S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

09/28/2016 - 08:09

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 27: మైనార్టీ హిందువుల వివాహాలను రిజిస్టర్ చేసుకునే వీలు కల్పిస్తూ పాకిస్తాన్ పార్లమెంట్ ఓ చారిత్రక జాతీయ చట్టాన్ని ఆమోదించింది. హిందువుల కనీస వివాహ వయస్సును 18ఏళ్లుగా నిర్ణయించింది. మిగతా మతాలకు చెందిన వారిలో పురుషులు వివాహం చేసుకోవడానికి కనీస వయస్సు 18కాగా మహిళలకు పదహారు సంవత్సరాలు.

09/28/2016 - 08:08

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 27: పాకిస్తాన్ నేతలు భారత్ వ్యతిరేక ప్రేలాపనలు మానలేదు. వాళ్ల మాటలు ఏ స్థాయికి వెళ్లాయంటే ఉరీలోని ఆర్మీ క్యాంపులో మన జవాన్లపై మనమే దాడి చేయించి చంపుకున్నామనేంతగా వెళ్లింది. ఉరీ ఆర్మీ క్యాంపులో 18మంది జవాన్లను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాద దాడి ఘటన భారత్ తానుగా సృష్టించిదేనని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మంగళవారం అన్నారు.

09/28/2016 - 08:01

అమెరికా అధ్యక్ష ఎన్నికల తొలి ముఖాముఖిలో డెమొక్రటిక్ పార్టీ నామినీ హిల్లరీ హిట్ కొట్టింది. తొట్టతొలి డిబేట్‌లో రిపబ్లికన్ అభ్యర్థిని లక్షలాదిమంది సమక్షంలో చిత్తుచేసింది. నిన్న మొన్నటి వరకూ ఎవరిదారిలో వారు ప్రచారం చేసుకుంటూ వచ్చిన వీరిద్దరూ ఎదురుబదురుగా అనేక జాతీయ అంశాలపై చర్చించారు. ట్రంప్ తనదైన శైలిలో వ్యక్తిగత దాడులకు దిగినా హిల్లరీ

09/27/2016 - 05:17

చారిత్రక 500వ టెస్టు మ్యాచ్‌ని టీమిండియా గెల్చుకుంది. న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇక్కడి గ్రీన్ పార్క్ స్టేడియంలో జరిగిన మొదటి టెస్టును విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత్ 197 పరుగుల భారీ తేడాతో సొంతం చేసుకుంది.

09/27/2016 - 02:42

వాషింగ్టన్, సెప్టెంబర్ 26: సంగీతానికి దేశ, ప్రాంత, భాషాపరమైన ఎల్లలు లేవని లెజండరీ మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా అన్నారు. అమెరికాలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఇళయరాజా సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ‘‘సంగీతానికి ఒక దేశమంటూ లేదు. దానికి సమయం లేదు. మరేమీ ఉండదు. సంగీతం - కేవలం సంగీతం మాత్రమే.’’ అని అన్నారు.

09/27/2016 - 02:03

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 26: జమ్ముకాశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌లోని ఆర్మీ క్యాంపుపై జరిగిన ఉగ్రదాడిపై నిష్పక్షపాతంగా అంతర్జాతీయ విచారణ జరగాలని పాకిస్తాన్ డిమాండ్ చేసింది. ఈ దాడిలో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు పాల్గొన్నారంటూ భారత్ నిరాధార ఆరోపణలు చేస్తోందని పాక్ ప్రధానికి విదేశాంగ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ సోమవారం విమర్శించారు.

09/27/2016 - 00:58

న్యూయార్క్, సెప్టెంబర్ 26: పాకిస్తాన్‌తో శాంతి చర్చలు జరిపేందుకు భారత్ ఎన్నడూ షరతులు పెట్టలేదని భారత్ ఐరాస వేదికపై సభ్య సమాజం ముందు కుండబద్ధలు కొట్టింది. కాశ్మీర్ ఎన్నటికీ భారత్‌లో అంతర్భాగమేనని..దీన్ని చేజిక్కించుకోవాలన్న పాక్ కలలు కల్లలేనని విస్పష్టంగా తెలిపింది.

09/26/2016 - 04:08

బీజింగ్, సెప్టెంబర్ 25: విశ్వంలో జీవుల అనే్వషణకు చైనా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రయత్నాన్ని ప్రారంభించింది. వందలాది వ్యోమగాములు, అంతరిక్ష పరిశోధక విద్యార్థులు, ఆసక్తిపరుల సాక్షిగా అతి పెద్ద టెలిస్కోప్ పరీక్షను ప్రారంభించింది. ఇది అలాంటిలాంటి టెలిస్కోప్ కాదు. 30 ఫుట్‌బాల్ మైదానాల విస్తీర్ణం ఎంత ఉందో.. ఈ టెలిస్కోప్ విస్తీర్ణం అంతది.

09/26/2016 - 00:25

న్యూయార్క్, సెప్టెంబర్ 25: భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఆదివారం న్యూయార్క్ చేరుకున్నారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 71వ సమావేశంలో ప్రసంగించడానికి ఆమె ఇక్కడికి వచ్చారు. సోమవారం మధ్యాహ్నం సుష్మాస్వరాజ్ ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగిస్తారు. భారత్ అంతర్గత అంశమైన కాశ్మీర్‌పై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలకు ఆమె తన ప్రసంగంలో గట్టి సమాధానం ఇస్తారని భావిస్తున్నారు.

09/26/2016 - 00:14

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 25: పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తోందంటూ రెచ్చగొట్టే ప్రకటనలు చేయడంద్వారా భారత ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారని పాకిస్తాన్ ఆరోపించింది. కాశ్మీర్‌నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించడానికి భారత ప్రభుత్వం రూపొందించుకున్న ‘దురుద్దేశపూరితమైన, పకడ్బందీ వ్యూహం’లో భాగమే ఆయన వ్యాఖ్యలని కూడా దుయ్యబట్టింది.

Pages