S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

07/18/2017 - 02:05

ఇస్లామాబాద్, జూలై 17: పనామా పత్రాల కుంభకోణంలో పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్, ఆయన కుటుంబ సభ్యుల అవినీతి బాగోతంపై ఆ దేశ సుప్రీం కోర్టు సోమవారం మళ్లీ విచారణ ప్రారంభించింది. ఈ వ్యవహారంలో నవాజ్ షరీఫ్‌తో పాటు ఆయన కుమారులపై అవినీతి కేసు నమోదు చేయాలని సంయుక్త దర్యాప్తు బృందం (జెఐటి) సిఫారసు చేసిన వారం రోజుల తర్వాత సుప్రీం కోర్టు ఈ విచారణ చేపట్టింది.

07/18/2017 - 02:02

బీజింగ్, జూలై 17: టిబెట్‌లో చైనా తమ అత్యాధునిక ఆయుధాలతో (లైవ్-ఫైర్ డ్రిల్) ప్రదర్శనను నిర్వహించింది. 11గంటల పాటు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఏ) టిబెట్ అటానమస్ ప్రాంతంలో లైవ్-ఫైర్ డ్రిల్‌ను నిర్వహించినట్లు చైనా అధికారిక న్యూస్ చానల్ చైనాసెంట్రల్ టెలివిజన్ (సిసిటివి) పేర్కొంది. అయితే ఎప్పుడు, ఎన్ని గంటలకు నిర్వహించిందో మాత్రం వెల్లడించలేదు.

07/18/2017 - 02:01

పెషావర్, జూలై 17: పాకిస్తాన్‌లో తాలిబన్ ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. వాయువ్య ప్రాంతంలో పారా మిలటరీ సిబ్బందిని తీసుకెళ్తున్న వాహనంపై సోమవారం ఒక ఆత్మాహుతి బాంబర్ దాడికి తెగబడి సైనిక అధికారి సహా ఇద్దరి ప్రాణాలను బలితీసుకున్నాడు. ఈ దాడిలో మరో పది మంది గాయపడ్డారు.

07/18/2017 - 02:00

యవాండే, జూలై 17: కామెరూన్ నైరుతి తీరంలో ఆదివారం సైనిక బోటు నీట మునగడంతో అందులో ప్రయాణిస్తున్న 34 మంది సైనికులు గల్లంతయ్యారు. సిబ్బంది సహా మొత్తం 37 మందిని తీసుకెళ్తున్న ఈ బోటు ఇంధనాన్ని నింపుకునేందుకు ఆదివారం ఉదయం బకాస్సీ నగరానికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగిందని రక్షణ శాఖ మంత్రి జోసఫ్ బెటి అసోమో ఒక ప్రకటనలో వెల్లడించారు.

07/17/2017 - 02:13

పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఆదివారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతున్న యునైటెడ్ జీహాదీ కౌన్సిల్ అధినేత సయ్యద్ సలాహుద్దీన్. ఇటీవల అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయ టెర్రరిస్టుగా ప్రకటించించి ఈయననే.

07/17/2017 - 02:11

ఇస్లామాబాద్, జూలై 16: లండన్‌లో పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆస్తులపై దర్యాప్తు జరుపుతున్న సంయుక్త దర్యాప్తు బృందం ఆయనపై 15 కేసులను తిరగదోడాలని సిఫారసు చేసినట్లు ఆదివారం ఒక వార్తా కథనం వెల్లడించింది. పనామా పత్రాల లీకేజీ కుంభకోణం వెలుగులోకి వచ్చిన అనంతరం పాక్ సంయుక్త దర్యాప్తు బృందం ఈ అంశంపై దృష్టి సారించిన విషయం విదితమే.

07/17/2017 - 02:08

బీజింగ్, జూలై 16: చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 22 మంది మృతి చెందారు. ఛాంగ్‌షులోని యుషాన్ నగరంలో తెల్లవారు జామున 4.30 గంటలకు అందరూ గాఢనిద్రలో ఉండగా రెండస్థుల నివాస భవనంలో అగ్ని ప్రమాదం సంభవించినట్లు జిన్హువా న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఈ ప్రమాదంలో 22 మంది మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

07/16/2017 - 03:20

లాహోర్, జూలై 15: కుల్‌భూషణ్ జాధవ్ తల్లి పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించి ఆమెకు వీసాను మంజూరు చేయాలని, ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ సంబంధాల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇది చక్కటి అవకాశంగా ఉపయోగపడుతుందని పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ దినపత్రిక శనివారం ఉద్ఘాటించింది.

07/16/2017 - 01:37

వాషింగ్టన్, జూలై 15: ఓ వైపు భారత్‌తో రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటూనే మరోవైపు పాకిస్తాన్‌కు చేసే రక్షణ సాయం విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని అమెరికా నిర్ణయించింది. ఈ మేరకు ఈ ఏడాది రక్షణ బడ్జెట్‌కు సంబంధించిన జాతీయ భద్రతా అధీకృత చట్టం (ఎన్‌డిఏఏ) 2018కు తీసుకు వచ్చిన సవరణలను శుక్రవారం అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది.

07/15/2017 - 02:06

పారిస్, జూలై 14: తమ రెండు దేశాల ప్రగాఢ సంబంధాలకు గుర్తుగా శుక్రవారం ఫ్రాన్స్ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగిన మిలిటరీ పెరేడ్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మేక్రాన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలిసి పాల్గొన్నారు. చాంప్-ఎలిసీస్‌లో అట్టహాసంగా జరిగిన ఈ మిలటరీ పెరేడ్‌కు ఇరువురు నేతలు తమ సతీమణులతో కలిసి విచ్చేశారు.

Pages