S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

08/24/2017 - 03:34

మాడ్రిడ్: గత వారం స్పెయిన్‌లో భయోత్పాతాన్ని సృష్టించిన ఉగ్రవాద ముఠా దాడులపై దర్యాప్తును పోలీసులు మరింత విస్తృతం చేశారు. మరింత భారీ దాడిలో బార్సిలోనాలోని చారిత్రక ప్రసిద్ధి చెందిన కట్టడాలపై దాడి చేయాలని జిహిదీలు పథకం వేసుకొన్నట్లు ఈ దాడుల్లో పట్టుబడిన అనుమానితుడు కోర్టులో చెప్పడంతో పోలీసులు తమ దర్యాప్తును మరింత విస్తృతం చేశారు.

08/24/2017 - 03:33

వాషింగ్టన్: అమెరికా మీడియాపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. మీడియాలో నిజాయితీ లోపించిందని, లాబీయింగ్ చేయటానికి మాత్రమే మీడియా ఉపయోగపడుతోందని ఆయన బుధవారం ఆరోపించారు. ఇటీవల వర్జీనియాలో తెల్లజాతీయుల ర్యాలీకి మీడియా పెద్దపీట వేయటాన్ని ట్రంప్ తప్పుపట్టారు. మీడియా తప్పుడు సమాచారాన్ని అధికంగా ప్రచారం చేస్తూ అమెరికాలో విభజన తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.

08/24/2017 - 03:31

వాషింగ్టన్: అమెరికా పౌరుల భద్రతకు విఘాతం కలిగిస్తున్న పరిణామాలను అడ్డుకుంటానని, ఇందులో భాగంగా మెక్సికోతో ఉన్న సరిహద్దు పొడవునా గోడ కడతానంటూ డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను వ్యతిరేకించడం ద్వారా డెమోక్రాట్లు మొత్తం అమెరికా ప్రజల భద్రతనే ప్రమాదంలో పడేస్తున్నారని ఆయన అన్నారు.

08/23/2017 - 02:54

సియోల్, ఆగస్టు 22: అమెరికా, దక్షిణ కొరియా దేశాలు ప్రతి ఏటా నిర్వహించే సైనిక విన్యాసాల ప్రారంభంపై ఉత్తర కొరియా తన సహజసిద్ధమైన బెదిరింపు ధోరణితో స్పందించింది. ఈ విన్యాసాలు తమపై దాడి చేయడానికి జరిపే రిహార్సల్స్‌గా అభివర్ణించిన ఉత్తర కొరియా నిర్దయగా వీటిని తిప్పికొడతామని హెచ్చరించింది. సోమవారం ప్రారంభమైన ఈ సైనిక విన్యాసాలు 11 రోజులపాటు సాగనున్నాయి.

08/23/2017 - 02:52

బీజింగ్, ఆగస్టు 22: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్‌కు తాజాగా చేసిన హెచ్చరికలపై చైనా ప్రతిస్పందించింది. పాకిస్తాన్‌కు అనుకూలంగా బలమైన స్వరాన్ని వినిపించింది. ఆఫ్గనిస్తాన్, దక్షిణాసియా విధానాన్ని సోమవారం ప్రకటించిన ట్రంప్ పాకిస్తాన్ ఉగ్రవాద శక్తులకు స్వర్గ్ధామంగా ఉందని పేర్కొన్నారు.

08/23/2017 - 02:51

బెర్లిన్, ఆగస్టు 22: తెల్లారకుండా కాఫీ తాగాలంటే పాల ప్యాకెట్ల కోసమో పాలవాడి కోసమో ఎదురుచూడాల్సిన అవసరం ఎంతమాత్రం ఉండాల్సిన అవసరం లేదంటున్నారు శాస్తవ్రేత్తలు. టీ, కాఫీ డికాక్షన్లలో కరిగిపోయి మధురమైన రీతిలో వాటి అనుభూతిని అందించే పాల క్యాప్సుల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. పంచదార గుళికలను ఏ విధంగా మనం టీ, కాఫీల్లో కలుపుతామో అలాగే ఈ పాల క్యాప్సుల్స్‌ను కూడా వాటిలో కలుపుకోవచ్చని చెబుతున్నారు.

08/23/2017 - 02:51

బీజింగ్, ఆగస్టు 22: భారత్‌పై చైనా మరోసారి విషం చిమ్మింది. బెదింపుల స్థాయిని సైతం పెంచింది. డోక్లామ్ ఉద్రిక్తతపై భారత్ వాదన అర్థం లేనిదని, తమ సైన్యాలు భారత భూభాగంలోకి అడుగుపెడితే అంతా అల్లకల్లోలమే అవుతుందని హెచ్చరించింది. ‘వివాదాస్పద ప్రాంతంలో చైనా రోడ్డు నిర్మిస్తోందన్న మిషతో భారత సైన్యాలు చైనా భూభాగంలోకి ప్రవేశించాయి.

08/23/2017 - 02:21

వాషింగ్టన్, ఆగస్టు 22: ఉగ్రవాద సంస్థల పట్ల పాక్ వ్యవహరిస్తున్న తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

08/22/2017 - 03:25

బీజింగ్, ఆగస్టు 21: లడఖ్‌లోని పాంగాంగ్ సరస్సు వద్ద ఈ నెల 15వ తేదీన భారత్, చైనా సైనిక బలగాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలు, రాళ్ల దాడుల పట్ల చైనా సోమవారం నిరసన వ్యక్తం చేసింది. ఈ ‘హింసాత్మక చర్యల’కు భారత బలగాలే కారణమని చైనా ఆరోపించింది.

08/22/2017 - 02:45

గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ జరగని రోదసీ అద్భుతానికి అమెరికా పరవశించిపోయంది. సోమవారం సంభవించిన సంపూర్ణ సూర్యగ్రహణ దృశ్యాలను వీక్షించేందుకు కోటానుకోట్లుగా జనం తరలివచ్చారు. ఇక్కడ కనిపిస్తున్నది సూర్యుడ్ని దాదాపుగా చంద్రుడు కమ్మేసిన దృశ్యం. వజ్రపుటుంగరంలా ధగధగ మెరుస్తున్న ఉదయ భానుడు.

Pages