S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

,
07/17/2016 - 02:34

అసలే ఉగ్రవాదుల వరుస బాంబు దాడులతో రక్తమోడుతున్న టర్కీ.. ఇప్పుడు ఏకంగా సైనిక తిరుగుబాటుకు అల్లల్లాడిపోయింది. ఈ ఏడాది జనవరి నుంచి సగటున నెలకు కనీసం రెండు మానవ బాంబు దాడులతో నిరంతర రుధిరధార పారుతున్న ఈ నాటో కూటమి దేశాన్ని శుక్రవారం రాత్రి అనూహ్యమైన రీతిలో జరిగిన సైనిక తిరుగుబాటుతో రక్తసిక్తం చేసింది.

07/17/2016 - 06:29

న్యూఢిల్లీ, జూలై 16: నైజీరియాలో అపహరణకు గురైన భారతీయులు శ్రీనివాస్, అనీష్‌లను ఉగ్రవాదులు విడుదల చేసినట్లు నైజీరియాలో భారత హైకమిషనర్ బిఎన్ రెడ్డి తెలిపారు. శ్రీనివాస్, అనీష్ శర్మలను ఉగ్రవాదులు శనివారం ఉదయం విడుదల చేసినట్లు బిఎన్‌రెడ్డి ఢిల్లీలోని ఏపి భవన్ రెసిడెంట్ కమిషనర్ అర్జా శ్రీకాంత్‌కు సందేశం పంపించారు.

07/16/2016 - 18:11

ముంబయి: పాకిస్తాన్‌లో యువతులను, బాలికలను హతమార్చడం దారుణమని బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ఆందోళన వ్యక్తం చేసింది. పాక్‌లో వివాదాస్పద మోడల్ ఖండీల్ బలోచ్‌ను ఆమె సోదరుడు గఫూర్ హత్య చేయడంతో ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇకనైనా మేల్కొనాలని సూచించింది. ఆడపిల్లల సంక్షేమానికి భారత ప్రధాని మోదీ అమలు చేస్తున్న ‘బేటీ బచావ్..

07/16/2016 - 18:07

లెబనాన్: ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో ట్రక్కుదాడి జరిపి 84 మంది ప్రాణాలను బలిగొన్నది తామేనని ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని ఉగ్రవాదుల వార్తా సంస్థ అమఖ్ శనివారం ప్రకటించింది. ట్రక్కు డ్రైవర్ తమ సంస్థలో సుశిక్షితుడైన సైనికుడని, తమను అంతం చేస్తామని సంకీర్ణదేశాలు ప్రకటించిన నేపథ్యంలో తాము నీస్‌లో దాడికి పాల్పడ్డామని ఐసిస్ స్పష్టం చేసింది.

07/16/2016 - 17:28

ఢిల్లీ: టర్కీలోని భారతీయులంతా క్షేమంగా ఉన్నారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌కు 1100కి.మీ. దూరంలోని టాబ్జాన్ నగరంలో వల్డ్ స్కూల్ ఛాంపియన్‌షిప్‌ పోటీ పాల్గొనేందుకు 38మంది అధికారులతో కలిసి 148మంది భారతీయ చిన్నారులు టాబ్జాన్ వెళ్లారు. టర్కీలో సైనిక తిరుగుబాటు నేపధ్యంలో టర్కీలో ఉన్న భారతీయుల గురించి ఆందోళన వద్దని సుష్మా అన్నారు.

07/16/2016 - 15:24

అంకారా: టర్కీ సైన్యంలోని ఓ వర్గం తిరుగుబాటు చేయడంతో పోలీసులు, సైనికులకు మధ్య జరిగిన కాల్పుల్లో 190మందికి పైగా మృతిచెందినట్లు టర్కీ తాత్కాలిక ఆర్మీ చీఫ్‌ ఉమిత్‌ దుందర్‌ చెప్పారు. 1,100 మందికి పైగా గాయపడ్డారు. 1,500 మంది సైనికులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. కాల్పుల్లో 41 మంది పోలీసులు, ఇద్దరు సైనికులు, 47 మంది పౌరులు, 104 మంది తిరుగుబాటు దారులు మృతిచెందినట్లు తెలిపారు.

07/16/2016 - 14:27

అబూజా: గతనెల 29న నైజీరియాలో కిడ్నాప్‌కు గురైన మంగిపూడి శ్రీనివాస్, కౌశల్ అనీష్‌శర్మ శనివారం ఉదయం క్షేమంగా విడుదలైనట్లు అక్కడి భారత హైకమిషనర్ కార్యాలయం ప్రకటించింది. వీరిని విడుదల చేయాలంటూ ఇటీవల ఎపి సిఎం చంద్రబాబు భారత హైకమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించడంతో కిడ్నాపర్ల చెర నుంచి శ్రీనివాస్, అనీష్‌లకు విముక్తి లభించింది.

07/16/2016 - 14:27

పారిస్: ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో మారణకాండకు సంబంధించి నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. జనంపైకి భారీ ట్రక్కును నడిపి 84 మంది మృతికి కారకుడైన డ్రైవర్‌ను ట్యునీషియా దేశస్థుడిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో ట్రక్కు డ్రైవర్‌ను పోలీసులు కాల్చిచంపిన సంగతి తెలిసిందే. ఆ డ్రైవర్ మాజీ భార్యను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

07/16/2016 - 14:26

కరాచీ: భారత క్రికెటర్ విరాట్ కోహ్లీని ప్రేమిస్తున్నానంటూ యూ ట్యూబ్‌లో వీడియో పోస్ట్ చేసి గతంలో సంచలనం సృష్టించిన పాక్ వివాదాస్పద మోడల్ ఖండీల్ బలోచ్ శనివారం దారుణహత్యకు గురైంది. సోషల్ మీడియాలో అశ్లీల ఫొటోలు పెట్టి తమ కుటుంబం పరువు తీసిందన్న ఆగ్రహంతో ఆమెను సొంత అనే్న హతమార్చాడని సమాచారం. టి-20 వరల్డ్ కప్‌లో కోహ్లీ ఆటను చూసి బలోచ్ మనసుపారేసుకుంది.

07/16/2016 - 14:22

అంకారా: టర్కీ సైన్యంలోని ఓ వర్గం తిరుగుబాటు చేసిన నేపథ్యంలో ఆ దేశంలో శుక్రవారం రాత్రి నుంచి సామాజిక మీడియాపై పాలకులు ఆంక్షలు విధించారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, యూ ట్యూబ్ వంటి సామాజిక మీడియాపై నిషేధం విధించామని అధికారులు తెలిపారు. అయితే, తమ సేవలకు కొంత అంతరాయం కలిగిందని ట్విట్టర్, యూ ట్యూబ్ ప్రతినిధులు చెబుతున్నారు.

Pages