S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

07/31/2017 - 02:09

కాన్‌స్టాంగ్జ్(జర్మనీ), జూలై 30: దక్షిణ జర్మనీలోని ఓ నైట్‌క్లబ్‌పై ఇరాక్‌కు చెందిన ఓ సాయుధ వ్యక్తి విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరంచారు. ఎం-16 ఆటోమేటిక్ రైఫిల్‌తో క్లబ్‌లోకి ప్రవేశించిన ఈ వ్యక్తి ఓ చిన్న తగాదా తలెత్తడంతో కాల్పులకు ఒడిగట్టాడు. ఆ కాల్పుల్లోనే ఇద్దరు వ్యక్తులు మరణించారు. వెంటనే రంగంలోకి ప్రవేశించిన పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు.

07/30/2017 - 05:32

వాషింగ్టన్, జూలై 29: అమెరికాసహా పలు దేశాలు చేస్తున్న హెచ్చరికలు ఉత్తర కొరియాను ఏమీ భయపెట్టలేకపోతున్నాయి. శుక్రవారం రాత్రి ఆ దేశం మరో ఖండాంతర క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. నెల రోజుల్లో ఈ రకంగా ఖండాంతర క్షిపణిని ఉత్తర కొరియా ప్రయోగించటం ఇది రెండోసారి.

07/30/2017 - 05:29

వాషింగ్టన్, జూలై 29: రష్యాతోపాటు ఇరాన్, ఉత్తర కొరియాపై కఠినమైన ఆంక్షలు విధిస్తూ ఈ వారం అమెరికా పార్లమెంట్ ఆమోదించిన చట్టంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో సంతకం చేయాలని యోచిస్తున్నారు. అమెరికా అధ్యక్ష భవనం (వైట్ హౌస్) శనివారం ఈ విషయాన్ని వెల్లడించింది. అమెరికా పార్లమెంట్ ఆమోదిస్తే తప్ప రష్యాపై ఆంక్షలను రద్దు చేసేందుకు లేదా సడలించేందుకు వీలులేకుండా ట్రంప్‌ను ఈ చట్టం నిరోధిస్తోంది.

07/30/2017 - 05:25

వాషింగ్టన్, జూలై 29: తాలిబన్, హక్కానీ గ్రూపు సహా ఉగ్రవాద ముఠాలకు మద్దతు అందించడాన్ని పాకిస్తాన్ కొనసాగించిన పక్షంలో దానిపై క్రమక్రమంగా దౌత్య, సైనిక, ఆర్థికపరమైన ఆంక్షలను విధించడానికి ఉద్దేశించిన చట్ట సవరణను అమెరికా సెనేటర్ జాన్ మెక్‌కెయిన్ సెనేట్‌లో ప్రతిపాదించారు. మెక్‌కెయిన్ సెనేట్‌లో అత్యంత శక్తివంతమయిన ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీకి చైర్మన్.

07/30/2017 - 05:24

గ్రేనోబుల్(ఫ్రాన్స్), జూలై 29: ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మానవ శరీర భాగాలు ఫ్రాన్స్‌లోని వౌంట్ ఆల్ప్స్‌పై కనుగొన్నారు. డేనియల్ రోచే అనే వ్యక్తి వీటిని కనుగొని అధికారులు సమాచారం అందించాడు. విమాన ప్రమాదాల్లో శకలాలు సేకరించడం డేనియల్‌కు ఇష్టం. ఇందులో భాగంగానే ఆల్ప్స్ పర్వతాలపై అనే్వషిస్తుండగా మానవ శరీర భాగాలు కనిపించాయి.

07/30/2017 - 02:29

స్విట్జర్లాండ్‌లోని రెండు కొండల మధ్య వేలాడే అతి పెద్ద బ్రిడ్జి ఇది. 494 మీటర్ల పొడవైన దీనిని శనివారం ప్రారంభించారు

07/30/2017 - 02:15

న్యూయార్క్, జూలై 29: ఉగ్రవాదాన్ని కొన్ని దేశాలు ఓ సాధనంగా వాడుకుంటున్నాయని, ఇది అత్యంత ప్రమాదకరమైన అంశమని భారత్ ప్రపంచానికి హెచ్చరించింది.

07/30/2017 - 01:49

ఇస్లామాబాద్, జూలై 29: పాకిస్తాన్‌లోని పిఎంఎల్-ఎన్ ప్రభుత్వానికి ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పెట్రోలియం శాఖ మాజీ మంత్రి షాహిద్ ఖకన్ అబ్బాసీ తాత్కాలిక ప్రధాన మంత్రిగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. నవాజ్ షరీఫ్ సోదరుడు షెహబాజ్ షరీఫ్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యే వరకు పిఎంఎల్-ఎన్ ప్రభుత్వాన్ని అబ్బాసీ నడుపుతారని పాకిస్తాన్ మీడియా కథనాలను బట్టి స్పష్టమవుతోంది.

07/29/2017 - 02:12

మాస్కో, జూలై 28: అమెరికా తనపై తాజాగా ఆంక్షలు విధించడానికి ప్రతీకారంగా నెల రోజుల్లోపల తమ దేశంలో ఉన్న అమెరికా దౌత్యవేత్తల్లో కొందరు దేశం వదిలిపెట్టి వెళ్లాలని, అమెరికా దౌత్య కార్యాలయాలకు చెందిన కొన్ని ఆస్తులను స్వాధీనం చేసుకోబోతున్నామని రష్యా శుక్రవారం అమెరికాకు అల్టిమేటం ఇచ్చింది.

07/29/2017 - 02:11

ఇస్లామాబాద్, జూలై 28: పాకిస్తాన్ సుప్రీం కోర్టు తీర్పుతో ఉద్వాసనకు గురైన నవాజ్ షరీఫ్, మూడోసారీ అసంపూర్ణ ప్రధానిగా మిగిలిపోయారు. పాక్‌లో రాజకీయ అస్థిరత తలెత్తిన ప్రతిసారీ అవకాశాన్ని అందిపుచ్చుకుని ప్రధాని పదవి అందుకుంటూ వచ్చిన షరీఫ్, తరువాతి పరిణామాల్లో ఉద్వాసనల నుంచి తప్పించుకోలేక పోవడం గమనార్హం. ఉక్కు టైకూన్‌గా రాజకీయ జీవితం ప్రారంభించిన షరీఫ్ తొలిసారి 1990లో ప్రధాని పదవి అధిష్టించారు.

Pages