S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

09/19/2017 - 03:20

లాహోర్, సెప్టెంబర్ 18: ముంబయిపై ఉగ్రదాడికి సూత్రధారి, జమాత్ ఉద్ దవా హఫీజ్ సరుూద్ పాకిస్తాన్ ఎన్నికల్లో పోటీకి ఉవ్విళ్లూరుతున్నాడు. హఫీజ్ నాయకత్వంలోని జమాత్ పార్టీ 2018 ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఓ సీరియర్ సభ్యుడు వెల్లడించాడు. ఇటీవల ఉప ఎన్నికల్లో అభ్యర్థిని పోటీకి పెట్టిన హఫీజ్ సార్వత్రిక ఎన్నికల్లో సత్తాచాటుతామని ప్రకటించాడు.

09/18/2017 - 03:20

వాషింగ్టన్, సెప్టెంబర్ 17: వాతావరణ మార్పులను నిరోధించడానికి ఉద్దేశించిన పారిస్ ఒప్పందం విషయంలో తాను మెత్తబడినట్లు వచ్చిన వార్తలను అమెరికా ఖండించింది. పారిస్ వాతావరణ ఒప్పందంపై తిరిగి సంప్రదింపులు జరిపి, ఒప్పందంలోని నిబంధనలను తమ దేశానికి అనుకూలంగా మార్చకపోతే ఒప్పందం నుంచి వైదొలగుతామని అమెరికా ఆదివారం స్పష్టం చేసింది.

09/18/2017 - 02:47

వాషింగ్టన్, సెప్టెంబర్ 17:అణు పరీక్షలు ఆపకపోతే ఉత్తర కొరియాను ‘్ధ్వంసం’చేస్తామని అమెరికా తీవ్ర స్వరంతో హెచ్చరించింది. త్వరలో విస్తృ స్థాయిలో దౌత్యపరమైన ప్రయత్నాలు జరుగనున్న తరుణంలో ఉత్తర కొరియాపై అమెరికా మరింత వత్తిడి పెంచింది. అంతర్జాతీయ ఆంక్షలు, హెచ్చరికల్ని ఉల్లంఘించి బాధ్యతారహితంగా అణు, బాలిస్టిక్ క్షిపణి జరిపితే ఇక ఎంత మాత్రం సహించేది లేదని ట్రంప్ ప్రభుత్వం తెగేసి చెప్పింది.

09/18/2017 - 03:35

న్యూయార్క్, సెప్టెంబర్ 17: మరోసారి ఐక్యరాజ్య సమితిలో కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తున్న తరుణంలో భారత్ తీవ్రస్థాయిలోనే దారి ధోరణిని ఎండగట్టింది. ఇప్పటివరకూ కాశ్మీర్ అంశాన్ని ఎన్నోసార్లు ఐరాసలో పాకిస్తాన్ ప్రస్తావించినా ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని, ఈ తాజా ప్రయత్నం కూడా వృధా ప్రయాసే అవుతుందని స్పష్టం చేసింది.

09/17/2017 - 03:08

లండన్, సెప్టెంబర్ 16: లండన్ భూగర్భ రైల్లో శుక్రవారం జరిగిన శక్తివంతమైన పేలుడుకు సంబంధించి పోలీసులు 18 ఏళ్ల యువకుడిని శనివారం అరెస్టు చేశారు. కాగా, ఈ అరెస్టును పోలీసులు ‘చెప్పుకోదగ్గ పరిణామం’గా అభివర్ణించారు. శనివారం ఉదయం డోవర్ పోర్ట్ ఏరియాలో కెంట్ పోలీసులు ఈ యువకుడ్ని అరెస్టు చేశారు. అతడ్ని స్థానిక పోలీసు స్టేషన్‌లో అరెస్టు చేసిన పోలీసులు ఆ తర్వాత సౌత్ లండన్ పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు.

09/17/2017 - 03:08

బీజింగ్, సెప్టెంబర్ 16: క్షిపణుల పరీక్షలతో రెచ్చిపోతున్న ఉత్తర కొరియాను కట్టడి చేయాలని ప్రపంచ దేశాలన్నీ డిమాండ్ చేస్తుంటే చైనా మాత్రం దానికి భిన్నంగా స్పందించింది. కవ్వింపు చర్యలకు పాల్పడుతుందన్న మిషతో ఉత్తర కొరియాను బెదిరించడం మానుకోవాలని అమెరికా, దాని మిత్రదేశాలకు హితవు చెప్పింది.

09/17/2017 - 03:07

వాషింగ్టన్, సెప్టెంబర్ 16: సింధూ నదీ జలాల ఒప్పందంపై భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన చర్చలు ఎలాంటి అంగీకారం లేకుండానే అర్ధ్ధాంతరంగా ముగిసినట్లు ప్రపంచ బ్యాంక్ తెలిపింది. ఈ ఒప్పందానికి సంబంధించిన సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించడానికి తాము నిష్పక్షపాతంగా ప్రయత్నించడం కొనసాగిస్తామని కూడా ప్రపంచ బ్యాంక్ స్పష్టం చేసింది.

09/17/2017 - 03:03

వాషింగ్టన్, సెప్టెంబర్ 16: ఉత్తర కొరియాను ఎదుర్కొనేందుకు తమ వద్ద అనేక అస్త్రాలున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఉత్తర కొరియా తాటాకు చప్పుళ్లకు అమెరికా, మిత్ర దేశాలు భయపడిపోయే పరిస్థితుల్లో లేవని ఆయన స్పష్టం చేశారు. జపాన్ మీదుగా ఉత్తర కొరియా శుక్రవారం క్షిపణిని పరీక్షించిన నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా స్పందించింది.

09/16/2017 - 02:43

ఐక్యరాజ్య సమితి, సెప్టెంబర్ 15: క్షిపణి పరీక్షలతో అమెరికా సహా పలుదేశాల కంటిమీద కునుకులేకుండా చేస్తున్న ఉత్తర కొరియాపై ఐరాస తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనేక దేశాలు అడ్డుచెబుతున్నా హైడ్రోజన్ బాంబు పరీక్షించిన ఉత్తర కొరియా తాజా క్షిపణి పరీక్షపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ ఘాటుగా స్పందించారు. ఎలాగైనా ఉత్తరకొరియా దూకుడుకు కళ్లెం వేయాలని నిర్ణయించారు.

09/16/2017 - 02:42

లండన్, సెప్టెంబర్ 15: లండన్‌లోని భూగర్భ రైల్లో శుక్రవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. నైరుతి లండన్‌లోని పార్సిన్స్ గ్రీన్ రైల్వే స్టేషన్‌లోకి రైలు ప్రవేశిస్తున్న సమయంలో సంభవించిన ఈ పేలుడులో కనీసం 22 మంది గాయపడినట్లు తెలిపిన స్కాట్లాండ్ యార్డ్ దీన్ని ఉగ్రవాద ఘటనగా పేర్కొంది. ఉదయం పూట రద్దీగా ఉండే సమయంలో పేలుడు సంభవించడంతో కొద్దిపాటి తొక్కిసలాట కూడా సంభవించింది.

Pages