S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

07/03/2017 - 02:47

డమాస్కస్, జూలై 2: అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియా రాజధాని డమాస్కస్‌లో ఆదివారం కారుబాంబులతో దద్దరిల్లింది. కారుబాంబర్లను గుర్తించిన భద్రతా బలగాలు వెంటాడుతున్న సమయంలోనే రెండు కారు బాంబులు పేలి 18మంది దుర్మరణం చెందారు. వీరిలో ప్రభుత్వ అనుకూల బలగాలకు చెందిన ఏడుగురితో పాటు మరో ఇద్దరు పౌరులు ఉన్నారు. మిగిలినవారిని ఇంకా గుర్తించలేదు.

07/03/2017 - 01:56

వాషింగ్టన్, జూలై 2: భారత్‌తో వ్యూహాత్మక, వాణిజ్య సంబంధాలను పెంపొందించుకునేందుకు అమెరికా పార్లమెంట్ ఎంతో సానుకూలంగా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల అమెరికాలో పర్యటించడానికి ముందు ఆ దేశ చట్టసభల సభ్యులకోసం సిఆర్‌ఎస్ (కాంగ్రెసనల్ రీసెర్చ్ సర్వీస్) రూపొందించిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. భారత్-అమెరికా సంబంధాల్లోని ప్రధాన కోణాలను కూలంకషంగా సమీక్షించి ఈ నివేదికను రూపొందించింది.

07/03/2017 - 01:24

బీజింగ్, జూలై 2: అత్యంత బరువైన ఉపగ్రహాన్ని మోసుకెళ్లే ‘లాంగ్ మార్చ్-5వై 2’రాకెట్‌ను ప్రయోగించడానికి చైనా ఆదివారం జరిపిన రెండో ప్రయత్నం విఫలమైంది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 7.23 గంటలకు హైనాన్ రాష్ట్రంలోని వెన్‌చాంగ్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంనుంచి ఈ రాకెట్‌ను ప్రయోగించిన తర్వాత సాంకేతిక లోపాన్ని గుర్తించినట్లు అధికార వార్తాసంస్థ జిన్హువా తెలిపింది.

07/03/2017 - 00:44

దుబాయ్, జూలై 2: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సముద్ర జలాల్లో చిక్కుకున్న వందమంది భారతీయ నావికులు సహాయం కోసం అల్లాడుతున్నారు. 22 పడవల్లో సుమారు వందమంది భారతీయ నావికులు చిక్కుకుపోవడంతో వీరంతా దుబాయ్ కాన్సులేట్‌ను ఆదుకోవాలని అర్థిస్తున్నారు.

07/03/2017 - 00:44

ఇస్లామాబాద్, జూలై 2: కుల్‌భూషణ్ జాధవ్‌ను ఇక్కడ శిక్ష అనుభవిస్తున్న సామాన్య ఖైదీలతో భారత్ పోల్చడం అవహేళనే అవుతుందని పాకిస్తాన్ పేర్కొంది. పాకిస్తాన్‌లో శిక్షణనుభవిస్తున్న ఆ దేశ సామాన్య పౌరుల జాబితాలో జాధవ్‌ను చేర్చడం భారత్ ఈ కేసును నీరుగార్చేందుకు చేస్తున్న ప్రయత్నం మాత్రమేనని విదేశాంగ కార్యాలయం విమర్శించింది.

07/02/2017 - 01:21

హాంకాంగ్, జూలై 1: హాంకాంగ్‌పై తమకు గల అధికారాన్ని ఎవరూ సవాలు చేయడానికి వీల్లేదని, ఈ విషయంలో తమ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే ‘ప్రమాద రేఖ’ (రెడ్ లైన్)ను అతిక్రమించడమే అవుతుందని ఆ దేశంలోని ఉద్యమకారులను చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ హెచ్చరించారు.

07/02/2017 - 01:20

న్యూఢిల్లీ/ఇస్లామాబాద్, జూలై 1: పాకిస్తాన్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్న భారతీయుడు కుల్‌భూషన్ జాధవ్‌కు పూర్తి న్యాయ సహాయం వీలైనంత త్వరగా అందించాల్సిందిగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం మళ్లీ కోరింది. ఇరు దేశాల్లో బంధీలుగా ఉన్న తమ దేశ పౌరుల జాబితాను పాకిస్తాన్, భారత్‌లు శనివారం పరస్పరం అందజేసుకున్నాయి.

07/01/2017 - 00:42

వాషింగ్టన్, జూన్ 30: అమెరికాలో వలసలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన నిషేధం పాక్షికంగా అమలులోకి రావడంతో ఆ దేశంలో మళ్లీ నిరసనలు భగ్గు మంటున్నాయి. ప్రధానంగా ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉన్న దేశాలను లక్ష్యంగా చేసుకుని ట్రంప్ విధించిన ఈ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ అమెరికాలోని ప్రధాన విమానాశ్రయాల వద్ద వందలాది మంది లాయర్లు, మానవ హక్కుల కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

06/30/2017 - 01:24

మోసుల్, జూన్ 29: ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ సంస్థ మూడేళ్ల క్రితం తమ సొంత దేశాన్ని ప్రకటించుకున్న మోసుల్‌లోని చరిత్రాత్మక అల్-నూరి మసీదును ఇరాక్ ప్రభుత్వ దళాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయని ఇరాక్ సైన్యం గురువారం ప్రకటించింది.

06/30/2017 - 01:24

వాషింగ్టన్ జూన్ 29: హెచ్-1బి వీసాలపై పని చేసే విదేశీ వర్కర్ల కనీస వేతనాన్ని ఇప్పుడున్న 60 వేల డాలర్లనుంచి కనీసం 80 వేల డాలర్లకు పెంచాలని అమెరికా కార్మిక శాఖ మంత్రి అలెగ్జాండర్ అకోస్టా సూచించారు. భారతీయ ఐటి నిపుణుల్లో ఎక్కువ మంది ఈ హెచ్-1బి వీసాలపైనే అమెరికా వెళ్తున్న విషయం తెలిసిందే.

Pages