S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

07/05/2017 - 02:17

లండన్, జూలై 4: పారిస్ పర్యావరణ ఒడంబడికనుంచి వైదలగాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో భూగోళం తీవ్ర ప్రమాదంలో పడనుందని, శుక్రగ్రహంలాగా అత్యంత వేడి కలిగిన గ్రహంగా మారిపోయే ప్రమాదం ఉందని ప్రముఖ బ్రిటిష్ భౌతిక శాస్తవ్రేత్త స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించారు. పారిస్ ఒప్పందం అమెరికా వాణిజ్య సంస్థల ప్రయోజనాలకు హాని కలిగించేదిగా ఉందని అన్నారు.

07/05/2017 - 02:06

లండన్, జూలై 4: విశ్వం ఏర్పడిన తొలినాళ్లకు చెందిన ఓ చిన్ని గెలాక్సీని అంతరిక్ష పరిశోధకులు కొత్తగా కనుగొన్నారు. బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం విస్ఫోటనం తర్వాత అనేకానేక గెలాక్సీలలాగా ఈ చిన్ని గెలాక్సీ లిటిల్ కబ్ కూడా ఏర్పడింది. భూమికి కేవలం 50 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ లిటిల్ కబ్ నక్షత్ర మహాకూటమి ఉర్షా మేయర్‌పైన ఉందని గుర్తించారు.

07/05/2017 - 02:13

సియోల్, జూలై 4: పొరుగు దేశాలపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూ, దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న ఉత్తర కొరియా మరోసారి రెచ్చిపోయింది. అమెరికా, జపాన్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ మంగళవారం మరోసారి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష జరిపింది. కాగా, ఈ ఖండాంతర క్షిపణి పరీక్ష విజయవంతమయిందని, అత్యంత శక్తివంతమైన ఈ క్షిపణి ప్రపంచంలోనే ఏ ప్రాంతాన్నయినా ధ్వంసం చేయగలదని ఉత్తర కొరియా ప్రభుత్వ టీవీ ప్రకటించింది.

07/05/2017 - 02:01

జెరూసాలెం, జూలై 4: పాకిస్తాన్‌నుంచి ఎదురవుతున్న ఉగ్రవాదంపై భారత్ సాగిస్తున్న పోరుకు తమ దేశం పూర్తి మద్దతునిస్తుందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మార్క్ సోఫర్ అన్నారు. ఉగ్రవాద ముప్పునుంచి దేశాన్ని రక్షించుకోవడంలో భారత్‌కు పూర్తి హక్కు ఉందని ఆయన పేర్కొన్నారు. మా దేశంలో హమస్ వంటిదే లష్కరే తోయిబా అని, ఇరు దేశాలు ఉగ్రవాద ముప్పును ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు.

07/05/2017 - 01:31

టెల్ అవీవ్, జూలై 4: ఇజ్రాయెల్‌లో అడుగుపెట్టిన తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోదీకి మంగళవారం టెల్ అవీవ్‌లో అత్యంత ప్రత్యేకమైన స్వాగతం లభించింది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బెన్ గ్యూరియన్ విమానాశ్రయానికి మొత్తం కేబినెట్ మంత్రులతో తరలివచ్చి మోదీని సాదరంగా ఆహ్వానించారు. హిందీలో మాట్లాడిన నెతన్యాహు ‘ఆప్‌కా స్వాగత్ హై.. మేరా దోస్త్’ అంటూ మోదీని అక్కున చేర్చుకున్నారు.

07/04/2017 - 01:48

బెర్లిన్, జూలై 3: జర్మనీలోని బవారియా హైవేపై సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తూర్పు జర్మనీలోని సాక్సోని నుంచి సీనియర్ సిటిజన్స్‌తో వస్తున్న బస్సును ట్రక్ ఢీకొన్న ఘటనలో 18మంది సజీవ దహనమయ్యారు. ప్రమాదంలో మరో 30మంది తీవ్రంగా గాయపడినట్టు తెలిపారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే సమీప ప్రాంతాల నుంచి అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి.

07/04/2017 - 00:35

మొసోల్, జూలై 3: అంతమైపోయిందనుకున్న ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ మళ్లీ జడలువిప్పింది. ఐసిస్ కంచుకోటగా కొనసాగిన మొసోల్ ఇరాక్ దళాల వశమైన నేపథ్యంలో ఇక రెండో ప్రధాన పట్టణాన్ని స్వాధీనం చేసుకునేందుకు దళాలు సిద్ధమవుతున్న తరుణంలో ఐసిస్ ఉగ్రవాద సంస్థ ఆత్మాహుతి బాంబర్లతో రక్తాన్ని చిందించింది.

07/04/2017 - 00:34

లాహోర్, జూలై 3: కుల్‌భూషణ్ జాధవ్‌కు క్షమాభిక్ష పెట్టొద్దని, అతనికి విధించిన ఉరి శిక్షను వెంటనే అమలు చేయాలని మహమూద్ అహ్మద్ నఖ్వీ అనే పౌరుడు లాహోర్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. పాక్‌లో విధ్వంసం సృష్టించేందుకు కుట్రపన్నానని జాధవ్ తన నేరాన్ని అంగీకరించాడని ఇక ఆలస్యం చేయకుండా అతనికి విధించిన మరణశిక్ష అమలు చేయాలని పిటిషనర్ కోరాడు. జాధవ్‌పై ఎటువంటి కరుణ చూపకుండా కోర్టు ఆదేశాలు జారీ చేయాలని కోరాడు.

07/04/2017 - 00:33

జెరూసాలెమ్, జూలై 3: ప్రధాని మోదీ మూడు రోజుల పర్యటనకు మంగళవారం ఇజ్రాయెల్ వెళ్లనున్నారు. ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి సంబంధాలు ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మోదీ ఇజ్రాయెల్ పర్యటన ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా వివిధ ఒప్పందాలపై ఇరు దేశాల ప్రధానులు సంతకాలు చేయనున్నారు.

07/03/2017 - 02:49

మాస్కో, జూలై 2: రష్యాలో ఓ బస్సు ప్రమాదానికి గురై 14మంది సజీవదహనమయ్యారు. తతర్‌స్తాన్ రిపబ్లిక్‌లో ప్రయాణికులతో ఉన్న ఓ బస్సు ట్రక్కును ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో 14మంది అక్కడికక్కడే చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. బస్సు మంటల్లో చిక్కుకున్న దృశ్యాలు సిసి కెమెరాల్లో రికార్డయిందని, ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు వారు తెలిపారు.

Pages