S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

07/07/2017 - 01:08

ఇజ్రాయెల్‌లో మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన భారత సైనికుల స్మారక కేంద్రం హైఫా వద్ద నివాళులు అర్పిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ. మూడు రోజుల పాటు ఇజ్రాయెల్‌లో పర్యటించిన మోదీ జి-20 సదస్సులో పాల్గొనేందుకు జర్మనీ బయలుదేరి వెళ్లారు.

07/06/2017 - 03:00

జెరూసలేం, జూలై 5: ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఆ దేశ అధ్యక్షుడు రూవెన్ రివ్లిన్‌ను కలిశారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలను ఎలా బలోపేతం చేసుకోవాలి, ఇజ్రాయెల్ ఆధునిక పరిజ్ఞానం ‘మేక్ ఇన్ ఇండియా’కు ఏ విధంగా తోడ్పడుతుందో చర్చించారు. ఇజ్రాయెల్‌ను నిజమైన మిత్రుడిగా మోదీ అభివర్ణిస్తూ, గత ఏడాది నవంబర్‌లో రివ్లిన్ భారత దేశ పర్యటనను గుర్తు చేసుకున్నారు.

07/06/2017 - 03:00

జెరూసలేం, జూలై 5: మూడు రోజుల పర్యటనకోసం వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ ప్రభుత్వం ఘనమైన ఏర్పాట్లు చేసింది. ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన హోటల్‌లో మోదీకి బస ఏర్పాటు చేసింది. కింగ్ డేవిడ్ హోటల్‌లో మోదీ బస చేసిన సూట్‌ను బాంబు దాడులు, రసాయనిక దాడులు.. ఇలా ఎలాంటి దాడులు కూడా ఏమీ చేయలేవని ఆ హోటల్ ప్రతినిధి షెల్డన్ రిట్జ్ చెప్పారు.

07/06/2017 - 02:59

టెల్ అవీవ్, జూలై 5: ప్రధాని నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్‌లో లభించిన అసాధారణ స్వాగతం చూసి తాము ఎంతో గర్విస్తున్నామని, అమెరికా అధ్యక్షులకు సైతం ఇలాంటి స్వాగతం లభించలేదని ఇజ్రాయెల్‌లోని భారతీయ సంతతివారు అంటున్నారు. ఇజ్రాయెల్‌లో నాలుగు తెగలకు చెందిన దాదాపు 8 వేల మంది భారతీయ సంతతి యూదులున్నారు. ముంబయి ప్రాంతానికి చెందినవారు బెనె ఇజ్రాయెల్ కాగా, కేరళకు చెందిన వారిని కొచిన్స్ అని పిలుస్తారు.

07/06/2017 - 02:59

జెరూసలేం, జూలై 5: భారతీయుల మేథోశక్తి సామర్థ్యాలకు ప్రముఖ గణిత శాస్తవ్రేత్త శ్రీనివాస రామానుజన్ నిదర్శనమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. అంతేకాదు రెండు దేశాల మధ్య మేథోసంపత్తి భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు దోహదపడాలని ఆయన మోదీని అభ్యర్థించారు. రామానుజన్‌పై ప్రశంసల వర్షం కురిపించిన నెతన్యాహు ఆయన ప్రపంచంలోనే గొప్ప మేధావుల్లో ఒకరని అన్నారు.

07/06/2017 - 02:59

బీజింగ్, జూలై 5: సిక్కిం ప్రతిష్టంభనపై చైనా మరింత పట్టుబిగించింది. ఇరు దేశాల మధ్య కుదిరిన పంచశీల సిద్ధాంతాలనే భారత్ తుంగలో తొక్కుతోందని, అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించింది. సాధ్యమైనంత త్వరగా చేసిన తప్పును సరిదిద్దుకుని వివాదాస్పద ప్రాంతంనుంచి బలగాలను ఉపసంహరించాలని భారత్‌కు విజ్ఞప్తి చేసింది.

07/06/2017 - 02:58

టెల్ అవీవ్, జూలై 5: ముంబయిలో 2008లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ప్రాణాలతో బైటపడిన ఓ చిన్నారి మోషేను ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీని బుధవారం జెరూసలేంలో కలుసుకొన్నారు. 2008లో ఉగ్రవాదులు ముంబయిలోని చాబాద్ హౌస్‌పై దాడి చేసినప్పుడు మోషే హోల్జ్‌బెర్ వయసు రెండేళ్లు మాత్రమే. టెర్రరిస్టులు మోషే తల్లిదండ్రులు రివ్కా, గావ్రియెల్ హోల్జ్‌బెర్గ్‌లతో పాటుగా చాలామందిని హతమార్చారు.

07/06/2017 - 02:58

టెల్ అవీవ్, జూలై 5: భారత్-ఇజ్రాయెల్ సంబంధాలు పరస్పర నమ్మకం, విశ్వాసం, సుహృద్భావ పునాదులపైనే బలోపేతం అయ్యాయని ప్రధాని నరేంద్రమోదీ బుధవారం రాత్రి ఇక్కడ అన్నారు. టెల్ అవీవ్ కనె్వన్షన్ కేంద్రానికి తరలివచ్చిన వేలాది మంది ఎన్నారైలను ఉద్దేశించి భావోద్వేగ రీతిలోనే మోదీ మాట్లాడారు.

07/06/2017 - 02:20

న్యూఢిల్లీ, జూలై 5: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య జర్మనీలోని హాంబర్గ్‌లో భేటీ తర్వాతే రెండు దేశాల మధ్య నెలకొన్న డోక్లామ్ వివాదం పరిష్కారం కావచ్చు. హాంబర్గ్‌లో ఈ నెల 7, 8 తేదీల్లో జి20 శిఖరాగ్ర సమావేశాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆయా దేశాల అధినేతలు విడివిడిగా సమావేశమై తమ దేశాల సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించుకోవటం ఆనవాయితీ.

07/06/2017 - 02:57

జెరూసలేం, జూలై 5: భారత్- ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు కొత్త పుంతలు తొక్కాయి. ఈ బంధాన్ని మరింత పటిష్టం చేసుకునే రీతిలో వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరుస్తున్నట్టు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు బుధవారం ఇక్కడ ప్రకటించారు. అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిళించేందుకు ఇరుదేశాలు మరింత లోతైన సహకారాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించారు.

Pages