S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

09/08/2017 - 01:33

మారిగట్, సెప్టెంబర్ 7: మొన్నటి హార్వీ హరికేన్ తర్వాత మరోసారి అమెరికాను వణికిస్తున్న మరో పెనుతుపాను ‘ఇర్మా’ ఆ దేశం వైపు దూసుకు వస్తున్న క్రమంలో కరేబియన్ దీవుల్లో భారీ విధ్వంసానే్న సృష్టించింది. కరేబియన్ దీవుల్లోని బార్బుడా, సెయింట్ మార్టిన్ దీవులను సమూలంగా నేలమట్టం చేయడంతో మొన్నటివరకు ఎంతో అందంగా కనిపించిన ఆ దీవులు ఇప్పుడు శిథిలాల గుట్టలుగా మారిపోయాయి.

09/07/2017 - 02:56

నే పీ ట, సెప్టెంబర్ 6: మైన్మార్ ఐక్యతను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృతనిశ్చయంతో పనిచేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ముఖ్యంగా రోహింగ్యా వ్యవహారంలో చెలరేగుతున్న హింసాకాండ పట్ల భారత్ తీవ్ర ఆందోళన చెందుతోందని పేర్కొన్న మోదీ ‘మైన్మార్ ఐక్యత, ప్రాదేశిక సమగ్రత పరిరక్షణకు కృషి చేస్తాం’ అని స్పష్టం చేశారు.

09/07/2017 - 02:22

యాంగాన్, సెప్టెంబర్ 6: భారత ప్రయోజనాల పరిరక్షణకు ఎంతటి కఠిన నిర్ణయాన్నైనా తీసుకునేందుకు వెనుకాడేది లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పెద్దనోట్ల రద్దును గట్టిగా సమర్థించుకున్న ఆయన దేశ హితమే తమ లక్ష్యమని బుధవారంనాడిక్కడ భారత సంతతికి చెందినవారిని ఉద్దేశించి మాట్లాడుతూ అన్నారు.

09/07/2017 - 02:22

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: టెక్నాలజీలో ద్వంద్వ వినియోగం సహా అన్ని రకాలుగానూ రక్షణ సహకారాన్ని పెంపొందించుకోవాలని భారత్, జపాన్ దేశాలు బుధవారంనాడు అంగీకరించాయి. ప్రత్యేక ద్వైపాక్షిక, వ్యూహాత్మక ఒప్పందంలో భాగంగా అన్ని రకాలుగానూ సైనికపరమైన సాన్నిహిత్యాన్ని విస్తృతం చేసుకోవాలని సంకల్పించాయి. జపాన్ రక్షణ మంత్రి ఇత్స్‌నోరీ ఓనెడేరాతో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు.

09/07/2017 - 02:21

సెయింట్స్‌జాన్స్, సెప్టెంబర్ 6: కరేబియన్ దీవులను ఇర్మా హరికేన్ పెనుతీవ్రతతో కుదిపేస్తోంది. బుధవారం ఉదయం సంభవించిన ఈ విలయం తాకిడికి ఆంటిగువా, బార్బుడా దీవుల్లోని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లనుంచి బైటికి పరుగులు పెట్టారు. ఈ వారాంతానికి ఈ పెనుతుపాను ఫ్లోరిడాను చేరుకునే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇర్మా హరికేన్ అన్నది అత్యంత తీవ్రమైన అట్లాంటిక్ మహాసముద్ర తుపాను.

09/06/2017 - 02:44

నే పీ తా, సెప్టెంబర్ 5: భారత్-మైన్మార్‌ల మధ్య శతాబ్దాలుగా కొనసాగుతున్న చారిత్రక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. చైనా పర్యటన ముగించుకుని మంగళవారం మైన్మార్ చేరుకున్న మోదీకి అధ్యక్షుడు తిన్ క్యా ఘనస్వాగతం పలికారు.

09/06/2017 - 02:30

జియామెన్, సెప్టెంబర్ 5: ఉత్తర కొరియాపై దౌత్యపరమైన పరిష్కారం కుదరని పక్షంలో అది ప్రపంచానికే వినాశకారిగా మారుతుందని రష్యా అద్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. అయితే ఉత్తరకొరియాపై మరిన్ని ఆంక్షలు విధించాలన్న అమెరికా డిమాండ్‌వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని కూడా ఆయన అన్నారు. దీంతో ఉత్తర కొరియాను ఎలా అదుపు చేయాలన్న విషయంలో ఈ రెండు అగ్రరాజ్యాల మధ్య విభేదాలు మరింత సుస్పష్టమయ్యాయి.

09/06/2017 - 02:28

జపాన్ పర్యటనకు వెళ్లిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి గౌరవ వందనం సమర్పిస్తున్న ఆ దేశ సైనికులు. చిత్రంలో జపాన్ రక్షణ శాఖ మంత్రి ఇత్సునోరీ ఒనొదేరా. భారత రక్షణ శాఖ మంత్రి హోదాలో జైట్లీ జపాన్ వెళ్లారు.

09/05/2017 - 02:26

జియామెన్, సెప్టెంబర్ 4: బ్రిక్స్ దేశాల ఆర్థిక, సాంకేతిక సహకార ప్రణాళికకు 76 మిలియన్ల అమెరికన్ డాలర్లను అందించేందుకు చైనా ముందుకు వచ్చింది. దీనితోపాటు అభివృద్ధి బ్యాంక్ కొత్త బ్లాక్‌ల ప్రాజెక్టులకోసం మరో నాలుగు మిలియన్ డాలర్లు ఇస్తామని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సోమవారం తెలిపారు. అయిదు దేశాల బ్రిక్స్ సమైక్యంగా ప్రపంచ శాంతి, అభివృద్ధి కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

09/05/2017 - 02:22

వాషింగ్టన్/జియామెన్, సెప్టెంబర్ 4: అణు పరీక్షలతో, ఖండాంతర క్షిపణలు ప్రయోగాలతో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న ఉత్తర కొరియాకు అమెరికా గట్టి హెచ్చరిక చేసింది. తమతో పాటు మిత్రదేశాల జోలికి వస్తే సైనిక చర్య తప్పదంటూ గద్దించింది. అమెరికా విదేశాంగ మంత్రి జైమ్స్ మట్టి ఈ మేరకు ఉత్తర కొరియాను చర్యలపై సోమవారం తీవ్రంగా మండిపడ్డారు.

Pages