రేటర్ మాంచెస్టర్‌లో ఆదివారం నమాజ్ కోసం వెళ్తున్నప్పుడు దాడి చేశారు. దాడి జరిగిన గంటలోనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

09/26/2017 - 02:34

టోక్యో, సెప్టెంబర్ 25: జపాన్ పార్లమెంటును గురువారం రద్దు చేయనున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు షింజో అబే సంచలన ప్రకటన చేశారు. పక్కనే ఉన్న ఉత్తర కొరియాతో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో మరోసారి అధికారంలో కొనసాగడానికి వీలుగా అక్టోబర్‌లో పార్లమెంటు ఎన్నికలు నిర్వహించాలని అనుకొంటున్నట్లు అబే సోమవారం విలేఖరుల సమావేశంలో ప్రకటించారు.

09/26/2017 - 02:32

అబుదాబీ, సెప్టెంబర్ 25: ఇరవై మంది వైద్య నిపుణుల సమక్షంలో రేయింబవళ్లూ సేవలందించినా ఈజిప్టు మహిళ ఎమన్ అబ్దుల్ అత్తీ (37) ప్రాణాలు కాపాడలేకపోయారు. ప్రపంచ భారీకాయురాలు ఎమన్ సోమవారం ఇక్కడో ఆసుపత్రిలో మృతి చెందారు. బరువు తగ్గించుకునేందుకు ఆమెకు బెరియాట్రిక్ ఆపరేషన్ చేయించుకుంది. 500 కిలోల బరువున్న ఎమన్ అబుదాబీలోని బుర్జీల్ ఆసుపత్రిలో కన్నుమూశారు.

Pages