S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

07/08/2017 - 02:12

హాంబర్గ్, జూలై 7: అమెరికా, రష్యాలు మరింత సన్నిహితంగా పనిచేయడానికి అన్నివిధాలా అనుకూల పరిస్థితులు ఉన్నాయని అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ అన్నారు. జి-20 శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఆయన సమావేశమయ్యారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగినప్పటినుంచి చెలరేగిన వివాదాల నేపథ్యంలో ఇరు దేశాల అధ్యక్షులు కలుసుకోవడం ఇదే మొదటిసారి.

07/08/2017 - 02:10

హాంబర్గ్, జూలై 7: జి-20 పారిశ్రామిక దేశాల శిఖరాగ్ర సదస్సుకు నిరసనగా శుక్రవారం జర్మనీ పట్టణమైన హాంబర్గ్‌లో నిరసనలు వెల్లువెత్తాయి. ఒక దశలో విధ్వంసకాండకు దారితీశాయి. మొత్తం హాంబర్గ్ పట్టణమంతా కూడా నిరసనకారుల ఆందోళనలతో స్తంభించిపోయింది. పట్టణంలో నివసిస్తున్న ఎవరూ కూడా బయటకు రాలేని పరిస్థితి తలెత్తింది. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు నీటిగోళాలను ప్రయోగించారు.

07/08/2017 - 02:02

వాషింగ్టన్, జూలై 7: ప్రపంచంలోనే అత్యంత పెద్దవైన రెండు ప్రజాస్వామ్య దేశాలను అనుసంధానిస్తూ భారత రాజధాని న్యూఢిల్లీ నుంచి అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసికి తొలిసారి నేరుగా ప్రారంభించిన ఎయిండియా విమాన సర్వీసు (ఎఐ-103) డల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది.

07/08/2017 - 01:10

హంబర్గ్, జూలై 7: ప్రపంచ శాంతిని కబళిస్తున్న ఉగ్రవాదంపై జి-20 దేశాలు ఉక్కుపిడికిలి బిగించాలని భారత ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. శుక్రవారం నాడిక్కడ జి-20 సదస్సులో మాట్లాడిన మోదీ లష్కరే తొయిబా, జైషే మహ్మద్‌లను ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐసిఎస్, అల్ ఖైదాలతో పోల్చారు. ఈ తీవ్రవాద సంస్థలు పేర్లు వేరైనా వీటి సిద్ధాంతం ఒక్కటేనని, దాన్ని ఉమ్మడి శక్తులతో మట్టుబెట్టాలని ఉద్ఘాటించారు.

07/07/2017 - 01:46

టెల్ అవీవ్, జూలై 6: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్‌లో జరిపిన పర్యటన ఇక్కడ భారతీయుల్లో ఎనలేని ఆనందాన్ని కలిగించింది. తాము అనుకున్నదానికంటే ఎక్కువగానే నరేంద్ర మోదీ తమ ఇబ్బందుల గురించి తెలుసుకున్నారని, వాటిలో కొన్నింటిని పరిష్కరించారంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా యూదుల్లో ఈ ఆనందం మరింతగా కనిపించింది. భారత్‌లోనే తమ మూలాలు ఉన్నందుకు ఎంతగానో గర్విస్తున్నామని ఇక్కడ భారతీయులు అంటున్నారు.

07/07/2017 - 01:44

హాంబర్గ్, జూలై 6: ఉగ్రవాదంపై పోరాటం, వాతావరణ మార్పు, ప్రపంచ వాణిజ్యం.. నేటినుంచి జర్మనీలో ప్రారంభం కానున్న జి-20 సదస్సులో ప్రధాన అజెండా కానున్నాయి. ప్రపంచ అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల సముదాయం రెండు రోజులపాటు హాంబర్గ్‌లో జి-20 సదస్సులో భాగస్వామ్యం కానుంది. భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ సదస్సులో భారత్‌కు ప్రతినిధ్యం వహిస్తున్నారు.

07/07/2017 - 01:42

హైఫా, జూలై 6: ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన భారతీయ సైనికులకు శ్రద్ధాంజలి ఘటించారు. హైఫా నగరంలోని ఇండియన్ సిమ్మెట్రీని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమీన్ నెతనాహ్యూతో కలిసి మోదీ సందర్శించారు. మోదీ ఆఖరి రోజు పర్యటనలో భారత అమరజవాన్లకు ఘన నివాళులర్పించారు.

07/07/2017 - 01:35

వార్సా, జూలై 6: ఉత్తర కొరియా సైనికపరంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతుండడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉత్తర కొరియా దుందుడుకు చర్యలకు తీవ్ర పరిణామాలు ఉంటాయనే విషయాన్ని అది గ్రహించేలా చేయాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. అంతేకాదు, ఉత్తరకొరియా చర్యలకు తీవ్రస్తాయిలో స్పందించే విషయాన్ని తాను పరిశీలిస్తున్నట్లు కూడా ఆయన హెచ్చరించారు.

07/07/2017 - 01:33

న్యూయార్క్, జూలై 6: భారత్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి దిశగా దూసుకుపోతోంది. భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక గమనానికి చుక్కానిలా నిలుస్తుందని హార్వార్డ్ యూనివర్సిటీ అధ్యయన బృందం తాజా నివేదికలో పేర్కొంది. ప్రపంచ దేశాలన్నీ మందగమనంలో ఉంటే భారత్, ఉగాండా మాత్రం అతివేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపింది.

07/07/2017 - 01:09

హ్యాంబర్గ్, జూలై 6: భారతీయ ఆధార్‌కు అంతర్జాతీయ గుర్తింపు, ప్రశంస లభించింది. ఆర్థిక సమీకృత వ్యవస్థను పాదుగొల్పేందుకు ప్రపంచ దేశాలన్నీ తంటాలు పడుతున్న తరుణంలో భారత ప్రభుత్వం ఆధార్ ద్వారా ప్రజలందరినీ ఆర్థిక ప్రక్రియలో అనుసంధానం చేయడం అద్భుతమని అంతర్జాతీయ ఆర్థిక సంస్కరణల సంస్థ ఎఫ్‌ఎస్‌బి కితాబిచ్చింది.

Pages