S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

02/08/2017 - 02:27

కాబూల్, ఫిబ్రవరి 7: ఆఫ్గనిస్తాన్ సుప్రీం కోర్టు వద్ద మంగళవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 19 మంది మరణించారు. మరో 41 మంది గాయపడ్డారు. పనివేళలు పూర్తయిన తరువాత ఇళ్లకు వెళ్లేందుకు కోర్టు సిబ్బంది ప్రాంగణంలో బస్సు ఎక్కుతున్న సమయంలో నడిచివచ్చిన ఆత్మహుతి బాంబర్ విస్ఫోటనం చెందాడు. ఈ సంఘన జరిగిన ప్రదేశానికి సమీపంలోనే అంతర్జాతీయ విమానాశ్రయం, అమెరికా ఎంబసీ కూడా ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

02/08/2017 - 01:59

వాషింగ్టన్, ఫిబ్రవరి 7: ఏడు ముస్లిం దేశాలకు చెందిన వారి ప్రవేశంపై విధించిన నిషేధం విషయంలో రాజీ పడేది లేదని వైట్‌హౌస్ తేల్చిచెప్పిన నేపథ్యంలో ఈ న్యాయ పోరాటంలో అమీ తుమీ తేల్చుకోవడానికి అటు రాష్ట్రాలకు చెందిన అటార్నీలు, ఇటు ఫెడరల్ లాయర్లు సిద్ధమవుతున్నారు. ఈ నిషేధానికి సంబంధించి వస్తున్న కేసుల విషయంలో తాము విజయం సాధించగలమని ధీమాను వైట్‌హౌస్ వ్యక్తం చేసింది.

02/07/2017 - 03:13

కరాచీ, ఫిబ్రవరి 6: అఫ్గాన్‌కు చెందిన ఓ దౌత్యవేత్తను సెక్యురిటీ గార్డే కాల్చి చంపేశాడు. పాక్ పోర్ట్‌సిటీ కరాచీలోని ఆఫ్గనిస్తాన్ కాన్సులేట్ వద్దే ఈ దారుణం చోటుచేసుకుంది. ఆఫ్గనిస్తాన్ దౌత్యాధికారి జాకీ అదు అనే దౌత్యాధికారిని ప్రైవేటు సెక్యురిటీ గార్డు హైతుల్లా ఖాన్ తుపాకీతో కాల్పులు జరిపాడు.

02/07/2017 - 02:03

వాషింగ్టన్, ఫిబ్రవరి 6: ముస్లిం దేశాల పౌరుల పర్యటనలపై తాను విధించిన నిషేధాన్ని నిలిపివేసిన న్యాయ వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్వరంతో మండిపడ్డారు. దేశంలో జరుగకూడనిది ఏదైనా జరిగితే అందుకు అమెరికన్లు తప్పుబట్టాల్సింది తన ఆదేశాలపై స్టే ఇచ్చిన న్యాయమూర్తిని, కోర్టులనేనని స్పష్టం చేశారు.

02/06/2017 - 05:02

వాషింగ్టన్, ఫిబ్రవరి 5: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏడు ముస్లిం దేశాల నుంచి ప్రజలు అమెరికాలో అడుగు పెట్టకుండా విధించిన ఆంక్షలను వెంటనే అమలులోకి వచ్చేలా చూడాలని, ఆ ఆంక్షల అమలును నిలిపివేస్తూ దిగువ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలని కోరుతూ ట్రంప్ పాలనా యంత్రాంగం చేసిన అభ్యర్థనను అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు శనివారం తోసిపుచ్చింది.

02/06/2017 - 04:57

ఇస్లామాబాద్ / న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ఐదేళ్ల పాకిస్తానీ బాలుడిని తల్లి దగ్గరకు చేర్చి మానవత్వాన్ని చాటుకున్నారు భారతీయ అధికారులు. వివరాల్లోకి వెళ్తే, పాకిస్తాన్‌కు చెందిన బాలుడు ఇఫ్తికార్‌ను అతని తండ్రి ఎత్తుకుని దుబాయ్‌కి పారిపోయాడు. ఆ తర్వాత భారత్‌లోని జమ్ముకాశ్మీర్‌కు చేరుకున్నాడు.

02/06/2017 - 04:55

లండన్, ఫిబ్రవరి 5: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముస్లిం దేశాల ప్రజలు ఆ దేశంలోకి ప్రవేశించకుండా విధించిన ఆంక్షలను వ్యతిరేకిస్తూ లండన్‌లో వేలాది మంది ప్రజలు శనివారం వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. ట్రంప్‌ను తమ దేశంలో పర్యటించాల్సిందిగా కోరుతూ పంపించిన ఆహ్వానాన్ని ఉపసంహరించుకోవలసిందిగా వారు బ్రిటన్ ప్రధాని థెరిసా మేను కోరారు.

02/06/2017 - 04:55

ఇస్తాంబుల్, ఫిబ్రవరి 5: టర్కీలో పెచ్చరిల్లుతున్న ఉగ్రవాద దాడులను అడ్డుకునేందుకు ఆ దేశం నడుం బిగించింది. తాజాగా పోలీసులు జరిపిన దాడుల్లో 440 మంది ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిలో 60 మంది ఐసిస్‌కు చెందినవారు కాగా చాలామంది విదేశీయులు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్క సాన్‌లిర్ఫా ప్రావెన్స్‌లోనే దాదాపు 100 మంది ఐసిస్ సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు.

02/06/2017 - 02:34

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 5: పాకిస్తాన్ నిజస్వరూపం మరోసారి బయటపడింది. స్వంత దేశ ప్రజలే ఈ విషయాన్ని ఎండగట్టారు. అమాయక ప్రజలపై పాకిస్తాన్ ప్రభుత్వం, ఐఎస్‌ఐ సాగిస్తున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఇస్లామాబాద్‌లో భారీ ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె) నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

02/06/2017 - 02:33

చికాగో, ఫిబ్రవరి 5: అమెరికాలోకి ప్రవేశంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఆంక్షలను దేశవ్యాప్తంగా, తాత్కాలికంగా నిలిపివేస్తూ సియాటిల్ ఫెడరల్ జడ్జి జేమ్స్ రోబర్ట్ జారీ చేసిన ఆదేశాలు ఆ దేశానికి వెళ్లాలని చూస్తున్న ముస్లిం దేశాల ప్రజలకు ఊరట కలిగించాయి.

Pages