S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

09/11/2016 - 03:02

డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, సెప్టెంబర్ 10: ఉగ్రవాదాన్ని తిప్పికొట్టడానికి ప్రజలంతా సమష్టిగా పోరాడాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా శనివారం ఇక్కడ పిలుపునిచ్చారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నప్పటికీ దాన్ని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఉగ్ర దాడి జరిగి 15 ఏళ్లయిన సందర్భాన్ని పురస్కరించుకుని రేడియో, ఆన్‌లైన్ ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.

09/11/2016 - 02:52

ఐక్యరాజ్య సమితి, సెప్టెంబర్ 10: తాజాగా అణు పరీక్షలు నిర్వహించినందుకు ఉత్తర కొరియాపై మరిన్ని కొత్త ఆంక్షలు విధించనున్నట్లు ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలి హెచ్చరించింది. ఉత్తర కొరియా తాజాగా అయిదోసారి అణు పరీక్షలు నిర్వహించడాన్ని మండలి తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ శాంతి, భద్రతలకు ఈ పరీక్షలు ముప్పని పేర్కొంది.

09/11/2016 - 02:24

ఢాకా, సెప్టెంబర్ 10: బంగ్లాదేశ్‌లోని ఓ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించి 26మంది చనిపోయారు. 74మంది కాలిన గాయాలతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

09/10/2016 - 17:09

ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకా ఇండస్ట్రియల్ ఏరియా తాంగిలో శనివారం ఉదయం 6.15 ప్రాంతంలో ఓ ప్యాకేజింగ్ ఫ్యాక్టరీలో భారీ పేలుడుకు 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. నాలుగంతస్తుల భవనంలో ఈ పేలుడు జరగడంతో భవంతిలోని కొంతభాగం కుప్పకూలింది. 20కి పైగా అగ్నిమాపక శకటాలు దింపిన సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

09/10/2016 - 12:07

ఢాకా: బంగ్లాదేశ్‌లోని గజిపూర్‌ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున టెంపకో ప్యాకేజింగ్‌ ఫ్యాక్టరీలో భారీ పేలుడు జరగడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు ఢాకా మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పలువురు కార్మికులకు తీవ్ర గాయాలవ్వడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

09/10/2016 - 11:43

బాగ్దాద్‌: సెంట్రల్‌ బాగ్దాద్‌లోని ఓ షాపింగ్‌ మాల్‌ వద్ద శుక్రవారం అర్థరాత్రి రెండు కారు బాంబులు పేలడంతో పది మంది ప్రాణాలు కోల్పోయారు. 28 మంది గాయాలపాలైనట్లు పోలీసులు వెల్లడించారు. త్వరలో బక్రీద్‌ ఉండడం, వారాంతం కావడంతో షాపింగ్‌ మాల్‌ అర్థరాత్రి కూడా తెరిచే ఉందని పోలీసులు చెప్పారు.

09/10/2016 - 07:57

సియోల్, సెప్టెంబర్ 9: అతిపెద్ద అణు పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు ఉత్తర కొరియా ప్రకటించుకుంది. ఒక నూక్లియర్ వార్‌హెడ్‌ను విజయవంతంగా పరీక్షించినట్లు ఉత్తర కొరియా ప్రభు త్వం ధ్రువీకరించింది. ఉత్తర కొ రియా తాజాగా మరో అణు పరీక్ష నిర్వహించినట్లు దక్షిణ కొరియా మీడియాలో కథనాలు రాగా ఉత్తర కొరియా ప్రభుత్వం వాటిని ధ్రువీకరించింది.

09/09/2016 - 02:39

సూళ్లూరుపేట, సెప్టెంబర్ 8: వరుస రాకెట్ విజయాలతో భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్ ) ప్రపంచ దేశాలలోనే మంచి గుర్తింపు సంపాదించుకొంది. ఇక్కడి నుండి ప్రయోగించే ప్రతి రాకెట్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసింది కావడం ఒకటైతే వినూత్న ప్రయోగాలు చేపట్టి మన శాస్తవ్రేత్తలు ప్రపంచ దేశాలకు దీటుగా నిలుస్తున్నారు.

09/09/2016 - 02:31

వియంటియానె, సెప్టెంబర్ 8: ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో సమావేశమై పౌర అణు సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, వాతావరణ మార్పు సహా ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యంలో తక్షణ ప్రాధాన్యత అంశాలపై చర్చలు జరిపారు. తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ఈ ఇరువురు నాయకులు లావోస్ రాజధాని వియంటియానెలో సమావేశమయ్యారు.

09/09/2016 - 00:56

లండన్, సెప్టెంబర్ 8: నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945లో విమాన ప్రమాదంలోనే మరణించారని జపాన్ ప్రభుత్వం ధ్రువీకరించినట్లు బ్రిటన్‌కు చెందిన ఒక వెబ్‌సైట్ వెల్లడించింది. ఇందుకు సంబంధించి అమెరికాకు జపాన్ 1945లో ఇచ్చిన నివేదిక మధ్యంతర నివేదిక అని, తుది నివేదికను 1956లో భారత ప్రభుత్వానికి అందించారని బోస్‌ఫైల్స్.ఇన్ఫో పేర్కొంది.

Pages