S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

09/26/2017 - 02:27

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 25: పనామా పేపర్ల కుంభకోణం, మనీలాండరింగ్ కేసులు ఎదుర్కొంటున్న పదవీచ్యుత ప్రధాని నవాజ్ షరీఫ్ స్వదేశానికి చేరుకున్నారు. ప్రధాని పదవి కోల్పోయిన షరీఫ్ గత నెల 31న లండన్ వెళ్లిపోయారు. ఆయన సతీమణి కుల్సూమ్ కేన్సర్‌తో బాధపడుతూ అక్కడ చికిత్సపొందుతున్నారు. కుటుంబ సభ్యులతోపాటు లండన్ వెళ్లిన షరీఫ్ సోమవారం ఉదయం 7.30 గంటలకు ఇస్లామాబాద్ చేరుకున్నారు.

09/26/2017 - 01:58

జెరూసలెం, సెప్టెంబర్ 25: దశాబ్ద కాలంగా ఫతా, హమాస్‌ల మధ్య విభేదాలకు ముగింపు పలికేందుకు చేపట్టన తాజా ప్రయత్నంలో భాగంగా పాలస్తీనా ప్రధాని రమి హందుల్లా అక్టోబర్ 2న గాజా వెళ్తున్నారని ఆయన ప్రభుత్వం ప్రకటించింది.

09/25/2017 - 02:26

లాహోర్, సెప్టెంబర్ 24: ముంబయిపై ఉగ్రవాద దాడి కేసులో 24 మంది భారతీయుల వాంగ్మూలాలను నమోదు చేయడం కోసం వారిని ఇక్కడికి రప్పించాలని, ఈ విషయంపై కేంద్రీకరించడానికి ఒక ఫోకల్ పర్సన్‌ను నియమించాలని ఈ కేసులోని ఏడుగురు నిందితులను విచారిస్తున్న పాకిస్తాన్ కోర్టు ఫెడరల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్‌ఐఎ)ని ఆదేశించింది.

09/25/2017 - 02:22

ఐక్యరాజ్య సమితి, సెప్టెంబర్ 24: భారత దేశం దురాక్రమణదారుగా ప్రవర్తిస్తోందని ఆరోపించిన పాక్, పొరుగు దేశాలయిన ఈ రెండు దేశాల మద్య ఉద్రిక్తతలు పెరిగిపోకూడదని ప్రపంచ దేశాలు గనుక కోరుకొంటున్నట్లయితే రెచ్చగొట్టే చర్యలను తక్షణం నిలిపివేయాలని భారత్‌ను కోరాలని పేర్కొంది.

09/25/2017 - 02:21

వాషింగ్టన్, సెప్టెంబర్ 24: భారత్-అమెరికా రక్షణ సంబంధాలను మరింత ఎత్తుకు తీసుకెళ్లే ఉద్దేశంతో అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాట్టిస్ వచ్చే వారం భారత్‌లో పర్యటించనున్నారు. భరాత్‌కు ఎఫ్-16 యుద్ధ విమానాల విక్రయం, దక్షిణాసియా ప్రాంతంలో భద్రతా పరిస్థితిపై ఆయన ప్రధానంగా భారత నేతలతో చర్చించనున్నారు.

09/25/2017 - 02:17

ఐక్యరాజ్య సమితి, సెప్టెంబర్ 24: స్థిరమైన అభివృద్ధి, శాంతి పరిరక్షణ చర్యలు, పర్యావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ఐక్యరాజ్య సమితి చేస్తున్న కృషిలో భారత్ పాత్రను ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ ప్రశంసించారు. శనివారం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రసంగించిన తర్వాత గుటెరెస్‌తో ఆమెతో భేటీ అయిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

09/25/2017 - 01:10

ఐక్యరాజ్య సమితి, సెప్టెంబర్ 24: అబద్ధం అడినా అతికినట్లు ఉండాలని పెద్దలు అంటారు. అయితే ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్‌ను దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నించిన పాకిస్తాన్ ఏమాత్రం పొంతన లేని అబద్ధం ఆడి అడ్డంగా దొరికిపోయింది.

09/24/2017 - 03:09

టెహ్రాన్, సెప్టెంబర్ 23: అమెరికా బెదిరింపులను ఖాతరు చేయకుండా ఇరాన్ ఒక కొత్త మీడియం రేంజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఖొరామ్‌షహర్ అనే ఈ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన చిత్రాలను ఇరాన్ అధికార టెలివిజన్ శనివారం ప్రసారం చేసింది. ఇరాన్ శుక్రవారం నిర్వహించిన ఉన్నత స్థాయి మిలిటరీ పరేడ్‌లో ఈ క్షిపణిని ప్రదర్శించింది.

09/24/2017 - 03:03

సిట్వే (మైన్మార్), సెప్టెంబర్ 23: రోహింగ్యా ముస్లింల సమస్య రావణకాష్టంలా రగులుతూనే ఉంది. రొఖినా రాష్ట్రంలో మసీదు పేల్చివేతకు రోహింగ్యా మిలిటెంట్లు యత్నించారన్న మైన్మార్ సైన్యం ఆరోపణలు మరింత అగ్గిని రాజేసింది. సైన్యం దాడులకు భయపడి దేశంనుంచి పారిపోయిన రోహింగ్యాలు మళ్లీ తిరిగిరాకుండా ఉండేందుకు సైన్యం ఇలాంటి దుష్ప్రచారం చేస్తోందని హక్కుల సంఘాలు విరుచుకుపడుతున్నాయి.

09/24/2017 - 01:33

కరాచి, సెప్టెంబర్ 23: పాకిస్తాన్ నావికాదళం శనివారం యాంటీ- షిప్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఓపక్క సరిహద్దుల్లో కాల్పుల ఉల్లంఘనకు తెగబడుతూనే, తాజాగా క్షిపణి ప్రయోగం జరపడం భారత్‌ను రెచ్చగొట్టడమేనన్న వాదన వినిపిస్తోంది. ఐరాస సాధారణ సమావేశంలో భారత్ పట్ల తన ధోరణికి తీవ్ర వ్యతిరేకతలు మూటగట్టుకున్న పాక్, తాజాగా క్షిపణిని నౌక సహాయం లేకుండానే సీ కింగ్ హెలికాప్టర్ నుంచి ప్రయోగించటం గమనార్హం.

Pages