S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

07/26/2016 - 13:35

మొగాదిషు: సొమాలియా రాజధాని మొగాదిషు సమీపంలో మంగళవారం ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో 8మంది పౌరులు మృతి చెందారు. కారు బాంబుతో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో భారీ పేలుడు సంభవించింది.దాడికి పాల్పడింది తామేనని అల్‌ షబీబ్‌ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది.

07/26/2016 - 12:44

ఢాకా: బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో సోమవారం అర్ధరాత్రి ఉగ్రవాదులను పోలీసులు సమర్థంగా తిప్పికొట్టారు. 10 మంది ఉగ్రవాదులు ఓ భవనంలోని నాలుగో అంతస్థులోకి చొరబడి దాడులకు పాల్పడేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు భవనాన్ని చుట్టుముట్టి కాల్పులు జరిపారు. తెల్లవారుజామున ఉగ్రవాదులకు పోలీసులకు మధ్య రెండు గంటల పాటు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 9 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

07/26/2016 - 11:44

టక్యో (జపాన్‌) : పశ్చిమ టోక్యోలో సాగమిహరాలో వికలాంగుల ఆశ్రమంపై 26 ఏళ్ల యువకుడు కత్తితో దాడికి దిగాడు. దొరికిన వారిని దొరికినట్టు విచక్షణా రహితంగా నరికేశాడు. ఈ ఘటనలో 19 మంది వికలాంగులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడు గతంలో ఇదే ఆశ్రమంలో పనిచేసినట్లు, గాయపడిన వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

07/26/2016 - 04:40

బీజింగ్, జూలై 25: భారత్‌లో ఉంటున్న ముగ్గురు తమ పౌరులకు వీసా పొడిగింపును తిరస్కరించటంపై చైనా తీవ్రంగా స్పందించింది. భారత్ తమపై ప్రతీకారం తీర్చుకునే ధోరణిలో వ్యవహరిస్తే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆ దేశ అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ హెచ్చరించింది. చైనా అధికార వార్తా సంస్థ జిన్‌హువాకు చెందిన ముగ్గురు జర్నలిస్టులకు వీసా పొడిగింపును భారత్ నిరాకరించింది.

07/26/2016 - 04:36

వాషింగ్టన్, జూలై 25: ప్రపంచ వాణిజ్యసంస్థ దారుణంగా విఫలమైన వ్యవస్థ అని, తాను అధ్యక్షుడిగా ఏన్నికైతే అమెరికాను అందులోంచి బయటకు తీసుకువస్తానని అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ నామినీ డొనాల్డ్ ట్రంప్ తాజా వ్యాఖ్యలు చేశారు. ఉత్పాదక కార్యకలాపాలను విదేశాలకు తరలిపోయే కంపెనీలపై 30శాతం దిగుమతి సుంకాన్ని కూడా విధిస్తామని వెల్లడించారు.

07/25/2016 - 18:38

శ్రీనగర్‌: నిబంధనలను ఉల్లంఘించి హురియత్‌ కాన్ఫరెన్స్‌ ఛైర్మన్‌, వేర్పాటువాద నేత సయ్యద్‌ అలీ గిలానీ అనంత్‌నాగ్‌కు సోమవారం ర్యాలీ నిర్వహించడానికి ప్రయత్నించడంతో పోలీసులు అరెస్ట్‌ చేశారు. కశ్మీర్‌ లోయలో కొద్ది రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో గిలానీ అక్కడి ప్రజలను పరామర్శించడం కోసం కశ్మీర్‌ లోయలోని అనంతనాగ్‌ జిల్లా ర్యాలీకి పిలుపునిచ్చారు.

07/25/2016 - 17:16

ఫ్లోరిడా (అమెరికా) : ఫ్లోరిడా ఫోర్ట్ మయర్స్‌లోని క్లబ్ బ్లూ‌లో కాల్పుల నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 30 రౌండ్లు కాల్పులు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

07/25/2016 - 15:21

ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం ఫోర్ట్‌ మైర్స్‌లో ఓ నైట్‌ క్లబ్‌లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతిచెందారు. 17 మంది గాయాలపాలయ్యారు. ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. క్లబ్‌ బ్లూలో ‘టీన్‌ నైట్‌’ కార్యక్రమం జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. తుపాకీ చేతబూనిన ఓ వ్యక్తి క్లబ్‌లోకి ప్రవేశించిన వెంటనే జనం పైకి కాల్పులు జరపడం ప్రారంభించాడు.

07/24/2016 - 16:52

బాగ్దాద్‌: ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో ఆదివారం ఆత్మహుతి దాడిలో ముగ్గురు పోలీసుల సహా 12 మంది మృతిచెందారు. సైదీ జిల్లా కాధిమియా ప్రాంతంలోని ఒక చెక్‌ పాయింట్‌ వద్ద దుండగుడు ఆత్మహుతి దాడికి పాల్పడ్డాడు. 20 మందికిపైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.

07/24/2016 - 12:36

ఢిల్లీ: చైనాకు చెందిన అధికార వార్తా సంస్థ 'జిన్హువా' తరఫున పనిచేస్తున్న ముగ్గురు జర్నలిస్టులు జూలై 31వ తేదీలోగా దేశం విడిచిపెట్టాలని ఇండియా ఆదేశించింది.

Pages