S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

09/10/2017 - 02:09

మయామి, సెప్టెంబర్ 9: మొన్న కరేబియన్ దీవులు, తాజాగా క్యూబాలో విధ్వంసం సృష్టించిన భయంకర పెనుతుపాను ‘ఇర్మా’ అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం వైపుగా దూసుకు వస్తుండంతో లక్షలాది మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దాదాపు 56 లక్షల మందిని ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికారులు ఆదేశించారు.

09/09/2017 - 02:22

సియోల్, సెప్టెంబర్ 8: ప్రపంచ దేశాల ఆదేశాలను ధిక్కరిస్తూ తనదైనరీతిలో ముందుకు పోతున్న ఉత్తర కొరియా మరో క్షిపణి పరీక్షకు సిద్ధమవుతోందా? ఉత్తర కొరియా ఆవిర్భవించి శనివారం నాటికి 69 సంవత్సరాలు పూర్తికానున్న సందర్భంగా ఈ పరీక్షను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు భావిస్తున్నారు.

09/09/2017 - 02:19

కాప్-హైతీన్ (హైతీ), సెప్టెంబర్ 8: హార్వీ సృష్టించిన బీభత్సంనుంచి ఇంకా పూర్తిగా కోలుకొని అమెరికాను మరో పెను తుపాను ఇర్మా2 వణికిస్తోంది. అమెరికా దక్షిణ ప్రాంతంలోని ఫ్లోరిడా వైపుగా దూసుకు వస్తున్న ఈ పెను తుపాను ఇప్పటికే కరేబియన్ దీవుల్లో విధ్వంసాన్ని సృష్టించింది.

09/09/2017 - 02:16

మెల్‌బోర్న్, సెప్టెంబర్ 8: గొర్రె మాంసం తినడాన్ని ప్రోత్సహించేందుకు ఆస్ట్రేలియాకు చెందిన మాంసాహారం, లైవ్‌స్టాక్ అసోసియేషన్ (ఎంఎల్‌ఏ) విడుదల చేసిన ఓ అడ్వర్టయిజ్‌మెంట్‌లో హిందువులకు అత్యంత ఇష్టుడైన వినాయకుడిని, ఇతర దేవుళ్లను అవమానించే విధంగా చిత్రీకరించడంపై ఆ దేశంలోని భారతీయులు మండిపడుతున్నారు.

09/09/2017 - 02:16

కొలంబో, సెప్టెంబర్ 8: భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి, అమలు చేస్తున్న ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమం శ్రీలంకను విపరీతంగా ఆకట్టుకుంది. స్వచ్ఛ భారత్‌ను ప్రేరణగా తీసుకుని శుభ్రత కోసం నడుంబిగించింది. పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం, మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీలంక ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. దీని కోసం పరిశోధన, అభివృద్ధి ప్రాంతీయ కేంద్రాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

09/09/2017 - 02:14

ఐరాస, సెప్టెంబర్ 8: కాశ్మీర్‌పై ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టేందుకు పాకిస్తాన్ చేపడుతున్న చర్యలను భారత్ గర్హించింది. జమ్మూకాశ్మీర్ భారత్‌లో అవిభాజ్య భాగమని ఐరాసలో స్పష్టం చేసింది. ఉగ్రవాదమే ప్రభుత్వ విధానంగా పాకిస్తాన్ వ్యవహరిస్తోందంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.

09/08/2017 - 02:51

టొరంటో, సెప్టెంబర్ 7: ప్రతిరోజు కేవలం 25 నిమిషాలు హఠయోగ, ధ్యానం చేస్తే మెదడు పని తీరుతో పాటుగా దాని శక్తి కూడా మెరుగపడుతుందని తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. పావ్చాత్య దేశావాల్లో ఎక్కువ మంది హఠయోగాను ప్రాక్టీస్ చేస్తుంటారు.

09/08/2017 - 02:50

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 7: అత్యధిక స్థాయిల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూరుతున్న 50 దేశాల్లో పాకిస్తాన్ కూడా ఉందని స్విస్‌కు చెందిన ఓ బృందం జరిపిన దర్యాప్తులో వెల్లడైంది. మనీలాండరింగ్, ఉగ్రవాదానికి నిధుల లభ్యత అంశంపై మొత్తం 146 దేశాల పరిస్థితిని బాసెల్ పాలనా సంస్థ ఈ సర్వే నిర్వహించింది.

09/08/2017 - 02:56

వాషింగ్టన్, సెప్టెంబర్ 7: భారత్‌కు ఎఫ్-18, ఎఫ్-16 యుద్ధ విమానాలను విక్రయించాలన్న ప్రతిపాదనను తాము గట్టిగా సమర్థిస్తున్నామని ట్రంప్ ప్రభుత్వం అమెరికా కాంగ్రెస్‌కు తెలియజేసింది. అంతేకాదు ఇది భారత్-అమెరికా రక్షణ సంబంధాలను మరింతగా బలపడడానికి దోహదం చేస్తుందని కూడా స్పష్టం చేసింది.

09/08/2017 - 02:46

యాంగోన్, సెప్టెంబర్ 7: మయన్మార్‌లో తన మూడు రోజుల పర్యటన చివరి రోజయిన గురువారంనాడు ప్రధాని నరేంద్ర మోదీ బిజీ బిజీగా గడిపారు. చివరి మొగల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ సమాధి, 2500 ఏళ్ల నాటి పురాతన ష్వెడగాన్ పగోడాను సందర్శించడంతో పాటుగా కలిబారి ఆలయంలో పూజలు జరిపారు.

Pages