S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

08/11/2017 - 02:48

కరాచి, ఆగస్టు 10: పాకిస్తాన్ ‘మదర్ థెరిస్సా’గా పేరుగాంచిన డాక్టర్ రూత్ ఫా కరాచీలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో గురువారం కన్నుమూశారు. 87ఏళ్ల ఫా వయస్సు పైబడడంతో వచ్చే అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్నారు. డాక్టర్ ఫా 1960లో తొలిసారిగా కరాచీలో కాలుపెట్టారు. అక్కడ కుష్ఠువ్యాధితో బాధపడుతున్నవారికి చూసి వారికి సేవలు చేసేందుకు తన జీవితాన్ని అంకితం చేశారు.

08/11/2017 - 02:37

బీజింగ్, ఆగస్టు 10: డోక్లామ్ ప్రతిష్టంభన విషయంలో చైనా ఎలాంటి రాజీ పడబోదని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఏ)కి చెందిన విశే్లషకులు స్పష్టం చేశారు. అంతేకాదు డోక్లామ్ చైనా భూభాగమని, తమ భూభాగంలోకి సైన్యాలను పంపడం ద్వారా భారత ప్రభుత్వం చైనా కృతనిశ్చయాన్ని తప్పుగా అంచనా వేసిందని చైనాలో పర్యటిస్తున్న భారత పత్రికా ప్రతినిధుల బృందంతో మాట్లాడిన వారు అన్నారు.

08/11/2017 - 02:06

సియోల్, ఆగస్టు 10: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికల నేపథ్యంలో ఉత్తర కొరియా మరింతగా రెచ్చిపోతోంది. అమెరికా తన సైన్యాన్ని మోహరించిన గువామ్ దీవిపై దాడికి కసరత్తు మొదలు పెట్టింది. రానున్న వారంలోనే ఈ సైనిక స్థావరంపై దాడులు జరుపుతామన్న సంకేతాలూ అందించింది.

08/10/2017 - 02:25

వాష్టింగ్టన్, ఆగస్టు 9: ఉత్తర కొరియా హెచ్చరికలపై అమెరికా నిప్పులు చెరిగింది. అమెరికా వ్యూహాత్మక సైనిక స్థావరాలపై దాడులు చేస్తామంటూ ఉత్తర కొరియా హెచ్చరించిన నేపథ్యంలో ఏకంగా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. అదే జరిగితే తమ ప్రతిస్పందన అత్యంత భీకరంగా ఉంటుందని తీవ్ర పదజాలంతో హెచ్చరించారు.

08/10/2017 - 02:23

బీజింగ్, ఆగస్టు 8: భారత్ చైనాల మధ్య రగులుతున్న డొక్లాం ప్రతిష్ఠంభన రోజురోజుకు శ్రుతి మించుతోంది. తాజాగా దీనిపై స్పందించిన చైనా పత్రిక భారత్ - చైనాల మధ్య సైనిక సంఘర్షణలకు కౌంట్‌డౌన్ మొదలైందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని భారత్ వ్యవహరించటం మంచిదంటూ చైనా అధికార పత్రిక చైనా డెయిలీ తన సంపాదకీయంలో హెచ్చరించింది.

08/09/2017 - 03:05

బీజింగ్, ఆగస్టు 8: డోక్లామ్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా హెచ్చరికలను బేఖాతరు చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆ దేశ మీడియా హెచ్చరించింది. చైనా అధికార మీడియా అయిన గ్లోబల్ టైమ్స్‌లో భారత్‌ను రెచ్చగొట్టే వ్యాసం రాసింది. గత రెండు నెలలుగా భారత్‌ను కించపరుస్తూ, భారత శక్తిని తక్కువ చేస్తూ, రెచ్చగొట్టేవిధంగా పలు వ్యాసాలు రాసిన గ్లోబల్‌టైమ్స్ సోమవారం మరో వ్యాసం రాసింది.

08/09/2017 - 03:05

వాషింగ్టన్, ఆగస్టు 8: హెచ్1బి వీసాల నిబంధనల్లో మార్పులు అమెరికా ఐటి రంగంపై ప్రతికూలంగా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు విశే్లషిస్తున్నారు. మూడేళ్ల తాత్కాలిక వర్క్ పర్మిట్‌కు అనుమతించే హెచ్1బి వీసాలకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయిన తరువాత నిబంధనలు కఠినతరం చేసిన సంగతి తెలిసిందే.

08/09/2017 - 02:39

బీజింగ్, ఆగస్టు 8: చైనాలోని సిచువాన్ రాష్ట్రంలో మంగళవారం రాత్రి సంభవించిన భారీ భూకంపంలో వంద మందికి పైగా చనిపోగా, వేలాది మంది గాయపడినట్లు తెలుస్తోంది. రిక్టర్ స్కేలుపై 6.5 పాయింట్ల తీవ్రత ఉన్న ఈ భూకంపం స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 9.20 గంటల సమయంలో సంభవించింది.

08/08/2017 - 00:44

మనీలా, ఆగస్టు 7: తమ అణు కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి చర్చలూ జరిపే ప్రసక్తి లేదని ఉత్తర కొరియా తెగేసి చెప్పింది. ఐక్య రాజ్య సమితి విస్తృతస్థాయిలో ఆంక్షలు విధించిన నేపథ్యంలో మరింతగా రెచ్చిపోయిన ఉత్తర కొరియా అమెరికాకు గట్టిగా బుద్ధిచెబుతామని హెచ్చరిక స్వరాన్ని వినిపించింది.

08/08/2017 - 00:36

హువాయిరౌ (చైనా), ఆగస్టు 7: డోక్లాం వివాదాన్ని చైనా మరింత రగిలించింది. తాజాగా నేరుగానే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఏ) ఈ వివాదంపై స్పందించింది. గత కొన్ని వారాలుగా తమ భూభాగంలో మోహరించిన భారత దళాలు తక్షణమే తప్పుకోకపోతే సంఘర్షణ తప్పదంటూ పిఎల్‌ఏకు చెందిన సీనియర్ కల్నల్ లీలీ హెచ్చరించారు.

Pages