S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

10/23/2016 - 02:23

మాస్కో, అక్టోబర్ 22: రష్యాలో ఓ హెలికాప్టర్ కూలిపోయిన దుర్ఘటనలో 19 మంది మరణించారు. సైబీరియన్ రీజియన్‌లోని క్రాస్నోయార్క్స్ నుంచి నోవి ఉరెంగాయ్ నగరానికి 22 మందితో ఎంఐ-8 హెలికాప్టర్ వెళుతుండగా గత రాత్రి ప్రమాదం జరిగినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. ఈ హెలికాప్టర్ ప్రయాణిస్తూ ఉరెంగాయ్‌కు దాదాపు 80 కి.మీ దూరంలో నెట్‌వర్క్‌తో సంబంధాలు తెగిపోయాయి.

10/23/2016 - 02:14

వాషింగ్టన్, అక్టోబర్ 22: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గెలిస్తే మరో నాలుగేళ్ల పాటు బరాక్ ఒబామా పాలన కొనసాగినట్టేనని, ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థ విస్తరిస్తుందని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.

10/22/2016 - 06:56

వాషింగ్టన్, అక్టోబర్ 21: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తమ ఎన్నికల వ్యయాన్నీ బాగా పెంచుతున్నారు. వివాదాస్పద వ్యాఖ్యల ఫలితంగా స్వంత పార్టీలోనే మద్దతు పడిపోతున్న నేపథ్యంలో ట్రంప్ ఆగస్టు నెలలో చేసిన వ్యయంతో పోలిస్తే సెప్టెంబర్ నెలలో రెండింతలకు పైగా ఖర్చు చేశారు.

10/22/2016 - 06:56

వాషింగ్టన్: అమెరికా ఎన్నికల ప్రక్రియలోని నిజాయితీని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సందేహించడం ప్రమాదకరమని, దేశ ప్రజాస్వామ్యాన్ని కించపరచడమేనని అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు.

10/21/2016 - 02:56

లాస్ వెగాస్, అక్టోబర్ 20: అమెరికా అద్యక్ష ఎన్నికల్లో ఒక వేళ తాను ఓడినా ఓటమిని అంగీకరించేది లేదని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సంకేతాలిచ్చారు. ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని ఆరోపించారు. అంతే కాదు, అధికార మార్పిడి కోసం అమెరికన్ డెమొక్రాటిక్ కనె్వన్షన్‌ను సాఫీగా జరగనివ్వకుండా చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు.

10/21/2016 - 02:26

లాస్‌వెగాస్, అక్టోబర్ 20: మరో మూడు వారాల్లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అత్యంత కీలకం, చివరిదైన మూడో ముఖాముఖిలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై డెమొక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ విజయం సాధించారు. సిఎన్‌ఎన్ నిర్వహించిన తాజా పోల్‌లో ట్రంప్ కంటే 13శాతం అధికంగా మద్దతు సంపాదించినట్లు సదరు వార్తా సంస్థ గురువారం వెల్లడించింది.

10/21/2016 - 02:21

ఇస్లామాబాద్, అక్టోబర్ 20: సింధూ జలాల ఒప్పందాన్ని ఏ విధంగా ఉల్లంఘించినప్పటికీ, తాము సరైన రీతిలో చర్య తీసుకుంటామని భారత్‌ను పాకిస్తాన్ హెచ్చరించింది.

10/20/2016 - 07:33

వాషింగ్టన్, అక్టోబర్ 19: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిని హిల్లరీ క్లింటన్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆమె ప్రత్యర్థి, రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కంటే ఆరు పాయింట్ల ముందంజలో ఉన్నారు. అధ్యక్ష ఎన్నికలు మరో మూడు వారాలు ఉండగా తాజాగా ఫాక్స్ న్యూస్ పోల్‌లో హిల్లరీ ప్రత్యర్థికంటే ముందుకు దూసుకుపోతున్నారు. గత వారం సర్వేలో ట్రంప్ కంటే హిల్లరీ ఏడు పాయింట్ల ముందంజలో ఉండేవారు.

10/20/2016 - 07:32

దుబాయ్, అక్టోబర్ 19: తాను వలచింది రంభ... తాను మునిగింది గంగ - ఇది తెలుగు సామెతే అయినా, ఈ నవ అరబ్ జంటకు అక్షరాలా అతికిపోతుంది. తాను పెళ్లాడింది అప్సరస అనుకున్నాడు, ఆమె అందాల్ని చూసి మైమరచిపోయి వివాహమాడాడు. తీరా పెళ్లయిన తర్వాత తొలిసారిగా ఆమె అందాన్ని చూసి ఖిన్నుడయ్యాడు. స్విమ్మింగ్ పూల్‌లో దిగి బయటకొచ్చిన తర్వాత గానీ ఆమె అసలు రూపం బయటపడలేదు. అంతే, విడాకులు కోరాడు.

10/20/2016 - 07:28

రియాద్, అక్టోబర్ 19: సౌదీ చరిత్రలో ఓ అరుదైన ఉరిశిక్ష అమలుచేశారు. ఒక వ్యక్తి మృతికి కారణమైన సౌదీ రాజ కుటుంబానికి చెందిన ఓ యువరాజుకే ఏకంగా మరణశిక్ష అమలు చేశారు. సౌదీ యువరాజు తుర్కీ బిన్ సౌద్ అల్ అబీర్‌ను బుధవారం ఉరితీసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. 2012 డిసెంబర్‌లో రియాద్‌లోని డిజెర్ట్ క్యాంపులో జరిగిన ఘర్షణ సందర్భంగా యువరాజు అబీర్ కాల్పులు జరిపాడు.

Pages